Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home Off Beat

లైంగిక కోరిక‌లు ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల చ‌దువుపై దృష్టి పెట్ట‌లేక‌పోతున్నా.. ఏం చేయాలి..?

Admin by Admin
June 11, 2025
in Off Beat, వార్త‌లు
Share on FacebookShare on Twitter

నా వయస్సు 20.. నాకు లైంగిక ఆలోచనలు ఎక్కువగా వస్తున్నాయి.. నేను కెరీర్ మీద concentrate చెయ్యలేక పోతున్నాను. దీనికి నేను ఏం చెయ్యాలి? ఒక వయసు వచ్చాక లైంగిక ఆలోచనలు ఉండటం సహజమే. అవి అదుపులో ఉండకపోతేనే ప్రమాదం. మారాలి అని అనుకుంటున్నారు. సంతోషం. ముందుగా.. ఒక చిన్న కథ చెబుతాను. ఒక పిల్లవాడికి సరిగ్గా చదువు మీద ధ్యాస కుదరకపోవడం అనేది గమనించిన తండ్రి మర్నాడు ఆ పిల్లవాడ్ని గుడికి తీసుకెళ్తాడు. దారిలో… ఆ పిల్లవాడు ఆ తినుబండారం కొనివ్వమని, ఈ ఆట వస్తువు కొనివ్వమని అడుగుతున్నా అతని తండ్రి పట్టించుకోడు. గుడికి వెళ్లి ఇద్దరూ దైవ దర్శనం చేసుకున్నాక, తన కొడుకు తల మీద ఒక పుస్తకాన్ని పెట్టి, దాని మీద ఒక స్కేలు, పెన్ను పెడతాడు. చెప్పులు లేకుండా, నెత్తిమీద నున్నవి కింద పడకుండా ఇంటి వరకూ వస్తే, ఎప్పట్నుంచో అడుగుతున్న సైకిల్ కొనిస్తానని చెబుతాడు. పిల్లవాడు సంతోషంగా సరేనంటాడు.

తిరిగి వచ్చేట‌ప్పుడు నెత్తిన పుస్తకంతో వెళ్తున్న పిల్లవాన్ని చూసి అందరూ వింతగా చూస్తుంటారు. కొందరు బయటకి నవ్వుతూ వుంటారు. అయినా, పిల్లవాడి ధ్యాస మరలదు. ఆ తండ్రి బజారులో అంతకుముందు తన కొడుకు కొనివ్వమని అడిగిన తినుబండారాలను చూపించి, అవి తింటావా? అని అడుగుతాడు. అయితే, ఆ పిల్లవాడి ధ్యాస మొత్తం నెత్తిన వున్న బరువు మీదనే వుంటుంది. ఖరాఖండిగ వద్దు అనేస్తాడు. ఇంటికొచ్చాక, పిల్లవాడ్ని అభినందించి, ఇదివరకే తాను కొనిపెట్టి ఉంచిన సైకిల్ ని తీసుకొచ్చి, ఇలా అంటాడు. చూసావా చిన్నా… గుడికి వెళ్లేటప్పుడు ఎన్నో కావాలని అడిగావు. కానీ సైకిల్ అనే పెద్ద లక్ష్యం ముందు అవన్నీ చిన్నవిగా అయిపోయాయి. దారిలో ఎవరు ఎగతాళి చేసినా నువ్వు లక్ష్య పెట్టలేదు. అలాగే, జీవితంలో నీకు ఏది ముఖ్యం అని నువ్వు గుర్తించినప్పుడు, దారిలో వచ్చే చిన్నపాటి అవరోధాలు నిన్ను ఏమీ చెయ్యలేవు.. అన్నాడు.

student tells that he is unable to concentrate on studies

మీకు ఎక్కువగా లైంగిక ఆలోచనలు వున్నాయని మీరు చెబుతున్నారు గనుక, మీరు వేరే ఏ పని లేకుండా… ఒంటరిగా, ఖాళీగా ఉండటం వలన, మీ ధ్యాసను మరి ఏ విషయం మీద కేంద్రకరించ లేకపోతున్నారు అని నేను అనుకుంటున్నాను. సోమరి అయినవాని బుర్ర దెయ్యాల కార్ఖానా అనీ సామెత చెబుతారు. కనుక, తక్షణమే మీ లక్ష్యానికి సంబంధించి కార్యాచరణను సిద్ధం చేసుకోండి. బుర్రను ఎప్పుడూ ఖాళీగా ఉంచకుండా ఏదో ఒక పనిని అప్పజెప్పుతూ వుండండి. ఇదివరకు చెయ్యకపోతే, యిప్పటి నుంచైనా శరీరాన్ని కూడా తగినంత కష్టపెట్టడం అలవాటు చేసుకోండి. వ్యాయామం, యోగా ఏదో ఒకటి ఆచరించండి. మెడిటేషన్ తో మనసుని నిమ్మళపర్చుకోండి. ముందుగా మీకు లైంగిక ఆలోచనలను తెచ్చే అంశాలను ఒక పేపర్ మీద రాసి పెట్టుకోండి. అవేమిటో తక్కినవాళ్ళ కన్నా మీకే బాగా తెలుస్తుంది. వాటన్నిటినీ తగ్గించే విధంగా మీ దినచర్యను ప్లాన్ చేసుకోండి.

పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వండి. వచ్చినా, రాకపోయినా, మీ చదువుకు తగినది అయినా, చిన్నదైనా సరే, ఇంటర్వ్యూలకు వెళ్ళడం అలవాటు చేసుకోండి. కేవలం జాబ్స్ కోసమే కాదు, మంచి internship ప్రోగ్రాంలను కూడా ప్రయత్నించండి. మీలో మౌఖిక పరీక్షలంటే ఏదైనా భయం, బెరుకు ఉన్నట్లయితే, అది కాస్తా పోతుంది. ఇంటర్వ్యూలలో మొదట్లో తెలియక చేసిన తప్పులు సరిదిద్దుకుంటూ, తర్వాత ఎదుర్కొనే ఇంటర్వ్యూల కోసం ప్రిపేర్ అవుతుంటే, రాన్రానూ చేసే తప్పులు కూడా తగ్గిపోతాయి. ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ మీ కెరీర్ ని అత్యుత్తమ స్థాయిలో నిర్మించుకోవచ్చు! ఒకవేళ మీరు ఆల్రెడీ ఉద్యోగస్తులైతే… మీ కెరీర్ ని గాడిలో పెట్టేందుకు అవసరమైన కోర్సులను నేర్చుకోండి. నేర్చుకుని వదిలెయ్యకుండా ఆచరణలో పెట్టడానికి సదా ప్రయత్నించండి.

ఒంటరిగా ఉంటేనే మీకు లైంగిక పరమైన ఆలోచనలు వచ్చేందుకు ఎక్కువ ఆస్కారం వుంటుంది. కనుక… రోజులో, అనగా 24 గంటల్లో, నిద్ర పోయే ఆరు నుంచీ ఎనిమిది గంటల్లో తప్ప, తక్కిన సమయమంతా మీ కుటుంబ సభ్యుల సమక్షంలో, కెరీర్ పరంగా దోహదపడే వ్యక్తులతో, స్నేహితులతో గడపడానికి ప్రయత్నించండి.

Tags: student
Previous Post

వారం రోజులు తలస్నానం చేయకపోతే ఏమవుతుందో తెలుసా..?

Next Post

ఆధునిక స‌బ్‌మెరైన్ తీసుకోవాలా.. లేక ఎయిర్ క్యారియ‌ర్ తీసుకోవాలా..?

Related Posts

హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

September 26, 2025
ఆధ్యాత్మికం

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

September 26, 2025
ఆధ్యాత్మికం

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

September 25, 2025
వినోదం

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

September 25, 2025
ఆధ్యాత్మికం

మీ ఇంట్లోకి ఇలాంటి పక్షులు వస్తున్నాయా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

September 24, 2025
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

September 23, 2025

POPULAR POSTS

food

Paneer Mushroom Dum Biryani : ప‌నీర్‌, మ‌ష్రూమ్ ద‌మ్ బిర్యానీ.. ఇలా చేసి చూడండి.. ఎంతో బాగుంటుంది..!

by D
March 12, 2023

...

Read more
home gardening

Betel Leaves Plant : త‌మ‌ల‌పాకు మొక్క‌కు వీటిని వేయండి.. ఆకులు బాగా వ‌చ్చి మొక్క ఏపుగా పెరుగుతుంది..!

by Editor
July 12, 2023

...

Read more
చిట్కాలు

జీల‌కర్ర‌తో సింపుల్‌గా ఇలా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు..!

by Admin
January 13, 2021

...

Read more
food

Sweet Chutney : ఇడ్లీ, దోశ‌ల‌లోకి తియ్య‌ని చ‌ట్నీని ఇలా చేయండి.. రుచి అద్భుతంగా ఉంటుంది..!

by D
June 25, 2022

...

Read more
food

Mushroom Pulao : పుట్ట‌గొడుగుల‌తో పులావ్‌ను ఇలా చేస్తే.. ఒక్క ముద్ద ఎక్కువే తింటారు.. ఎంతో రుచిగా ఉంటుంది..!

by Editor
February 9, 2023

...

Read more
హెల్త్ టిప్స్

మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య ఉందా.. అయితే ఈ పండ్ల‌ను తినండి..

by Admin
August 4, 2025

...

Read more
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.