నిద్ర మనకు ఎంత ఆవశ్యకమో అందరికీ తెలిసిందే. నిద్ర పోవడం వల్ల మన శరీరం రీచార్జ్ అవుతుంది. మరుసటి రోజుకు కావల్సిన హుషారు, కొత్త శక్తి లభిస్తాయి. శరీరంలో పలు మరమ్మత్తు పనులు జరుగుతాయి. కొత్త కణాలు నిర్మాణమవుతాయి. పాత కణాలు పోతాయి. అనారోగ్యాలు నయమవుతాయి. ఇందులో భాగంగానే ఎవరి అనుకూలతలను బట్టి వారు నిద్రిస్తారు. సహజంగా చిన్నారులకు, వృద్ధులకు అయితే రోజుకు కనీసం 10 గంటల వరకు, పెద్దలకు 8 గంటల వరకు నిద్ర అవసరం. కానీ పురుషులు, మహిళలు అనే తేడా విషయానికి వస్తే మాత్రం పురుషుల కన్నా మహిళలకే ఇంకా రోజుకు 20 నిమిషాల ఎక్కువ నిద్ర అవసరమట. అవును, మేం చెబుతున్నది నిజమే. దీన్ని సైంటిస్టులు కనుగొని మనకు చెబుతున్నారు. ఇంతకీ అసలు వారికి ఆ 20 నిమిషాల నిద్ర పురుషుల కన్నా ఎందుకు ఎక్కువ అవసరం అంటే…
పురుషుల మెదడు కన్నా స్త్రీల మెదడు చాలా సంక్లిష్టంగా ఉంటుందట. పురుషుల కన్నా స్త్రీ మెదడే ఎక్కువ పనులను నిర్వహిస్తుందట. శరీరంలో చాలా భాగాలు మెదడు సహాయం తీసుకుంటూ ఉంటాయి. దీంతో వాటికి అనుగుణంగా మెదడు ఎప్పటికప్పుడు స్పందించాలి. దీంతో మెదడు ఎక్కువ పనిచేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఎక్కువగా పని చేసే మెదడుకు ఎక్కువ విశ్రాంతి కూడా అవసరమే. అందుకనే వారికి పురుషుల కన్నా 20 నిమిషాలు ఎక్కువ నిద్ర అవసరం.
ఇక మహిళలకే ఎక్కువ నిద్ర కావాలి అని చెప్పేందుకు మరో కారణం ఏంటంటే… సాధారణంగా పురుషులు ఒకేసారి ఒకే పనిపై దృష్టి పెడతారట. ఒకేసారి అనేక పనులపై వారు దృష్టి పెట్ట లేరట. కానీ స్త్రీలు అందుకు భిన్నం. వారు ఏక కాలంలో అనేక పనులపై దృష్టి నిలపగలరట. అందుకే వారి మెదడుకు విశ్రాంతి అవసరం అవుతుందట. కనుకనే వారికే ఎక్కువ నిద్ర అవసరం పడుతుందట.
పురుషుల మెదడు కన్నా స్త్రీ మెదడు 5 రెట్లు వేగంగా పనిచేస్తుందట. 5 రెట్లు ఎక్కువ విషయాలను గ్రహించగలదట. అందుకని కూడా వారి మెదడుకు విశ్రాంతి అవసరం అట. అందుకే పురుషుల కన్నా స్త్రీలు 20 నిమిషాలు ఎక్కువ సేపు పడుకోవాలట. కనుక మహిళలు మిమ్మల్ని ఎవరైనా పురుషులు ముందే నిద్ర లేపితే మరో 20 నిమిషాలు పడుకుంటామని చెప్పండి. కారణాలు మీకు పైన చెప్పాం కదా, అవి చెప్పేసెయండి. ఎందుకంటే స్త్రీలు ఎక్కువగా నిద్రిస్తేనే కదా, ఎక్కువ పనిచేయగలిగేది, ఆలోచించగలిగేది..!