Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home మొక్క‌లు

Kaki Donda Chettu : ఈ మొక్క ఎక్క‌డ క‌నిపించినా స‌రే విడిచిపెట్ట‌కుండా.. మొత్తం ఇంటికి తెచ్చుకోండి.. ఎందుకంటే..?

D by D
November 29, 2022
in మొక్క‌లు, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Kaki Donda Chettu : మ‌నం ఆహారంగా దొండ‌కాయ‌ల‌ను కూడా తీసుకుంటూ ఉంటాం. దొండ‌కాయ‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. అయితే ఈ దొండ‌కాయ‌ల్లో రెండు ర‌కాలు ఉంటాయి. మ‌నం ఆహారంగా తీసుకునే దొండ‌కాయ‌లు ఒక ర‌క‌మైతే చేదు దొండ‌కాయ‌ల‌ని మ‌రో ర‌కం ఉంటాయి. ఈ చేదు దొండ‌కాయ‌ల‌ను కూడా చాలా మంది చూసే ఉంటారు. చేల కంచెల‌కు, తోట‌ల్లో, చెట్ల‌కు అల్లుకుని ఈ చేదు దొండ తీగ ఎక్కువగా పెరుగుతుంది. దీనిని కాకి దొండ, అడ‌వి దొండ‌, చేదు దొండ అని అంటారు. ఈ కాకి దొండ‌ను సంస్కృతంలో తుండి కేరి అని హిందీలో కండారి, కుందురు అని పిలుస్తారు. ఈ కాకి దొండ కూడ మామూలు దొండ పాదులాగే ఉంటుంది. కాకి దొండలో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి.

వీటిని వాడ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చు. ఆయుర్వేదంలో వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు ఔష‌ధంగా ఈ చేదు దొండ‌ను ఉప‌యోగిస్తారు. చేదుగా ఉన్న‌ప్ప‌టికి ఈ దొండ‌కాయ‌ల‌తో కూర‌ను కూడా వండుకుని తింటారు. కాకి దొండ‌కాయ‌ల‌తో వండిన కూర‌ను తిన‌డం వ‌ల్ల జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య త‌గ్గుతుంది. అంతేకాకుండా నాడీ మండ‌ల ప‌నితీరు మెరుగుప‌డి మ‌తిమ‌రుపు స‌మ‌స్య త‌గ్గుతుంది. ఈ చేదు దొండ‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ్వాస సంబంధిత స‌మ‌స్య‌ల‌తో పాటు క్యాన్స‌ర్ వంటి భ‌యంక‌ర‌మైన వ్యాధులు కూడా మ‌న ద‌రి చేర‌కుండా ఉంటాయి. ఈ చేదు దొండ‌కాయ‌ల‌ను న‌మిలి తిన‌డం వ‌ల్ల నోట్లో పుండ్లు, నోటి అల్స‌ర్లు త‌గ్గుతాయి.

Kaki Donda Chettu benefits in telugu take this plant to home
Kaki Donda Chettu

మూత్ర‌పిండాల్లో రాళ్ల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ఈ దొండ‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల రాళ్లు క‌రిగి మూత్రం ద్వార బ‌య‌ట‌కు పోతాయి. ఈ చేదు దొండ‌కాయ‌లోని గింజ‌ల‌ను పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని ఒక గ్రాము మోతాదులో ఒక టీ స్పూన్ తేనెతో క‌లిపి తీసుకోవ‌డం వల్ల వాంతులు, ఎక్కిళ్లు త‌గ్గుతాయి. ముఖ్యంగా ఈ తీగ‌ను షుగ‌ర్ వ్యాధి ఔష‌ధాల త‌యారీలో ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు. చేదు దొండ ఆకుల ర‌సాన్ని లేదా ఈ తీగ ర‌సాన్ని 20 గ్రాముల మోతాదులో 40 నుండి 80 రోజుల పాటు తీసుకోవడం వ‌ల్ల షుగ‌ర్ వ్యాధి అదుపులో ఉంటుంద‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మ‌ధుమేహ వ్యాధి గ్ర‌స్తులు ఈ చేదు దొండ‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు.

