Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home lifestyle

వ్య‌క్తులు ఇష్ట‌ప‌డే రంగుల‌ను బ‌ట్టి ఎవ‌రి మ‌న‌స్త‌త్వం, వ్య‌క్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా..?

Admin by Admin
March 25, 2025
in lifestyle, వార్త‌లు
Share on FacebookShare on Twitter

మాన‌వుని క‌ళ్లు సృష్టిలో ఉన్న ఎన్నో వేల కోట్ల రంగుల‌ను గుర్తించ‌గ‌ల‌వు. అంత‌టి శ‌క్తి వాటికి ఉంది. అన్ని వేల కోట్ల రంగుల‌ను కెమెరాలు కూడా చిత్రాల రూపంలో బంధించ‌గ‌ల‌వు. అయితే నిజానికి ప్రాథ‌మిక రంగులు మూడే. అవి ఎరుపు, ఆకుప‌చ్చ‌, నీలం. వీటిని ప‌లు శాతాల్లో క‌లిపితేనే అన్ని రంగులూ ఏర్ప‌డ‌తాయి. ఈ క్ర‌మంలోనే మ‌న‌లో చాలా మందికి ఒక్కో రంగు అంటే అమితంగా ఇష్టం ఉంటుంది. అందుకే నిర్దిష్ట రంగుల‌తో చేసిన వ‌స్తువుల‌నే చాలా మంది వాడుతారు. అయితే అలా వారు ఇష్ట‌ప‌డే రంగుల‌ను బ‌ట్టి వారి మ‌న‌స్త‌త్వాలు ఎలా ఉంటాయో చెప్ప‌వ‌చ్చు తెలుసా..? అవును, ఎవ‌రైనా వారు ఇష్ట‌ప‌డే రంగును బ‌ట్టి వారు ఎలాంటి వారో, వారి వ్య‌క్తిత్వం ఎలా ఉంటుందో చెప్ప‌వ‌చ్చు. మ‌రి ఏయే రంగుల వ‌ల్ల మ‌న‌కు వ్య‌క్తుల మ‌న‌స్త‌త్వాలు తెలుస్తాయంటే… ఎరుపు… వీరు చాలా ప‌ట్టుద‌ల క‌లిగి ఉంటారు. ధైర్య‌వంతులు అయి ఉంటారు. ఆశావ‌హ దృక్ప‌థం క‌లిగి ఉంటారు. మ‌న‌స్సులో ఏది ఉన్నా ఇట్టే బ‌య‌ట‌కు చెబుతారు త‌ప్ప దాచుకోరు. ఎంత‌టి విష‌యాన్న‌యినా ఎవరితోనైనా ముఖంపైనే చెప్ప‌గ‌లిగే స‌మ‌ర్థ‌త క‌లిగి ఉంటారు. ఏ ప‌నిచేసినా 100 శాతం కష్ట‌ప‌డ‌తారు. అదే స్థాయిలో సంతృప్తిని ఆశిస్తారు.

ఆరెంజ్‌… వీరు స‌హ‌న‌శీలురు అని చెప్ప‌వ‌చ్చు. ఏ విష‌యం ప‌ట్ల‌నైనా ఆచి తూచి స్పందిస్తారు. స‌హ‌నంతో ఉంటారు. అంద‌రితోనూ స్నేహ పూర్వ‌కంగా మెలుగుతారు. స‌మాజంలో ఉన్న అంద‌రితో క‌లుపుగోలుగా ఉండాల‌ని చూస్తారు. ఏ సంఘంలోనైనా త‌గిన గుర్తింపు తెచ్చుకుంటారు. ప‌సుపు… ప‌సుపు రంగును ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డే వారు ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారు. హాస్య‌త‌ను ప్ర‌ద‌ర్శిస్తారు. ఎప్పుడూ ఒకే త‌ర‌హా ఆలోచ‌న‌లు కాక‌, భిన్న‌మైన ఆలోచ‌న‌లు చేస్తారు. అయితే జీవితాన్ని మాత్రం సీరియ‌స్‌గానే తీసుకుంటారు. ఒక ఆర్డ‌ర్‌లో అన్నీ జ‌ర‌గాల‌ని కోరుకుంటారు. ఆకుప‌చ్చ‌… ఈ రంగును ఇష్ట‌ప‌డే వారు జాలి, ద‌య, క‌రుణ గుణాల‌ను క‌లిగి ఉంటారు. ఇత‌రుల‌కు ఎప్పుడూ స‌హాయం చేయాల‌ని చూస్తారు. అంద‌రినీ ప్రేమిస్తారు. అంద‌రికీ సుర‌క్షిత‌మైన జీవితం కావాల‌ని ఆశిస్తారు.

