భార్య చిన్ననాటి ఆల్బమ్ తిరగేసిన భర్త.. అందులో ఒక ఫోటో చూడగా మైండ్ బ్లాంక్!

ఓ వ్యక్తి తన భార్య చిన్ననాటి ఫోటో ఆల్బమ్‌ను తిరగేస్తున్నాడు. అందులో అతడు ఓ ఫోటో చూడగానే దెబ్బకు స్టన్ అయ్యాడు. అసలు ఇదెలా సాధ్యమైందో అతడి ఊహకు అందట్లేదు. అదేంటంటే.? టీనేజ్‌లో ఉండగా తన భార్య తీయించుకున్న ఓ ఫోటోలో.. అతడు కూడా ఉండటాన్ని గమనించాడు. ఇంతకీ అదెలా జరిగిందంటారా.? ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం..

వివరాల్లోకి వెళ్తే.. చైనాకు చెందిన ఓ జంట.. తాము ప్రేమలో పడటానికి ముందే.. అంటే దాదాపుగా 11 ఏళ్ల క్రితమే టీనేజ్‌లో ఉండగా ఓ ఫోటోలో ఇద్దరం ఒకరికి ఒకరం తెలియకుండానే దిగాం అని తెలిసి ఆశ్చర్యపోయారు. 2011లో చెంగ్డూ నగరంలో మిస్టర్ యే, మిసెస్ జులు ఒకరినొకరు కలుసుకుని ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఇక మిస్టర్ యే.. కొద్ది నెలల కిందట తన తన అత్తగారింటికి వెళ్లాడు. అక్కడ అతడి భార్య చిన్ననాటి ఫోటోలు ఉండే ఓ ఆల్బమ్‌ను తిరగేశాడు. ఇక అందులో ఓ ఫోటోను చూసి దెబ్బకు షాకయ్యాడు. అసలు ఇదెలా సాధ్యమైందో అతడికి అర్ధం కాలేదు.

have you found any similarity in this chinese couple photo

ఎందుకంటే.. ఆ ఫోటోలో తన భార్య వెనుక అతడు కూడా ఉన్నాడు. అదేదో పురాతన కట్టడం అయి ఉండొచ్చు.. ఆమె తన సిగ్నేచర్ పోజ్‌లో ఫోటోకు పోజులిచ్చింది. ఇక భర్త కూడా సదరు మహిళ వెనుక తన సిగ్నేచర్ పోజుతో నిల్చున్నాడు. అప్పుడు వీరిద్దరికీ అస్సలు పరిచయం లేదు. ఇంకా టీనేజర్లు కూడా. అందుకే ఆ ఫోటోలో తనను తాను చూసుకుని మిస్టర్ యే ఆశ్చర్యపోయాడు.

అది జూలై 2000 సంవత్సరం. నేను ఫోటోను చూడగానే ఆశ్చర్యపోయాను. నా శరీరమంతా గూస్‌బంప్‌లు వచ్చాయి. అది నా సిగ్నేచర్ పోజ్ అని మిస్టర్ యే అన్నాడు. ఆ సమయంలో తన గ్రూప్‌తో కలిసి ఆ ప్రాంతానికి టూర్‌కి వచ్చాడట మిస్టర్ యే. ఇక్కడ ఇంకా ఆశ్చర్యకర విషయమేంటంటే.. ఇద్దరూ కూడా తమ సిగ్నేచర్ పోజులలో.. వారి వారి ఫోటోలకు పోజులిచ్చారు.