Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home Off Beat

ఎరుపు రంగు చూస్తే ఎద్దులు పిచ్చిగా ప్ర‌వ‌ర్తిస్తాయా..? అవునో, కాదో తెలుసుకోండి..!

Admin by Admin
January 30, 2025
in Off Beat, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ప్ర‌పంచ వ్యాప్తంగా ఆయా దేశాల్లో ఎంతో కాలం నుంచి కొన్ని అంశాల ప‌ట్ల జ‌నాల్లో అపోహ‌లు నెల‌కొన్నాయి. రాను రాను అనేక త‌రాల వారు కూడా ఆయా అపోహ‌ల‌ను నిజ‌మే అని న‌మ్ముతూ వ‌స్తున్నారు. అయితే అలాంటి వాటిపై ఎప్ప‌టిక‌ప్పుడు సైంటిస్టులు ప‌రిశోధ‌న‌లు చేసి ఏవి అపోహ‌లో, ఏవి నిజాలో కూడా చెబుతూనే ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ ఆ విష‌యాల గురించి అవ‌గాహ‌న లేక‌పోవ‌డం వ‌ల్ల ఇప్ప‌టికీ చాలా మంది కొన్ని విష‌యాల‌లో ఏవి అపోహ‌లో, ఏవి నిజాలో తెలుసుకోలేకుండా ఉన్నారు. అలాంటి విష‌యాల గురించి ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

మ‌నం అనేక సినిమాల్లో చూశాం గుర్తుంది క‌దా, ఎద్దుల‌ను రెచ్చ గొట్టేందుకు వాటికి ఎరుపు రంగు చూపిస్తారు. అయితే ఇందులో వాస్త‌వం ఉందా..? నిజంగా ఎరుపు రంగును చూస్తే ఎద్దులు పిచ్చిగా ప్ర‌వ‌ర్తిస్తాయా..? అస‌లు వాటికి రంగుల‌ను గుర్తించే శ‌క్తి ఉందా..? అంటే లేదు. అవును, మ‌నుషుల‌కు త‌ప్ప ఈ లోకంలో దాదాపుగా ఏ జీవికి కూడా రంగుల‌ను గుర్తించే శ‌క్తి లేదు. వాటి ముందు ప్ర‌వ‌ర్తించే మ‌నుషుల ప్ర‌వ‌ర్త‌న వ‌ల్లే అవి రెచ్చిపోతాయి. అంతే త‌ప్ప ఎరుపు రంగును చూసి కాదు. మ‌నిషి చ‌నిపోయాక అత‌ని వెంట్రుక‌లు, గోర్లు అస్స‌లు పెర‌గ‌వు. అందుకు అవ‌కాశం ఉండ‌దు. ఎందుకంటే మ‌నిషి చ‌నిపోతే క‌ణాలు నెమ్మ‌దిగా న‌శిస్తూ ఉంటాయి. క‌నుక ఏ భాగానికి కూడా పోష‌ణ అంద‌దు. అలాంటి స్థితిలో గోర్లు, వెంట్రుకలు పెర‌గ‌వు. కానీ… చ‌నిపోయిన వ్య‌క్తి శ‌రీరంలో నీరు పోతుంది కాబ‌ట్టి గోర్లు, వెంట్రుక‌లు కొద్దిగా బ‌య‌టికి వ‌స్తాయి. దాన్ని చూసి ఎవ‌రైనా అవి పెరిగాయ‌ని అనుకుంటారు. అయితే ఇందులో నిజం లేదు.

people believe these myths are real

ఎంతో కాలం నుంచి మనం అనుకుంటూ వ‌స్తున్నాం క‌దా, పిడుగు ఒకే ప్ర‌దేశంలో రెండు సార్లు ప‌డ‌ద‌ని, ఒకేసారి ప‌డుతుంద‌ని. అయితే ఇది నిజం కాదు, అబ‌ద్దం. అస‌లు పిడుగు అనేది ఒక ప్ర‌దేశంపై ప‌డితే మళ్లీ అదే ప్ర‌దేశంలో పడేందుకు ఇంకా ఎక్కువ అవ‌కాశం ఉంటుందట‌. అలా ఆ పిడుగు అదే ప్ర‌దేశంలో ఒక‌టి క‌న్నా ఎక్కువ సార్లు ప‌డేందుకు కూడా అవ‌కాశం ఉంటుంద‌ట‌. ఎత్త‌యిన చెట్లు, భ‌వ‌నాల‌పై ఆ చాన్స్ ఇంకా ఎక్కువగా ఉంటుంద‌ట‌. ఆరోగ్యంగా ఉండాలంటే ఎవ‌రైనా రోజూ క‌చ్చితంగా 8 గ్లాసుల నీరు తాగాల్సిందే. అది మ‌న‌కు వైద్యులు చెబుతూనే ఉంటారు. అయితే అంద‌రూ ఈ రూల్‌ను పాటించాల్సిన ప‌నిలేద‌ట‌. ఎందుకంటే ఏ వ్య‌క్తికైనా అత‌ను చేసే ప‌నిని బ‌ట్టి నీరు తాగాల్సి ఉంటుంద‌ట‌. ఎక్కువ శారీర‌క శ్ర‌మ చేస్తే ఎక్కువ నీరు తాగాల‌ట‌. సాధార‌ణ వ్య‌క్తులు త‌మ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్టు నీటిని తాగితే చాల‌ట‌.

