Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home ఆరోగ్యం

ఐర‌న్‌కు, ర‌క్త‌హీన‌త‌కు మ‌ధ్య ఉన్న సంబంధం ఏమిటో తెలుసా ? క‌చ్చితంగా తెలుసుకోవాల్సిన విష‌యం..!

Admin by Admin
July 31, 2021
in ఆరోగ్యం, వైద్య విజ్ఞానం
Share on FacebookShare on Twitter

మ‌న శ‌రీరంలో ఎర్ర ర‌క్త క‌ణాల సంఖ్య లేదా హిమోగ్లోబిన్ స్థాయిలు త‌క్కువ‌గా ఉంటే ఆ స్థితిని అనీమియా అంటారు. అంటే ర‌క్త‌హీన‌త అని అర్థం. పురుషుల్లో ఎర్ర ర‌క్త క‌ణాల సంఖ్య 13.5gm/100 ml, స్త్రీల‌లో ఎర్ర ర‌క్త క‌ణాల సంఖ్య 12 gm/100 ml క‌న్నా త‌క్కువ ఉంటే ఆ స్థితిని ర‌క్త‌హీన‌త అంటారు. ర‌క్త ప‌రీక్ష‌లు చేయ‌డం ద్వారా ఆ వివరాలు తెలుస్తాయి. ఎర్ర ర‌క్త క‌ణాల ఉత్ప‌త్తి త‌గ్గినా లేదా ఎర్ర ర‌క్త క‌ణాలు నాశ‌నం అయినా ఆ స్థితి వ‌స్తుంది.

what is the relationship between iron and anemia know this

ర‌క్త‌హీన‌త ఉంటే క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే

ర‌క్త‌హీన‌త స‌మ‌స్య ఉన్న‌వారికి త‌ల‌నొప్పి, త‌ల తిర‌గ‌డం, శ‌రీరం తెల్ల‌గా పాలిపోయిన‌ట్లు క‌నిపించ‌డం, శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందులు వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి.

ర‌క్త‌హీన‌త‌కు కార‌ణాలు

గాయాలు అవ‌డం, స‌ర్జరీలు కావ‌డం, పెద్ద‌పేగు క్యాన్స‌ర్‌, పోష‌కాల లోపం (ఐర‌న్‌, విట‌మిన్ బి12, ఫోలేట్‌), బోన్ మారో స‌మ‌స్య‌లు, కిడ్నీ ఫెయిల్యూర్‌, కీమోథెర‌పీ మందుల‌ను వాడ‌డం, బోన్ క్యాన్స‌ర్‌, అసాధార‌ణ రీతిలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ఉండ‌డం, అనీమియా సికిల్ సెల్‌.. వంటి కార‌ణాల వ‌ల్ల ర‌క్త‌హీన‌త స‌మ‌స్య వ‌స్తుంది.

మ‌న శ‌రీరంలో హిమోగ్లోబిన్ లో ఉండే ముఖ్య‌మైన పోష‌కాల్లో ఐర‌న్ ఒక‌టి. ఇక‌ ఎర్ర ర‌క్త క‌ణాలు మ‌న శ‌రీరంలోని అన్ని భాగాల‌కు ఆక్సిజ‌న్‌ను ర‌వాణా చేస్తాయి. మ‌న శ‌రీరంలో ఐర‌న్ త‌గినంత‌గా లేక‌పోతే హిమోగ్లోబిన్ ఉత్ప‌త్తి కాదు. దీంతో అనీమియా (ర‌క్త‌హీన‌త) ఏర్ప‌డుతుంది.

రోజూ మ‌న‌కు కావ‌ల్సిన ఐర‌న్ ఎంతంటే ?

  • 0 నుంచి 6 నెల‌ల మ‌ధ్య వ‌య‌స్సు ఉన్న చిన్నారుల‌కు రోజుకు 0.27 mg ఐర‌న్ అవ‌సరం.
  • 7 నుంచి 12 నెల‌ల మ‌ధ్య వ‌య‌స్సు ఉన్న చిన్నారుల‌కు రోజుకు 11 mg ఐర‌న్ కావాలి.
  • 1 నుంచి 3 ఏళ్ల వ‌య‌స్సు పిల్ల‌ల‌కు రోజుకు 7 mg ఐర‌న్ అవస‌రం.
  • 4 నుంచి 8 ఏళ్ల మ‌ధ్య పిల్ల‌ల‌కు 10 mg ఐర‌న్ కావాలి.
  • 9 నుంచి 13 ఏళ్ల వారికి 8 mg ఐర‌న్‌, 14 నుంచి 18 ఏళ్ల వారికి పురుషులు అయితే 11 mg, స్త్రీలు అయితే 15 mg ఐర‌న్ కావాలి.
  • 19 ఏళ్ల పైన వారికి పురుషుల‌కు అయితే 8 mg, స్త్రీల‌కు అయితే 18 mg ఐర‌న్ కావాలి.
  • గ‌ర్భిణీల‌కు 27 mg, పాలిచ్చే త‌ల్లులకు 10 mg ఐర‌న్ రోజుకు కావ‌ల్సి ఉంటుంది.

