Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home mythology

కృష్ణుడు, అర్జునుడు మంచి మిత్రులు..! మరి వారిద్దరూ ఎందుకు యుద్ధం చేసారు.? కారణం ఇదే.!

Admin by Admin
March 20, 2025
in mythology, వార్త‌లు
Share on FacebookShare on Twitter

శ్రీమహావిష్ణువు దశావతారాల్లో శ్రీకృష్ణావతారం కూడా ఒకటి. శ్రీకృష్ణుడంటే సాక్షాత్తూ మహా విష్ణువు స్వరూపమే. చాలా శక్తివంతమైన, ప్రజల కోరికలు తీర్చే దైవంగా కృష్ణుడు పూజలందుకుంటున్నాడు. అలాగే మహాభారతంలో అర్జునుడు. చాలా శక్తివంతమైన యోధుడు. ప్రపంచంలో బాణాలు వేసే అస్త్ర విద్యను ప్రదర్శించడంలో అర్జునుడికి మించిన వాడు లేడంటారు. అయితే మహాభారతంలో ఇద్దరూ మంచి స్నేహితులే కాదు, బావమరుదులు కూడా. కానీ అలా కలిసి ఉన్న వారే ఒకసారి పరస్పరం యుద్ధానికి దిగారు తెలుసా..? అవును, మీరు విన్నది నిజమే. శ్రీకృష్ణుడు, అర్జునుడు ఇద్దరూ కలిసి ఓ సారి యుద్ధం చేశారు. అప్పుడు ఏమైందంటే…

అతని పేరు గయుడు. ఓ గంధర్వుడు. ఆకాశ మార్గంలో ఓ రోజున ప్రయాణిస్తూ కిందకు ఉమ్ముతాడు. అయితే అదే సమయంలో కింద నదిలో శ్రీకృష్ణుడు సంధ్యావందనం చేస్తుంటాడు. దోసిలిలో నీటిని పట్టి సూర్యున్ని ప్రార్థిస్తుంటాడు. అదే సమయంలో గయుడు ఉమ్మి వేసే సరికి అది నేరుగా వచ్చి కృష్ణుని దోసిలిలో పడుతుంది. దీంతో శ్రీకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేస్తూ గయున్ని చంపేస్తానని ప్రతిన బూనుతాడు. అది తెలుసుకున్న గయుడు గజ గజ వణుకుతాడు.

గయుడు వెంటనే నారదుని వద్దకు వెళ్లి సలహా అడుగుతాడు. అప్పుడు నారదుడు గయున్ని అర్జునుడి దగ్గరకు వెళ్లి మొదట శరణు కోరమని, తరువాతే కృష్ణుడి పేరు చెప్పమని అంటాడు. గయుడు అలాగే చేస్తాడు. మొదట అర్జునుడి వద్దకు వెళ్లి శరణు కోరుతాడు. అలా అర్జునుని నుంచి గయుడు మాట తీసుకున్నాకే తనను కృష్ణుడు చంపుతానని చెప్పాడని, తనను కాపాడమని అర్జునున్ని వేడుకుంటాడు. దీంతో మొదట విస్తుపోయిన అర్జునుడు ఇచ్చిన మాటకు కట్టుబడి గయుడి తరఫున కృష్ణుడితో యుద్ధం చేసేందుకు సిద్ధమవుతాడు. కృష్ణుడు, అర్జునుడు ఇద్దరూ యుద్ధం చేయబోతున్నారని తెలిసి అటు రుక్మిణి, ఇటు సుభద్రతోపాటు మరోవైపు నారదుడు కూడా ఇద్దరికీ సర్ది చెప్పాలని చూస్తారు. కానీ అర్జునుడు, కృష్ణుడు వారి మాటలను వినకుండా యుద్ధం చేసేందుకు పూనుకుంటారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. కృష్ణుడు వేసే అస్త్రాలను అర్జునుడు నాశనం చేస్తుంటాడు. అలాగే అర్జునుడు వేసే అస్త్రాలను కృష్ణుడు నాశనం చేస్తుంటాడు. ఇలాగైతే లాభం లేదనుకుని కృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని అర్జునుడిపైకి సంధిస్తాడు.

