గ్రీన్ టీ బ్యాగ్స్ వాడటం ఆరోగ్యానికి మంచిదేనా..?
గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కానీ దాని ప్రయోజనాలు, ప్రభావాలు టీ బ్యాగ్ యొక్క నాణ్యత, సిద్ధం చేసే పద్ధతి మీ ఆరోగ్య స్థితిపై ఆధారపడి ఉంటాయి. EGCG (ఎపిగాలోకెటెచిన్ గాలేట్) గ్రీన్ టీలో ఉంటుంది. ఇది హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. కెఫీన్, కేటెచిన్లు గ్రీన్ టీలో ఉంటాయి. ఇవి కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి. అందువల్ల రోజూ 2 కప్పుల మోతాదులో గ్రీన్ టీని సేవిస్తుంటే అధిక బరువును తగ్గించుకోవచ్చు….