Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home mythology

కాళికాదేవి శివుణ్ణి కాళ్లతో తొక్కుతున్నట్టు ఉంటుంది. దీని అంతర్యం ఏంటి.?

Admin by Admin
February 15, 2025
in mythology, వార్త‌లు
Share on FacebookShare on Twitter

దీని గురించి దేవి భాగవతం, కాళికా పురాణంలో సవివరంగా వుంటుంది. రక్త బీజుడనే రాక్షసుడు బ్రహ్మ దేవుని నుండి వరమును పొంది వుంటాడు అదేమిటంటే యుద్ధంలో అతని రక్తం బొట్టు పడిన ప్రతి దగ్గర అతని కన్న వేయిరెట్లు శక్తివంతం అయిన రక్త బీజులు వందలు , వేలల్లో పుట్టాలని వరం అడిగి సాధించుకుంటాడు. వర గర్వంతో ముల్లోకాలను ముప్పు తిప్పలు పెడుతున్న ఈతనిని ఓడించడం ఏ దేవతల వల్ల అవ్వలేకపోయినది. కారణం ఈతని రక్త బొట్టు పడిన క్షణంలోనే వందలు వేలల్లో మరింత మంది రక్త బీజులు వచ్చి క్షణాల్లో సర్వనాశనము చేసేయడమే. దీన్ని నివారించుకునేందుకు సాక్షాత్తు జగన్మాత తన అంశతో కాళికా అను దేవత‌ను సృష్టిస్తుంది(దేవి పురాణం ప్రకారం). ఇది కాళికా దేవి జన్మ రహస్యం.

ఈవిడ ఒళ్ళు మొత్తం నల్లని నలుపు వర్ణం లో వుండి, మహా భయానకం అయిన వదనం, కోర పళ్ళు, ఛాతి వర‌కు వేలాడే రుధిర వర్ణపు నాలుక తో, ఒంటిపై వస్త్రాలకు బదులు పుర్రెల దండ మీద, అస్తి పంజర చేతులు కింద వైపున కట్టుకొని, బిరుసెక్కిన నల్లని పెద్దవైన శిరోజాలతో, 8 చేతులు, వాటిలో ఆయుధాలతో అతి క్రూరంగ గర్జన చేస్తూ, దిక్కులు పిక్కటిల్లేలా అరిచి యుధ్ధంలో దిగుతుంది. ఇలా అన్నమాట. ఇక రాగానే ఈవిడ ఒక రక్త బీజుడిని చంపగనే మళ్ళీ యధావిధిగా పుట్టడం మొదలెడతాడు. అది చూసిన ఈమె పొడుగాటి ఆమె నాలుకను పరిచి ఒక్కో రక్త బీజుడిని చంపడం, కింద రక్తం బొట్టు పడెలోపు నాలుకతో జుర్రకొని మింగేయడం చేసింది. తద్వారా ఒక్కసారి కూడా రక్తం నేల తాకకుండా వుండుట చేత రక్త బీజుడు మరల ఉద్భవించుట జరగలేదు.

do you know why kali mata stands on lord shiva

చివరగా చంపిన రక్త బీజుని తలను చేత్తో పట్టుకొని రక్తం పీల్చేసి విజయ గర్వంతో నర్తిస్తు అడ్డు వచ్చిన ప్రతి ఒక్కరిని చంపడం మొదలెట్టింది. కారణం ఆవిడ తాగింది అమృతం కాదు కదా….. రాక్షసుని రక్తం. అది తమోగుణ ప్రధానం అయినది, అందుకు ఆ రాక్షస ప్రవృత్తి తనకూ వచ్చి ఇలా దేవతలు, మానవులు తేడా లేకుండా అందర్నీ నరకడం మొదలు పెట్టింది. ఎవ్వరూ ఆమె ఎదురు వెళ్లే సాహసించలేదు అప్పటి నుండి. ముల్లోకాలు గజ గజ వణికిపోతూ వుండగా, ఈమె గట్టిగా గర్జిస్తూ, క్రూరంగా హుంకరించుతు, అందర్నీ భక్షిస్తు నడుస్తోంది.