ఎక్కువ సేపు నీటిలో ఉంటే ఎవ‌రికైనా చేతి వేళ్లు, కాలి వేళ్లు ముడత‌లు ప‌డ‌తాయి. అయితే ఇంత‌కు ముందు దీని గురించి ఏమ‌ని అనుకునేవారంటే… నీళ్లు అంటే త‌డిగా ఉంటాయి కాబ‌ట్టి అంత సమ‌యం స్విమ్మింగ్ పూల్ లేదా బావి లాంటి వాటిలో ఉన్న‌ప్పుడు చేతులు, కాళ్లు అలా మారితే వాటి నుంచి పైకి ఎక్క‌డానికి, గ్రిప్ కోసం ప‌ట్టుకునేందుకు అనువుగా ఉండేందుకే చేతి, కాలి వేళ్లు అలా మారుతాయ‌ని అనుకునేవారు. కానీ అది స‌రైన రీజ‌న్ కాదు. అలా ఎందుకు వేళ్లు మారుతాయంటే… ఆ భాగాల్లోకి ర‌క్త స‌ర‌ఫ‌రా స‌రిగ్గా జ‌ర‌గ‌దు. అందుకే అవి ముడుచుకుని పోతాయి. చూయింగ్ గ‌మ్‌ల‌ను పొర‌పాటున మింగితే అవి క‌డుపులో చుట్టుకుని పోయి ప్ర‌మాదం ఏర్ప‌డుతుంద‌ని అనుకునేవారు. అయితే అది నిజం కాదు. ఎందుకంటే చూయింగ్ గ‌మ్ మాత్ర‌మే కాదు, మ‌న క‌డుపులో ఉండే యాసిడ్ కు రాళ్ల‌ను సైతం క‌రిగించే శ‌క్తి ఉంటుంద‌ట‌. అందుక‌ని చూయింగ్ గ‌మ్ మ‌న క‌డుపులో అలా చుట్టుకోదు. అరుగుతుంది. అయితే అలా అరిగే క్ర‌మంలో అందులో ఉండే గ‌మ్ లాంటి ప‌దార్థాన్ని మాత్రం జీర్ణాశ‌యం జీర్ణం చేయ‌దు. దీంతో అది మ‌లంలో అలాగే బ‌య‌టికి వ‌స్తుంది. అంతేకానీ చూయింగ్ గ‌మ్‌ను మింగినా మ‌న‌కు ఏమీ కాదు.

చెవులు, ముక్కు, నోరు, కళ్లు, చ‌ర్మం. వీటిని మ‌న శ‌రీరంలో పంచేంద్రియాలు అంటారు. వీటి ద్వారా మ‌న‌కు 5 ర‌కాల జ్ఞానాలు తెలుస్తాయి. విన‌డం, వాస‌న పీల్చ‌డం, రుచి చూసి తిన‌డం, చూడ‌డం, స్ప‌ర్శ‌. అయితే ఇవే కాదు, ఇంకా ఉష్ణోగ్ర‌త‌, ప్రెష‌ర్‌, బ్యాలెన్స్ వంటి మొత్తం 20 ర‌కాల జ్ఞానాలు (సెన్స్‌లు) మ‌న‌కు ఉంటాయ‌ట‌. సైంటిస్టులు చేసిన ప‌రిశోధ‌న‌ల్లో ఈ విష‌యం తెలిసింది. చ‌లిగా ఉన్న‌ప్పుడు మ‌ద్యం సేవిస్తే శ‌రీరం వేడెక్కుతుంద‌ని చెప్పి కొంద‌రు మ‌ద్యం తాగుతారు. అయితే ఇది అపోహే. ఎందుకంటే మ‌ద్యం సేవించ‌డం వ‌ల్ల శ‌ర‌రీంలో ర‌క్త నాళాలు వెడ‌ల్పు అవుతాయి. ఫ‌లితంగా పెద్ద ఎత్తున ర‌క్తం ఆ నాళాల్లోకి వ‌స్తుంది. ఆ నాళాలు చ‌ర్మం కిందే ఉంటాయి. అందుక‌ని ఒక్క‌సారిగా శ‌రీరం వేడి అయిన‌ట్టు అవుతుంది. ఆ త‌రువాత వెంట‌నే చ‌ల్ల‌బ‌డుతుంది. అంతేకానీ మ‌ద్యం సేవించ‌డం వ‌ల్ల శ‌రీరం వేడెక్క‌దు.

