కొరియన్స్ అందరూ సన్నగా ఉండరు , మన ఊళ్ళో లాగే లావుగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా కొరియన్స్ తో కొరియాలో ఒక నెల గడిపిన అనుభవంతో చెపుతున్న విషయాలు.
ఆహారపు అలవాట్లు. వాళ్ళు ఎప్పుడూ వెజ్, నాన్ వెజ్ సమ పాళ్ళలో తింటారు. అది కూడా చేపలు, రొయ్యలుపీతలు లాంటి సీ ఫుడ్ ఎక్కువ తీసుకుంటారు.
భోజనం సమయాలు. మార్నింగ్ ఎవరూ మన లాగా హెవీ ఫుడ్ తినరు. ఒక జ్యూస్ లాంటిది తాగేసి వర్క్ కి వెళ్ళిపోతారు , మధ్యాహ్నం భోజనము 12 కి తినేస్తారు. సాయంత్ర భోజనము 6 గంటలకే అయి పోతుంది. నైట్స్ మందు( సోజూ అనే సారాయం ఎక్కువగా ) కొట్టాక, మళ్ళీ ఏదైనా తింటారు.
కొరియాలో ఒక రూల్ ఉంది. ప్రతి ఒక్కరు కచ్చితంగా మిలిటరీ లో 2 సంవత్సరాలు వర్క్ చేయాలి. ఇక ఆలోచించండి వాళ్ళ శరీరం ఎలా సన్నగా అవుతుంది అని.