Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home Off Beat

ప్రేమించ‌డం తప్పు కాదు, స‌రైన వారిని ప్రేమించ‌క‌పోవ‌డమే త‌ప్పు.!

Admin by Admin
April 21, 2025
in Off Beat, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ప్రేమ అన్నమాటకు సంబంధించి మనలో చాలా మనోభావం ఉంటుంది. దాని గురించి రకరకాల ఊహలు నిర్వచనాలు చేస్తూ ఉంటాం. ఒక్కసారి ఇష్టపడిన అమ్మాయి తన ప్రేమను ఒప్పుకుంటే అతడే మహారాజు. ప్రేమలో మునిగిపోయిన ప్రేమికులు ఏం చేస్తారో చెప్పడం చాలా కష్టం. కొంతమంది చుట్టూ ఉన్న లోకాన్ని మర్చిపోతారు. మరికొంతమంది ఎవ్వరూ చూడకుండా జాగ్రత్తగా ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఏదో ఒకటి ఇచ్చుపుచ్చుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఓ లవ్ స్టోరీ గురించి తెలుసుకుందాం.

నా చిన్ననాటి స్నేహితుడతను, తెల్లారడంతోనే మొదలయ్యేవి మా ఆటలు, కలిసి పతంగులేగరేయడం, మామిడి తోటలో దొంగతనాలు చేయడం, మా ఊరి చెరువులో ఈత కొట్టడం, తను ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉండాల్సిందే, అలా ఉండేది మా స్నేహం! కాలంతోపాటు మా స్నేహం కూడా పెరిగి ప్రేమగా మారింది. అది కాస్త ఇంట్లో తెలిసి మా నాన్న, అన్నయ్య ఇద్దరు కలిసి నన్ను కొట్టారు. ఆ దెబ్బలకు నా బొక్కలు విరిగాయి, నోట్లోంచి రక్తం పడింది. అయినా అతనిపై నా ప్రేమ ఇంకా పెరిగింది. ఇద్దరం కలిసి ఊరు వదిలి పారిపోయాము. ఇద్దరం కలిసి ఓ పెద్ద టౌన్ లో చిన్న రూమును అద్దెకు తీసుకుని మా కొత్త జీవితాన్ని ప్రారంభించాము. అతను టెక్స్టైల్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. నేను మా ఇంటి ఏరియాలో ఉండే ఇండ్లలో పాచి పని చేసేదానిని. చిన్న ఉద్యోగాలు, చిన్న ఇల్లు, కానీ మనసు నిండా బోలెడంత ప్రేమ. ఒక్కోసారి ఆయన నైట్ డ్యూటీ కూడా చేసేవారు. ఆయన కోసం తెల్లవారే వరకు ఎదురుచూసిన రోజులు అనేకం, అయినా ఆ ఎదురు చూపుల్లో భలే ఆనందం ఉండేది.

love failure girl real story

ఓ రోజు, సాయంత్రం నేను ఇంట్లో ఉన్న సమయాన, మా ఆయనతో పాటు అదే టెక్స్టైల్ కంపెనీలో పనిచేసే మరో వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు. మీ ఆయన మా కంపెనీలో పనిచేసే ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, కంపెనీ దగ్గరే ఓ ఇల్లు రెంట్ కు తీసుకొని వాళ్ళిద్దరూ ఉంటున్నారని చెప్పాడు. అతని మాటల్లో నిజం లేదని నాకు అనిపించింది. ఎందుకంటే మా ప్రేమ అంత స్వచ్ఛమైనది. కానీ అతను నిజం.. నిజం నేను చెప్పేది నిజం అంటుంటే, అతని మాటలను అబద్ధమని నిరూపించడానికి అతనితో కలిసి బయలుదేరాను. దూరంగా ఓ ఇంటిని చూపించాడు. ఇదే మీ ఆయన ఉంటున్న ఇల్ల‌ని చెప్పాడు అతను. కొద్దిసేపటికి మా ఆయన మరో అమ్మాయితో కలిసి నవ్వుకుంటూ ఆ ఇంట్లోకి ఓ సంచి తో వెళ్లడం చూశాను. తట్టుకోలేక పోయాను. నా కాళ్లు అక్కడ నిలబడలేకపోయాయి. ఇంటికి ఎలా వచ్చానో కూడా తెలియదు.

