నిజంగా మనం గమనించాలే గానీ నిత్యం మన జీవితంలో చూసే అనేక వస్తువుల గురించి మనకు అనేక విషయాలు తెలుస్తాయి. ఆయా వస్తువులపై ఉండే చిహ్నాలు కావచ్చు, అక్షరాలు కావచ్చు, ఇతర ఏవైనా గుర్తులు కావచ్చు, వాటి వల్ల మనం అనేక విషయాలను తెలుసుకోవచ్చు. అయితే మేం ఇప్పుడు చెప్పబోయేది కూడా అలాంటి ఓ వస్తువు గురించే. ఇంతకీ ఏంటది..? అనేగా మీరు అడిగేది. ఏమీ లేదండీ.. ఆ వస్తువు కంప్యూటర్ కీ బోర్డు. అవును, అదే. ఏంటీ.. దాని ద్వారా మనకు ఏం తెలుస్తుంది.. అని అడుగుతున్నారా..! అవును, తెలుస్తుంది. నిజంగా పరిశీలించాలే గానీ కంప్యూటర్ కీ బోర్డు కూడా మనకు ఓ విషయం తెలియజేస్తుంది. అదేమిటంటే…
మీరు కంప్యూటర్ కీ బోర్డుపై ఉన్న అక్షరాలను ఎప్పుడైనా చూశారా..! అవును, చూసే ఉంటారు లెండి. అయితే వాటిని జాగ్రత్తగా ఓ సారి పరిశీలించండి. ఏమీ తెలియడం లేదా… ఇంకాస్త చూడండి. అవును తెలిసిందా.. అవేనండీ… కీబోర్డుపై ఉండే F, J అక్షరాల కింద చిన్న గీతలున్నాయి కదా. అవును, ఉన్నాయి. అయితే వాటి వల్ల మనకు ఓ విషయం తెలుస్తుంది. అదేమిటంటే…
కంప్యూటర్ కీ బోర్డుపై ఉండే F, J అక్షరాల కింద ఆ గీతలెందుకు ఉంటాయంటే… సులభంగా టైప్ చేయడం కోసం. అవును. సాధారణంగా ఎవరైనా కంప్యూటర్ కీ బోర్డును చూడకుండానే అక్షరాలను టైప్ చేస్తారు కదా. అయితే అలాంటి సందర్భంలో ఆ గీతలు పనికొస్తాయి. వాటి వల్ల ఏయే అక్షరాలపై వేళ్లు పడుతున్నాయో సులభంగా తెలుసుకుని దాని ప్రకారం టైప్ చేయవచ్చు. అయితే కొత్తగా నేర్చుకునే వారు ఎలాగూ అక్షరాలను చూస్తారు కదా, కనుక వారు ఈ లెటర్ల కింద ఉండే గీతలను గుర్తు పెట్టుకుంటే దాంతో టైపింగ్ సులభంగా వస్తుంది. త్వరగా టైపింగ్ నేర్చుకోగలుగుతారు. అందులో ఫాస్ట్‌గా తయారవుతారు. అదేవిధంగా ఈ అక్షరాల కింద ఉండే గీతల వల్ల అంధులు కూడా సులభంగా కంప్యూటర్‌పై టైప్ చేయగలరు. అందుకే ఆ రెండు అక్షరాల కింద గీతలను ఇచ్చారు.
ఇక అవే రెండు అక్షరాల కిందే ఎందుకు గీతలను ఇచ్చారంటే… టైప్ చేసేటప్పుడు ఎవరి చేతి వేళ్లయినా ఎడమ చేతి వేళ్లయితే చివరి మూడు వేళ్లు A S D అక్షరాలపై ఉంటాయి. అదే కుడి చేతి వేళ్లయితే చివరి మూడు వేళ్లు K L ; అక్షరాలపై ఉంటాయి. ఇక రెండు చేతులకు చెందిన చూపుడు వేళ్లు F, J అక్షరాల మీద ఫిక్స్ అవుతాయి. ఎడమ చేతి చూపుడు వేలు F అక్షరం మీద, కుడి చేతి చూపుడు వేలు J అక్షరం మీద ఫిక్స్ అవుతాయి. దీంతో టైపింగ్ సులభతరమవుతుంది. ఆ వేళ్లకు అవే స్థానాలు కరెక్ట్‌గా సూటవుతాయి. కనుకనే F, J కీల కింద ఆ గీతలను ఇచ్చారు. దీంతో ఆ కీలను చూడకున్నా గీతలను బట్టి అవే అవే కీలని ఇట్టే చెప్పేయవచ్చు. ఇలా చేసినందున టైపింగ్ సులభంగా, వేగంగా చేసుకోవచ్చు. ఇక బొటన వేళ్లు రెండూ స్పేస్ బటన్‌పై ఉంటాయి. ఇది అందరికీ తెలిసిందే. కాబట్టి ఇప్పుడు తెలిసిందిగా, కంప్యూటర్ కీ బోర్డు మీద F, J లెటర్స్ కింద గీతలెందుకు ఉంటాయో..!