రక్త‌హీన‌త స‌మ‌స్య‌కు అస‌లు కార‌ణం క‌నిపెట్టి చికిత్స చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు ఐర‌న్‌, విట‌మిన్ బి12 ఉండే ఆహారాల‌ను, స‌ప్లిమెంట్ల‌ను తీసుకోవాలి. వాటిని డాక్ట‌ర్ల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో వాడాలి.

మ‌న‌కు ఐర‌న్ ఎక్కువ‌గా.. బ్రోక‌లీ, పాల‌కూర‌, ఆలుగ‌డ్డ‌లు (పొట్టుతో), బీన్స్‌, ప‌చ్చి బ‌ఠానీలు, ఇత‌ర అన్ని ర‌కాల బీన్స్‌, యాప్రికాట్స్‌, అంజీర్‌, కిస్మిస్‌, వేరుశెన‌గ‌లు, జీడిప‌ప్పు, పొద్దు తిరుగుడు విత్త‌నాలు, వాల్ న‌ట్స్‌, బాదంప‌ప్పు, హోల్ గ్రెయిన్ బ్రెడ్, పాస్తా, తృణ ధాన్యాలు, బ్రౌన్ రైస్‌ల‌లో.. లభిస్తుంది.

విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరం మ‌నం తినే ఆహారాల్లో ఉండే ఐర‌న్‌ను ఎక్కువ‌గా గ్ర‌హిస్తుంది. కాఫీ, టీ, కోలా, కాల్షియం ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఐర‌న్ శోష‌ణ త‌గ్గుతుంది. కనుక ర‌క్త‌హీన‌త ఉన్న‌వారు ఈ ప‌దార్థాల‌కు దూరంగా ఉండాలి. దీంతో ఐర‌న్ ఎక్కువ‌గా ల‌భిస్తుంది. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య త‌గ్గుతుంది.

Tags: anemiahemoglobinIroniron foodsఅనీమియాఐర‌న్‌ర‌క్త‌హీన‌తహిమోగ్లోబిన్‌
Previous Post

రాత్రి నిద్రించే ముందు ఈ ఆహారాల‌ను తీసుకుంటే మేలు.. ఎందుకో తెలుసా ?

Next Post

Bachali Kura: బ‌చ్చ‌లికూర నిజంగా బంగార‌మే.. దీన్ని తిన‌డం మ‌రిచిపోకండి..!

Related Posts

వైద్య విజ్ఞానం

గోర్ల‌ను ఎందుకు కొరుకుతారో తెలుసా..?

July 28, 2025
వైద్య విజ్ఞానం

డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు ప్రిస్క్రిప్షన్ లో అర్ధం కాకుండా ఎందుకు రాస్తారో తెలుసా.? 3 కారణాలు ఇవే.!

July 25, 2025
వైద్య విజ్ఞానం

ఏ వ‌యస్సులో ఉన్న‌వారికి ఎంత నిద్ర అవ‌స‌రం అంటే..?

July 25, 2025
వైద్య విజ్ఞానం

దంతాలు, చిగుళ్లు, నోరు ఆరోగ్యంగా లేక‌పోతే గుండె జ‌బ్బులు వ‌స్తాయా..?

July 23, 2025
వైద్య విజ్ఞానం

ఈ అల‌వాట్లు మీకు ఉన్నాయా..? అయితే జాగ్ర‌త్త‌.. మీ మాన‌సిక ఆరోగ్యం పాడవుతుంది..!

July 20, 2025
వైద్య విజ్ఞానం

నీళ్ల‌ను త‌గిన మోతాదులో తాగ‌క‌పోతే జ‌రిగే అన‌ర్థాలు ఇవే..!

July 20, 2025

POPULAR POSTS

No Content Available
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.