అంతేకాకుండా మ‌ధుమేహం వ‌ల్ల క‌లిగే నీర‌సం, అల‌స‌ట త‌గ్గి రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ఈ చేదు దొండ ఆకుల ర‌సాన్ని గేదె పెరుగుతో క‌లిపి తింటూ చ‌ప్పిడి ప‌త్యాన్ని పాటించ‌డం వ‌ల్ల కామెర్ల వ్యాధి క్ర‌మంగా త‌గ్గు ముఖం ప‌డుతుంది. అన్ని ర‌కాల చ‌ర్మ వ్యాధుల‌ను, దుర‌ద‌ను, ఫంగ‌ల్ ఇన్ఫెక్ష‌న్ ల‌ను తగ్గించ‌డంలో కూడా ఈ చేదు దొండ తీగ మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ దొండ తీగ ఆకుల ప‌స‌రును స‌మ‌స్య ఉన్న చోట చ‌ర్మం పై లేప‌నంగా రాయ‌డం వ‌ల్ల అన్ని ర‌కాల చ‌ర్మ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ఈ చేదు దొండ‌కాయ ఆకుల‌ను, న‌ల్ల తుమ్మ ఆకుల‌ను, చిక్కుడు ఆకుల‌ను స‌మానంగా తీసుకుని మెత్త‌గా దంచి ర‌సాన్ని తీయాలి. ఈ ర‌సాన్ని అరికాళ్ల‌పై రాయ‌డం వ‌ల్ల అరికాళ్ల మంటలు త‌గ్గుతాయి.

వెల్లుల్లి ర‌సాన్ని, ఆవ‌పిండిని, చేదు దొండ తీగ ఆకుల ర‌సాన్ని స‌మానంగా తీసుకుని మెత్త‌ని ఉండలుగా చేసుకోవాలి. ఈ ఉండ‌ను నీటితో క‌లిపి తీసుకోవ‌డం వల్ల స్త్రీల‌ల్లో వ‌చ్చే నెల‌స‌రి స‌మ‌స్య‌లు, గ‌ర్భాశ‌య స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ఈ విధంగా చేదు దొండ తీగ మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని దీనిని వాడ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

Tags: Kaki Donda Chettu
Previous Post

Kobbari Undalu : వంట‌రాని వారు కూడా కొబ్బ‌రి ఉండ‌ల‌ను ఇలా సుల‌భంగా చేయ‌వ‌చ్చు.. ఎంతో రుచిగా ఉంటాయి..

Next Post

Tomato Pachadi : ట‌మాటా ప‌చ్చ‌డిని ఇలా ఎప్పుడైనా చేశారా.. అన్నంలో నెయ్యితో క‌లిపి తింటే రుచి అదిరిపోతుంది..

Related Posts

ఆధ్యాత్మికం

ఎరుపు, ప‌సుపు, నారింజ రంగులో ఉండే ఈ దారాన్ని ఎందుకు క‌డ‌తారో తెలుసా..?

August 8, 2025
వినోదం

బాలకృష్ణ పెళ్లికి ఎన్టీఆర్, హరికృష్ణ ఎందుకు రాలేదో తెలుసా..?

August 7, 2025
home gardening

మీ ఇంట్లో ఉన్న మొక్క‌లు ఏపుగా పెర‌గాలంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!

August 7, 2025
lifestyle

మీరు వాడుతున్న గోధుమ పిండి స్వ‌చ్ఛ‌మైందేనా..? క‌ల్తీ అయిందా..? ఇలా సుల‌భంగా గుర్తించండి..!

August 6, 2025
lifestyle

మీ భర్త మిమల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఇలా సులువుగా తెలుసుకోవచ్చు !

August 6, 2025
వినోదం

సినిమాలో హీరో క్యారెక్టర్ చనిపోయినా కూడా బ్లాక్ బస్టర్ సాధించిన సినిమాలు ఇవే..!

August 5, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Darbha Gaddi : ఈ వేరును గుమ్మానికి కడితే.. ఇంట్లోకి డబ్బులు వద్దన్నా వస్తాయి..!

by Editor
May 27, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Atti Patti Plant : పురుషుల‌కు ఈ మొక్క ఎంతో ఉప‌యోగ‌క‌రం.. ఇత‌ర ప్ర‌యోజ‌నాలు కూడా ఉంటాయి..!

by D
July 11, 2022

...

Read more
మొక్క‌లు

Kodi Juttu Aku : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. పిచ్చి మొక్క అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లే..!

by Editor
December 19, 2022

...

Read more
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.