దేవతలకు వచ్చిన ఈ కొత్త సమస్య వల్ల అందరూ మహా దేవుణ్ని ప్రార్థించారు. ఈమె పార్వతి దేవి అంశమే కనుక మహా దేవుడే ఆమెను శాంతిప చేయగలడని చెప్పగా మహాదేవుడు ఆమెను అనుసరిస్తూ వెళ్లి, ఆమెకు ఎదురు పడగానే నిలబడకుండా వెంటనే నేల మీద పడుకుండి పోతాడు. ఈమె వెళ్తూ వెళ్తూ మహాదేవుని ఛాతీమీద తన పాదం మోపుతుంది చూస్కొకుండా. తర్వత కిందకు చూసి కింద వున్నది తన భర్త అని గుర్తించి, నాలుక కరుచుకుని, సిగ్గుతో, బాధతో, భయంతో గట్టిగా రోదిస్తూ ,ఏడుస్తూ , వెనక్కి మళ్ళుతుంది. ఇలా అవడానికి కారణం రాక్షస రక్తం తాగిన ఆమెకు ఆ తామస గుణం పోవాలి అంటే, కేవలం తన భర్త స్పర్శ, అందునా మహాదేవుని పావన స్పర్శ వల్ల మాత్రమే స్పృహ వస్తుందని మహాదేవుడు ఎరుగుదును కనుక ఆయన అల చేశాడు. భర్త మీద కాలు పడగానే పత్ని యొక్క సహజ సిద్ధమైన సిగ్గు, చూస్కోకుండ అడుగు వేసేసాను అనే బాధ, భయం కలిగి వెంటనే ఆమె శాంతి స్వరూపిణి అయినది. ముల్లోకాలను రక్షించింది.

కాళికా మాత తాంత్రిక విద్యకు అధి దేవత. నరబలి కోరుతుంది. ఈమె యొక్క ఆలయం భారత దేశం లో కలకత్తా నగరం లో వుంది. ఇప్పటికీ అక్కడ జంతు బలులు ఇస్తారు. అమ్మవారిని ఎదురుపడి చూడలేరు, చాలా భయంకరంగా వుంటుంది, దర్శనం చాలా దూరం నుండి చేయిస్తారు.

Tags: kali mata
Previous Post

హెలికాప్టర్ గాల్లో ఎలా ఎగురుతుందో తెలుసా..?

Next Post

ఓ వైపు నాన్న కల.. అతనేమో కమిట్మెంట్ అడిగాడు.. చేసేదేం లేక..!

Related Posts

అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

ఈ కాఫీని తాగితే ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉంటాయ‌ట‌..!

July 23, 2025
vastu

మీ ఇంట్లో తాబేలు విగ్ర‌హాన్ని ఇలా పెట్టండి.. ల‌క్ క‌ల‌సి వ‌స్తుంది..!

July 23, 2025
వినోదం

కెరీర్ పిక్స్ లో ఉండగా మరణించిన ప్రముఖ సినీ సెలెబ్రిటీలు వీళ్లే?

July 23, 2025
ఆధ్యాత్మికం

ఒకే గోత్రం ఉన్న‌వారు పెళ్లి చేసుకోకూడ‌దా..? వివాహం అయితే పిల్ల‌లు పుట్టరా..?

July 23, 2025
వైద్య విజ్ఞానం

దంతాలు, చిగుళ్లు, నోరు ఆరోగ్యంగా లేక‌పోతే గుండె జ‌బ్బులు వ‌స్తాయా..?

July 23, 2025
ఆధ్యాత్మికం

ప‌సికందుల క‌ణ‌త‌ల‌కు న‌ల్లని చుక్క ఎందుకు పెడ‌తారో తెలుసా..?

July 23, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.