Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home lifestyle

రూ. 76 లక్షలు పెద్ద జీతం కాదు.. ఉద్యోగం పోయినందుకు నేనుచాలా హ్యాపీ: మహిళా సాఫ్ట్‌వేర్ ఉద్యోగి

Admin by Admin
April 20, 2025
in lifestyle, వార్త‌లు
Share on FacebookShare on Twitter

పది వేల నుంచి పాతిక వేల జీతమిచ్చే ఉద్యోగం పోతేనే ఎలా బ్రతకలిరా బావోయ్ అని గుక్కపట్టి ఏడ్చే రోజులివి. ఇలాంటి ఈ కాలంలో ఏడాది రూ. 76 లక్షల జీతం వచ్చే ఉద్యోగం పోయిందందుకు ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సంతోషంగా ఉంద‌ట.బయటకు అలా చెప్తోంది కానీ, లోలోపల ఎంత కుమిలిపోయుంటదో కదా..! 24 ఏళ్ల సియెర్రా డెస్మరాట్టి అనే మహిళా ఉద్యోగి రెండేళ్ల ముందు(2022లో) చికాగోలోని డెలాయిట్‌ కంపెనీలో అనలిస్ట్‌‪గా ఉద్యోగంలో చేరింది. ఇప్పుడు ఆమె జీతం ఏడాదికి రూ. 76 లక్షలు. అయితే, ఆర్థిక మాంద్యం భయాలు, ఖర్చుల తగ్గింపులో భాగంలో కంపెనీ ఆమెను ఉద్యోగం నుండి తీసేసింది. మిమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగించాం.. మున్ముందు ఆఫీస్ కు రానక్కర్లేదు.. అని డెలాయిట్‌ కంపెనీ డెస్మరాట్టికి ఈ-మెయిల్ ద్వారా లేఆఫ్ విషయాన్ని తెలియజేసింది. ఆ సందేశం చూడగానే ఆమె ఎగిరి గంతేసిందట. ఈ విషయాన్ని ఉద్యోగం పోయిన ఏడాది తరువాత బయటపెట్టింది.

జీవితంలో తనకేదైనా మంచి జరిగిందంటే.. అది ఈ ఉద్యోగం పోవడమేనని డెస్మరాట్టి చెప్పుకొచ్చింది. రోజంతా కుర్చీలో కూర్చోలేకపోయానని, పొట్టి బట్టలేసుకుని తోటి ఉద్యోగుల ముందు నడవలేకపోయానని ఆమె తాను పడిన బాధనంతా వెళ్లగక్కింది. నేను తక్కువ ఆదాయ కుటుంబం నుంచి వచ్చిన దానిని. అయినప్పటికీ నా ఉద్యోగం పోయినందుకు చాలా సంతోషించపడ్డా. నేను ఉద్యోగంలో చేరిన సమయంలో డెలాయిట్‌ భవనంలో 80 నుండి 90 మంది ఉద్యోగులు ఉండేవారు. వారిని చూశాక.. వారిలాగే బట్టలు ధరించాల్సి వచ్చింది. నాకవి నచ్చేవి కాదు కానీ, తప్పలేదు. అంతేకాదు రోజంతా సీటుకు అతుక్కుపోవడం వల్ల వెన్ను నొప్పి వచ్చింది. పని ఒత్తిడితో నచ్చిన ఆహారాన్ని తినలేకపోయా.. స్నాక్స్‌పై ఆధారపడటం వల్ల నెలల వ్యవధిల్లోనే 9 కిలోల బరువు పెరిగా.. చివరకు ఉద్యోగం పోయాక చాలా సంతోష పడ్డా..

woman lost her job but she is very much happy

ఇక రూ.76 లక్షలు జీతమంటారా..! అది నా మనుగడకు సాధనం తప్ప అదే జీవితం కాదు. పొదుపు చేసిన డబ్బుతో రెండు నెలలు గడిపాను.. తరువాత ట్రాన్స్‌అమెరికాకు చెందిన కంపెనీలో యాక్చురియల్ అనలిస్ట్‌గా రిమోట్ ఉద్యోగం వచ్చింది. చాలా హ్యాపీగా ఉన్నా.. అని డెస్మరాట్టి వెల్లడించింది. కాగా, గత రెండేళ్లుగా కాస్ట్ కటింగ్ లో భాగంగా కంపెనీలన్నీ ఉద్యోగులను తొలగిస్తున్న విషయం తెలిసిందే. అలాంటి వారందరూ ఉద్యోగం పోయిందని ఏడవకుండా.. మరొకటి చూసుకోవాలని ధైర్యాన్ని ఇచ్చేదుకు ఆమె ఈ హిత బోధన చేసిందనమాట. కావున ఉద్యోగం పోతే ఏడవకండి.. మీ బాస్ మిమ్మల్ని వేధించిన ఘటనలు, తిట్టిన తిట్లు గుర్తు తెచ్చుకోండి.. సంతోషపడతారు.

Tags: woman
Previous Post

ఒంట్లో షుగర్‌ లెవెల్స్ తగ్గాలంటే వాకింగ్ ఇలా చేయాలి.. లేదంటే బండి షెడ్డుకే!

Next Post

ఛత్రపతి శంభాజీ మహారాజ్ మరణానికి మరాఠాలు ఎలా ప్రతీకారం తీర్చుకున్నారో మీకు తెలుసా?

Related Posts

ఆధ్యాత్మికం

స్త్రీలు సాష్టాంగ న‌మ‌స్కారం ఎందుకు చేయ‌కూడ‌దు..? దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటి..?

July 22, 2025
హెల్త్ టిప్స్

పాప్‌కార్న్‌ను అధికంగా తింటున్నారా..? అయితే ముందు ఈ విష‌యాల‌ను తెలుసుకోండి..!

July 22, 2025
inspiration

మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ వాడే ఫోన్ ఏంటో తెలుసా..? ఆపిల్ iPhone వాడకపోవటానికి కారణం ఇదే..!

July 22, 2025
హెల్త్ టిప్స్

రోజూ భోజ‌నంలో పెరుగును త‌ప్ప‌నిస‌రిగా తినాల్సిందే.. ఎందుకంటే..?

July 22, 2025
mythology

ఈ ప‌నులు చేస్తున్నారా..? అయితే ఆయుష్షు త‌గ్గుతుంద‌ట‌.. గ‌రుడ పురాణంలో చెప్పారు..!

July 22, 2025
వినోదం

1980లో టాలీవుడ్ హీరోలు ఎంత రెమ్యూనరేషన్ తీసుకునే వారో తెలుసా?

July 22, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.