your favorite color can tell your personality

నీలం… ఈ రంగును ఇష్ట‌ప‌డే వారు ఇత‌రుల ప‌ట్ల అత్యంత న‌మ్మ‌క‌స్తులుగా ఉంటారు. వీరికి మోసం చేయ‌డం రాదు. చేయ‌లేరు. అన్ని విష‌యాల్లోనూ అంద‌రి ప‌ట్ల న‌మ్మ‌కంగా ఉంటారు. ఇత‌రుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించ‌డంలో ముందుంటారు. అంత సుల‌భంగా, వృథాగా దేన్నీ ఖ‌ర్చు చేయ‌రు. ముదురు నీలం… వీరు నీతి, నిజాయితీల‌ను క‌లిగి ఉంటారు. స్వార్థం అంటే తెలియ‌దు. ఇత‌రుల‌ను చాలా బాగా అర్థం చేసుకుంటారు. అందుకోసం ఏం చేయ‌డానికైనా వెనుకాడ‌రు. ఊదా (వంకాయ‌) రంగు… వీరు చాలా మృదువైన స్వ‌భావం క‌లిగి ఉంటారు. చిన్న మాట అన్నా త‌ట్టుకోలేరు. భావోద్వేగాల‌కు లోన‌వుతారు. ఆప్యాయంగా ఉంటారు. ప్రేమించిన వారు దూర‌మైతే త‌ట్టుకోలేరు. ఆధ్యాత్మిక భావాల‌ను క‌లిగి ఉంటారు.

పింక్‌… ఈ రంగును ఇష్ట‌ప‌డేవారు ఇత‌రుల‌ను బాగా ప్రేమిస్తారు. మృదు స్వ‌భావులు అయి ఉంటారు. ఇత‌రుల అవ‌స‌రాల‌ను స‌రిగ్గా గుర్తించ‌గ‌లుగుతారు. ఒక‌సారి దూర‌మై మ‌ళ్లీ ద‌గ్గ‌రైనా ఇత‌రుల‌ను ప్రేమిస్తారు త‌ప్ప ద్వేషించ‌రు. మెజెంటా (Magenta)… ఈ రంగు అంటే ఇష్ట‌ప‌డేవారు ఎక్కువ ఊహా శ‌క్తిని క‌లిగి ఉంటారు. వీరు సృజ‌న‌శీలురుగా ఉంటారు. కొత్త ఆవిష్క‌ర‌ణ‌ల‌ను సృష్టించ‌గ‌ల‌రు. ప్రతిభా పాట‌వాలు ఎక్కువ‌. త‌మ చుట్టూ ఉన్న‌వారిని, ప్ర‌కృతిని ఎక్కువ‌గా ప్రేమిస్తారు. వీరు అన్ని భావాల ప‌ట్ల స‌రైన నియంత్ర‌ణ క‌లిగి ఉంటారు. టర్కాయిస్ (Turquoise)… ఈ రంగును ఇష్ట‌ప‌డే వారు స్నేహ పూర్వ‌క స్వభావం క‌లిగి ఉంటారు. ఎంత‌టి ఉన్న‌త స్థానాల్లో వీరు ఉన్న‌ప్ప‌టికీ ఇత‌రుల‌ను సుల‌భంగా క‌ల‌వ‌గ‌ల‌రు. సామాన్యులుగా ఉంటారు. వీరు తాము అనుకున్న ల‌క్ష్యాలు ఎంత క‌ష్ట‌మైన‌ప్ప‌టికీ, ఇత‌రులు హేళ‌న చేస్తార‌ని అనుకున్నప్ప‌టికీ వాటిని పైకి చెప్పేస్తారు.

