Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home వార్త‌లు

Pregnancy Symptoms : ప్రెగ్నెన్సీ వ‌చ్చే ముందు ల‌క్ష‌ణాలు ఎలా ఉంటాయి.. త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

D by D
May 14, 2023
in వార్త‌లు, వైద్య విజ్ఞానం
Share on FacebookShare on Twitter

Pregnancy Symptoms : త‌ల్లి అవ్వాల‌ని పెళ్లి అయిన ప్ర‌తి స్త్రీ కోరుకుంటుంది. గ‌ర్భం దాల్చిన‌ప్పుడు క‌లిగే ఆ ఆనంద‌మే వేరు. ఎంతో కాలంగా కంటున్న క‌ల‌లు నిజ‌మైన వేళ క‌లిగే ఆనందం అంతా ఇంతా కాదు. అయితే చాలా మంది స్త్రీలు గ‌ర్భం దాల్చిన తరువాత వారు త‌ల్లి కాబోతున్నార‌ని తెలుసుకోలేక పోతుంటారు. వారిలో కొన్ని ల‌క్ష‌ణాలు క‌నిపించిన‌ప్ప‌టికి వాటిని గుర్తించ‌లేక‌పోతుంటారు. అయితే ఈ లక్ష‌ణాలు అంద‌రిలో ఒకే విధంగా ఉండ‌వు. శ‌రీరతత్వాన్ని బ‌ట్టి ఒక్కొక్క‌రిలో ఒక్కోలా ఉంటాయి. కొంద‌రిలో అస‌లు ఏ ల‌క్ష‌ణాలు ఉండ‌క‌పోవ‌చ్చు కూడా. గ‌ర్భం దాల్చిన త‌రువాత అంద‌రిలో మొద‌ట‌గా క‌నిపించే ల‌క్ష‌ణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

గ‌ర్భం దాల్చిన త‌రువాత నెల‌స‌రి రాదు. నెల‌స‌రి రావ‌డం ఆల‌స్య‌మైన ప‌ది రోజుల త‌రువాత‌ వైద్యుని సంప్ర‌దించి ప‌రీక్ష‌లు చేయించుకోవాలి. అలాగే కొంద‌రిలో వాంతులు, వికారం, త‌ల‌నొప్పి, త‌ల తిరిగిన‌ట్టుగా ఉంటుంది. అన్నం తినాల‌నిపించ‌దు. కూర‌ల వాస‌నను భ‌రించ‌లేక‌పోతారు. అదే విధంగా కొంద‌రిలో క‌డుపునొప్పి వ‌చ్చే అవ‌కాశాలు కూడా ఉంటాయి. గ‌ర్భాశ‌యంలో పిండం స్థిర‌ప‌డేట‌ప్పుడు ఈ విధంగా నొప్పి వ‌స్తూ ఉంటుంది. అదే విధంగా కొంద‌రిలో ఛాతి ప‌రిమాణం పెరిగిన‌ట్టుగా ఉంటుంది. స్థ‌నాలు గట్టిగా మారుతాయి. అలాగే స్థ‌నాలు సున్నితంగా త‌యార‌వుతాయి. అయితే కొంద‌రిలో నెల‌స‌రి వ‌చ్చే ముందు కూడా ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. వీటినే ప్రీ మెనుస్ట్రువ‌ల్ సిండ్రోమ్ అని అంటారు.

Pregnancy Symptoms in telugu know about them
Pregnancy Symptoms

అయితే ఈ ల‌క్ష‌ణాలు మూడు రోజుల కంటే ఎక్కువ‌గా ఉంటే మాత్రం త‌ప్ప‌కుండా వైద్యున్ని సంప్ర‌దించాలి. అలాగే గ‌ర్భం దాల్చిన రెండు వారాల నుండి ఎక్కువ‌గా మూత్రానికి వెళ్లాల్సి వ‌స్తుంది. సాధార‌ణ స‌మ‌యంలో ప‌లుచ‌గా వ‌చ్చే వైట్ డిశ్చార్జ్ గ‌ర్భంతో ఉన్న‌ప్పుడు మ‌రింత ఎక్కువ‌గా చిక్క‌గా వ‌స్తుంది. ఈ ల‌క్ష‌ణాల‌ను బ‌ట్టి స్త్రీలు గ‌ర్భం దాల్చారో లేదా సుల‌భంగా తెలుసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

Tags: Pregnancy Symptoms
Previous Post

Butter Pakoda : ప‌కోడీల‌ను ఇలా వెరైటీగా ఒక్క‌సారి చేయండి.. న‌చ్చి తీరుతాయి..!

Next Post

Instant Tomato Dosa : ట‌మాటాల‌తో ఇన్‌స్టంట్‌గా దోశ‌ల‌ను ఇలా వేసుకోవ‌చ్చు..!

Related Posts

హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

September 26, 2025
ఆధ్యాత్మికం

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

September 26, 2025
ఆధ్యాత్మికం

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

September 25, 2025
వినోదం

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

September 25, 2025
ఆధ్యాత్మికం

మీ ఇంట్లోకి ఇలాంటి పక్షులు వస్తున్నాయా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

September 24, 2025
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

September 23, 2025
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.