why krishna and arjuna fought

అప్పుడు అర్జునుడు తనకు మహా శివుడు ఇచ్చిన పాశుపతాస్త్రాన్ని కృష్ణుడిపైకి పంపుతాడు. దీంతో ప్రపంచం నాశనం అవుతుందని గ్రహించిన బ్రహ్మ వెంటనే యుద్ధం జరిగే స్థలం వద్ద ప్రత్యక్షమై యుద్ధాన్ని ఆపాలని కోరగా కృష్ణుడు, అర్జునుడు తాము వేసిన అస్త్రాలను వెనక్కి తీసుకుంటారు. అనంతరం బ్రహ్మ గయున్ని కృష్ణుడికి ఇచ్చేయమని అర్జునుడికి చెప్పగా అర్జునుడు గయున్ని కృష్ణుని వద్దకు పంపుతాడు. అప్పుడు కృష్ణుడు గయున్ని చంపుతాడు. అనంతరం బ్రహ్మ మళ్లీ కమండలంలో ఉండే జలాన్ని చల్లి గయున్ని బతికిస్తాడు. దీంతో అటు కృష్ణుడు, ఇటు అర్జునుడు ఇద్దరి ప్రతిజ్ఞలు నెరవేరుతాయి. అయితే నిజానికి ఆ ఇద్దరి మధ్య జరిగిన యుద్ధాన్ని మనం నిత్య జీవితంలోకి కూడా అన్వయించుకోవచ్చు. ఎలాగంటే…

ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి ఒక అభిప్రాయం ఉంటుంది. అందుకు అనుగుణంగానే ఏ మనిషి అయినా ముందుకు వెళతాడు. అలాంటి సమయాల్లో ఒక్కోసారి ఎవరికైనా తాము ప్రేమించే లేదా తమకు దగ్గరైన వారికి వ్యతిరేకంగా ముందుకు సాగాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఎవరైనా తమకు తోచిన రీతిలో ఏది కరెక్ట్‌ అనుకుంటే దాని వైపు ముందుకు వెళ్లాలి. అప్పుడు తమ కుటుంబ సభ్యులు అడ్డుగా వచ్చినా సరే.. తాము అనుకున్న అంశం వైపే నిలబడాలి. ఇదే విషయాన్ని శ్రీకృష్ణార్జుల యుద్ధం మనకు తెలుపుతుంది. ఇక కృష్ణుడు మహాభారత యుద్ధానికి సన్నాహకంగా కూడా అర్జునుడితో అలా యుద్ధం చేశాడని పురాణాలు చెబుతున్నాయి.

Tags: Krishna And Arjuna
Previous Post

స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్తే…ఆ యువతిని అశ్లీల వీడియోలు ఎక్కువ చూస్తావా అని అడిగారు.! ఎందుకో తెలుసా.?

Next Post

యూట్యూబ్ స్టార్స్ షాపింగ్స్ లో నిజం ఎంత? నిజంగా కొంటున్నారా? లేదా?

Related Posts

అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

ఈ కాఫీని తాగితే ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉంటాయ‌ట‌..!

July 23, 2025
vastu

మీ ఇంట్లో తాబేలు విగ్ర‌హాన్ని ఇలా పెట్టండి.. ల‌క్ క‌ల‌సి వ‌స్తుంది..!

July 23, 2025
వినోదం

కెరీర్ పిక్స్ లో ఉండగా మరణించిన ప్రముఖ సినీ సెలెబ్రిటీలు వీళ్లే?

July 23, 2025
ఆధ్యాత్మికం

ఒకే గోత్రం ఉన్న‌వారు పెళ్లి చేసుకోకూడ‌దా..? వివాహం అయితే పిల్ల‌లు పుట్టరా..?

July 23, 2025
వైద్య విజ్ఞానం

దంతాలు, చిగుళ్లు, నోరు ఆరోగ్యంగా లేక‌పోతే గుండె జ‌బ్బులు వ‌స్తాయా..?

July 23, 2025
ఆధ్యాత్మికం

ప‌సికందుల క‌ణ‌త‌ల‌కు న‌ల్లని చుక్క ఎందుకు పెడ‌తారో తెలుసా..?

July 23, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.