గ్రే (Grey)… ఈ రంగును ఇష్ట‌ప‌డే వారికి జీవితం ప‌ట్ల పెద్ద‌గా ఆస‌క్తి ఉండ‌దు. అన్ని విష‌యాల‌ను అంత సీరియ‌స్‌గా తీసుకోరు. త‌ట‌స్థ స్వ‌భావం క‌లిగి ఉంటారు. అంత‌గా స్పందించ‌రు. కానీ వ్య‌క్తిగతంగా చాలా కూల్‌గా, ప్ర‌శాంతంగా ఉంటారు. ఇత‌రుల‌కు మ‌ర్యాద ఎక్కువ‌గా ఇస్తారు. తెలుపు… వీరు ఆశావ‌హ దృక్ప‌థం క‌లిగి ఉంటారు. అన్ని విష‌యాల ప‌ట్ల పాజిటివ్ ధోర‌ణితో ఉంటారు. నెగెటివ్ ఆలోచ‌న‌లు ఉండ‌వు. చేసే ఏ ప‌నిలో అయినా శ్ర‌ద్ధ పెడ‌తారు. పాజిటివ్‌గా రిజ‌ల్ట్ ఆశిస్తారు. లైఫ్‌ను చాలా సింపుల్‌గా గ‌డుపుతారు. ఆడంబరాల‌కు పోరు. న‌లుపు… ఈ రంగు ఇష్ట‌ప‌డేవారు ప‌వ‌ర్‌ను కోరుకుంటారు. అధికారంలో ఉండ‌డం, గౌర‌వ, మ‌ర్యాద‌లు వంటి అంశాల‌కు అధిక ప్రాధాన్య‌త‌ను ఇస్తారు. దృఢ‌మైన విల్ ప‌వ‌ర్ క‌లిగి ఉంటారు. చేసే ప‌ని ప‌ట్ల అంకిత భావం క‌లిగి ఉంటారు. ఉన్న‌త స్థానాల్లో ప‌ద‌వుల‌ను అధిరోహించ‌డ‌మే వీరి జీవిత ఆశ‌యం.

బ్రౌన్… వీరు నీతి, నిజాయితీల‌ను క‌లిగి ఉంటారు. అనుకుంటే ఎంత‌టి ఉన్న‌త స్థానంలో ఉన్నా కింద‌కి దిగి రాగ‌ల‌రు. వీరు కూడా సింపుల్ లైఫ్‌ను కోరుకుంటారు. అయితే లైఫ్ ప‌ట్ల వీరికి భ‌ద్ర‌తా భావం ఎక్కువ‌. సుర‌క్షితంగా జీవించాల‌ని కోరుకుంటారు. సిల్వ‌ర్‌… ఈ రంగు అంటే ఇష్టం ఉండే వారు ఎక్కువ‌గా ఆధ్యాత్మిక భావాల‌ను క‌లిగి ఉంటారు. స‌హ‌జ సిద్ధ‌మైన స్వభావాల‌ను క‌లిగి ఉంటారు. ప్ర‌కృతితో అనుబంధం ఎక్కువ‌. ఏ అంశం ప‌ట్ల అయినా చాలా తెలివిగా వ్యాఖ్య‌లు చేస్తారు. గోల్డ్‌… ఈ రంగు అంటే ఇష్టం ఉండే వారు ప్ర‌త్యేక‌మైన వ్య‌క్తిత్వాన్ని కోరుకుంటారు. త‌మ చరిష్మాతో ఇత‌రుల‌ను ఆక‌ట్టుకుంటారు. ఆధ్యాత్మిక భావాల‌ను క‌లిగి ఉంటారు. ఎప్పుడూ జ్ఞానార్జ‌న కోసం త‌పిస్తుంటారు.

Tags: colorpersonality
Previous Post

100 ఏళ్ల‌కు పైగా జీవించాలంటే ఇలా చేయాల్సిందే..!

Next Post

నిద్రించే భంగిమ‌ల‌ను బ‌ట్టి జంట‌ల మ‌ధ్య అన్యోన్య‌త ఎలా ఉంటుందో చెప్పొచ్చు.!

Related Posts

వినోదం

సీనియర్ ఎన్టీఆర్ నుండి పవన్ కళ్యాణ్ వరకు రెండు పెళ్లిళ్లు చేసుకున్న నటులు ..!!

July 22, 2025
హెల్త్ టిప్స్

రోడ్లపై పునుగులు, బోండాలు, మంచూరియా, తింటున్నారా..అయితే నష్టాలు తప్పవు..!

July 22, 2025
ఆధ్యాత్మికం

స్త్రీలు సాష్టాంగ న‌మ‌స్కారం ఎందుకు చేయ‌కూడ‌దు..? దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటి..?

July 22, 2025
హెల్త్ టిప్స్

పాప్‌కార్న్‌ను అధికంగా తింటున్నారా..? అయితే ముందు ఈ విష‌యాల‌ను తెలుసుకోండి..!

July 22, 2025
inspiration

మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ వాడే ఫోన్ ఏంటో తెలుసా..? ఆపిల్ iPhone వాడకపోవటానికి కారణం ఇదే..!

July 22, 2025
హెల్త్ టిప్స్

రోజూ భోజ‌నంలో పెరుగును త‌ప్ప‌నిస‌రిగా తినాల్సిందే.. ఎందుకంటే..?

July 22, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.