అక్వేరియంలో మ‌నం పెంచుకునే బుల్లి బుల్లి గోల్డెన్ ఫిష్‌ల‌కు జ్ఞాప‌క‌శక్తి చాలా త‌క్కువ‌గా ఉంటుంద‌ని అంద‌రూ అనుకునేవారు. సైంటిస్టులు కూడా అదే చెబుతూ వ‌చ్చారు. వాటికి జ్ఞాప‌క‌శ‌క్తి కేవ‌లం 5 సెక‌న్ల పాటే ఉంటుంద‌ని అనేవారు. కానీ అది అబ‌ద్ద‌మ‌ట‌. తాజాగా కొంద‌రు సైంటిస్టులు చేసిన ప‌రిశోధ‌న‌ల్లో తేలిందిది. నిజానికి గోల్డ్ ఫిష్‌లు మ‌న‌కంటే బాగా తెలివిక‌ల‌వ‌ట‌. అవి 3 నెల‌ల వ‌ర‌కు ఏ విష‌యాన్న‌యినా గుర్తు పెట్టుకుంటాయ‌ట‌. స‌మ‌యాన్ని కూడా తెలియ‌జేస్తాయ‌ట‌. చంద్రుడి పై నుంచి చూస్తే చైనాలో ఉన్న గ్రేట్ వాల్ ఆఫ్ చైనా క‌నిపిస్తుంద‌ని అంద‌రూ అనుకుంటారు. కానీ నిజం కాదు. చంద్రుడి పై నుంచి చూస్తే ఆ గోడ క‌నిపించ‌దు. అస‌లు చంద్రుడే కాదు, భూమిపై కొన్ని కిలోమీట‌ర్ల దూరం వెళితేనే ఆ గోడ క‌నిపించ‌దు. కానీ భూమిపై ఉండే లైట్లు మాత్రం చంద్రుని నుంచి క‌నిపిస్తాయి. వాటిని అక్క‌డి నుంచి చూడ‌వ‌చ్చు.

Tags: myths
Previous Post

రోజుకి 8 గంటలు కూర్చునే పని చేస్తున్నారా.? అయితే 5 ఏళ్ల తర్వాత మీకొచ్చే 10 ప్రమాదాలు ఇవే.!

Next Post

ఈ ప‌నులను మీరు నిత్యం పొర‌పాటుగా చేస్తున్నార‌ని మీకు తెలుసా..?

Related Posts

వైద్య విజ్ఞానం

దంతాలు, చిగుళ్లు, నోరు ఆరోగ్యంగా లేక‌పోతే గుండె జ‌బ్బులు వ‌స్తాయా..?

July 23, 2025
ఆధ్యాత్మికం

ప‌సికందుల క‌ణ‌త‌ల‌కు న‌ల్లని చుక్క ఎందుకు పెడ‌తారో తెలుసా..?

July 23, 2025
హెల్త్ టిప్స్

అంద‌మైన వ‌క్ష సంప‌ద కావాలంటే.. అమ్మాయిలు ఈ చిట్కాల‌ను పాటించాలి..!

July 23, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

రోజూ గంట‌ల త‌ర‌బ‌డి కూర్చుని ప‌నిచేస్తున్నారా..? అయితే ఇది చ‌దవండి..!

July 23, 2025
ఆధ్యాత్మికం

ఈ రాశులు ఉన్న‌వారు రెండు స్వ‌భావాల‌ను క‌లిగి ఉంటార‌ట‌..!

July 23, 2025
వినోదం

సీనియర్ ఎన్టీఆర్ నుండి పవన్ కళ్యాణ్ వరకు రెండు పెళ్లిళ్లు చేసుకున్న నటులు ..!!

July 22, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.