ఊబర్, ఓలా వంటివాటి వల్ల తాము నష్టపోతున్నామని ఆటోవాళ్ళు అంటున్నారు. అయినప్పటికీ చాలామంది ఆటోవాళ్ళు అవే వాడుతున్నారు. దీని వెనుక కారణం ఏమిటి?
నేను తొమ్మిదవ తరగతి వరకు బడికి వెళ్ళింది రిక్షాలో. అప్పట్లో ఈ రిక్షాలే మా ఊళ్ళో పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు. ఎలాగూ ట్రాఫిక్ బాధ లేదు, జేబుకు చిల్లూ పడదు. కొందరు తమ రిక్షాలను రంగురంగుల జిలుగులతో, డజన్ల కొద్దీ చిరుగంటలతో అలంకరించేవారు. అలాంటి రిక్షాలో వెళ్తుంటే తల అంగుళం పైకి లేచేది, జెయింట్ వీల్ ఎక్కినట్టు, అలౌకికానందంలో! ఆ కాలానికి సహజమైన అమాయకత్వం, తెలియనితనంలో గ్రహించలేదు గానీ నెమ్మదిగా ఆ రిక్షాల మనుగడకు ముప్పు ఈ రూపంలో … Read more