నా మనసును రాయి చేసుకున్నాను. మా ఆయనకు ఇష్టమైన చేపల కూర వండాను. నాకు తెలుసు ఇదే నేను మా ఆయనకు వడ్డించే చివరి భోజనం అని! ఆయన వచ్చాడు, ఎప్పటిలాగే స్నానం చేసి తినడానికి కూర్చున్నారు. నేను కూడా నాకేం తెలియదన్నట్టు వండిన అన్నం, కూర వడ్డించాను. బాగుంది, చాలా బాగుంది అంటూ తిన్నాడు. ఆ క్షణం ఆయన కళ్ళల్లోకి చూసి మీరు నన్ను నిజంగానే ప్రేమిస్తున్నారా? అని అడిగాను. ఆయనకు అర్థమయ్యింది. ఏడవడం స్టార్ట్ చేశాడు. అప్పటికే ఏడ్చి ఏడ్చి నా కన్నిరంతా ఇంకిపోయింది. ఒంటి మీద ఉన్న ఓకే ఒక చీరతో ఆ ఇంటి నుండి బయలుదేరాను. బ్రతిమాలాడాడు. కానీ ప్రపంచంలో అత్యంత కఠినమైన విషయం ఏంటంటే, సెకండ్ ఛాన్స్ ఇవ్వడం, అది నేను ఇవ్వదలచుకోలేదు. నా దారి నేను వెతుక్కున్నాను. అలా వచ్చేసి ఇప్పటికీ 15 సంవత్సరాలు, నా బతుకేదో నేను బతుకుతున్న, నా గతం ఎవరికి చెప్పుకోకుండా, నా వాళ్ళు ఎవరూ లేరు, నేనో అనాథను అని నన్ను నేను పరిచయం చేసుకొని నా జీవనం సాగిస్తున్నా.

Tags: love failure girl
Previous Post

చాణక్య నీతి: భార్య తమ భర్త వద్ద ఈ విషయాలను తప్పక దాచిపెడుతుందట.. అవేంటంటే..?

Next Post

జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇవ్వ‌క‌ ముందు ఈ కమెడియన్స్ ఏం చేసేవారో తెలుసా..?

Related Posts

lifestyle

పెళ్ళిలో వధూవరులు తెల్లని వస్త్రాలే ఎందుకు ధరిస్తారో తెలుసా..? అసలు కారణం ఇదే..!

July 23, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

ఈ కాఫీని తాగితే ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉంటాయ‌ట‌..!

July 23, 2025
vastu

మీ ఇంట్లో తాబేలు విగ్ర‌హాన్ని ఇలా పెట్టండి.. ల‌క్ క‌ల‌సి వ‌స్తుంది..!

July 23, 2025
వినోదం

కెరీర్ పిక్స్ లో ఉండగా మరణించిన ప్రముఖ సినీ సెలెబ్రిటీలు వీళ్లే?

July 23, 2025
ఆధ్యాత్మికం

ఒకే గోత్రం ఉన్న‌వారు పెళ్లి చేసుకోకూడ‌దా..? వివాహం అయితే పిల్ల‌లు పుట్టరా..?

July 23, 2025
వైద్య విజ్ఞానం

దంతాలు, చిగుళ్లు, నోరు ఆరోగ్యంగా లేక‌పోతే గుండె జ‌బ్బులు వ‌స్తాయా..?

July 23, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
మొక్క‌లు

Gadida Gadapaku : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో.. చేల‌లో ల‌భించే మొక్క ఇది.. అస‌లు విడిచిపెట్ట‌వ‌ద్దు..!

by D
June 10, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.