Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home Off Beat

తాను చ‌నిపోతాన‌ని ముందే తెలిసిన ఈ డాక్ట‌ర్.. త‌న చావుకు కావ‌ల్సిన ఏర్పాట్ల‌ను త‌నే స్వ‌యంగా చేసుకున్నాడు..

Admin by Admin
February 25, 2025
in Off Beat, వార్త‌లు
Share on FacebookShare on Twitter

పెళ్లి సమయం వచ్చింది , వైరా దగ్గరలోని మేనత్త ఊరిలో సింధు అనే అమ్మాయిని పరస్పరం వీడియోలో చూసుకున్నారు ఇష్టపడ్డారు కరోనాకాలం మొదలవుతుంది ముందుగా నిర్ణయించిన సమయానికి అనగా ఫిబ్రవరి 12 2020 నాడు హర్ష సింధుల వివాహం అత్యంత ఘనంగా ఖమ్మంలో జరిగింది వారం రోజులపాటు తిరుపతి గుళ్ళు గోపురాలు అత్యంత ఆనందంగా కుటుంబ సభ్యులతో కలిసి తిరిగారు. డాక్టర్ హర్ష ఫిబ్రవరి 29 అనగా లీఫ్ సంవత్సరం నాడు ఆస్ట్రేలియా వెళ్ళాడు. సింధు ఏప్రిల్ మొదటి వారంలో ఆస్ట్రేలియా వెళ్లడానికి ప్లాన్ చేసుకుంది. కానీ ఆ అమ్మాయి అదృష్టమో దురదృష్టమో కానీ 23 2020 నుండి కరోనా డేంజర్ బెల్స్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్ విధించబడింది. సింధు ఆస్ట్రేలియా వెళ్లలేకపోయింది.

స్వతహాగా డాక్టర్ అయినా హర్ష కి పరిశుభ్రత అంటే ప్రాణం, ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యత ఇచ్చేవాడు. స్వయంగా వంట చేసుకునేవాడు. జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్, పిజ్జా, బర్గర్ వంటి వాటిని దగ్గరికి రానిచ్చేవాడు కాదు. డాక్టర్ హర్ష కి బాడీ ఫిట్ నెస్ అంటే ఇష్టం దాని కొరకు ప్రతిరోజు జిమ్ చేసేవాడు. అక్టోబర్ 2020లో జిమ్ లో ఎక్సర్సైజ్ చేస్తుంటే ఆయాసం కొంచెం దగ్గు రావడం మొదలైంది. వెంటనే డాక్టర్ హర్ష పరీక్ష చేయించుకోగా ఉప్పెన లాంటి వార్త లంగ్ క్యాన్సర్ గా నిర్ధారణ జరిగింది. కుటుంబ సభ్యులందరూ కనీసం మూడు నెలల పాటు షాక్ లో ఉన్నారు. లాక్ డౌన్ కారణంగా తల్లిదండ్రులు ఆస్ట్రేలియా వెళ్లలేని పరిస్థితి హర్ష ఇండియా రాలేని పరిస్థితి విమానాలు నడవటం లేదు.

you will cry upon knowing this doctors story

క్యాన్సర్ సోకింది అన్న భయంకరమైన నిజాన్ని నేను భరించక తప్పదు అని భావించిన హర్ష తన తల్లిదండ్రుల్ని బంధువుల్ని తను ఇష్టపడే వాళ్ళందరినీ నాకు ఏమి కాదు తగ్గిపోతుందిలే అని మోటివేట్ చేశాడు చికిత్స తీసుకున్నాడు. మరి అమాయకురాలైన సిందూ భవిష్యత్తు ?? డాక్టర్ హర్ష ముందు తనకొచ్చిన క్యాన్సర్ వ్యాధి కంటే పెద్ద సమస్య సింధు భవిష్యత్తు. సింధు మెరుగ్గా ఉండాలని ఆలోచించాడు అసలే సింధు వాళ్ళ నాన్న ఆక్సిడెంట్ కు గురై ఎనిమిది సంవత్సరాల నుండి శరీరం చచ్చుబడి బెడ్ మీదనే ఉంటున్న అతనిని అత్యంత ఓపికస్తురాలైన సిందూ తల్లి అన్నీ తానై చూసుకుంటుంది సింధు గురించి మెరుగ్గా ఆలోచించాడు విడాకులు కోరాడు కానీ సింధు ఒప్పుకోలేదు లాక్ డౌన్ ఎత్తివేయగానే నేను ఆస్ట్రేలియా వచ్చి నీకు తోడు గా ఉంటాను అంది కానీ ఏ ముచ్చట తీరకుండానే విదవరాలు కావడం హర్ష కు ఇష్టం లేదు.

ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి విడాకులు తీసుకున్నాడు విడాకుల సమయంలో ఆ అమ్మాయికి అన్నీ అదనంగానే ఇచ్చాడు. సిందు ఎమ్మెస్ చదవడానికి అమెరికా వెళ్ళింది, సింధుకి పెళ్లి సంబంధాలు వచ్చినా నచ్చలేదు అంటుంది, డాక్టర్ తీసుకుంటున్న చికిత్స ఫలితంగా తగ్గిపోయింది అనుకున్న మహమ్మారి ఈసారి మరింత ఉధృతంగా దాడి చేసింది డాక్టర్ హర్ష కి విషయం తెలిసింది తను ఈ భూమిపై ఉండేది కొన్ని రోజులేనని తల్లిదండ్రులు ఆస్ట్రేలియా వస్తా అన్నా కూడా వద్దు అన్నాడు ఎందుకంటే ఆ వ్యాధి వల్ల తను పడే బాధలు వాళ్ళు చూడకూడదు అని బలంగా అనుకున్నాడు. వ్యాధి తీవ్రత తెలిసిన దగ్గర నుండి చికిత్స తీసుకుంటూనే ప్రతి క్షణం తన తల్లిదండ్రులను అత్యంత సున్నితంగా మానసికంగా తనకు ఏది జరిగినా భరించడానికి సిద్ధం చేస్తున్నాడు.

2020 ఫిబ్రవరిలో వెళ్లిన డాక్టర్ హర్ష రెండున్నర సంవత్సరాల తర్వాత 2022 అక్టోబర్లో చిట్ట చివరిసారిగా తన తల్లిదండ్రులను చూడడానికి ఇండియా ఖమ్మం వచ్చాడు. 15 రోజులు ఉండి ఒకేరోజు తన తల్లిదండ్రులను అమెరికాలోని తన తమ్ముడి దగ్గరకు పంపి తనకు ఆస్ట్రేలియాలోనే మెరుగైన వైద్యం లభిస్తుంది అని చెప్పి తను ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. డాక్టర్ హర్ష ఆస్ట్రేలియాలో 100 మందికి పైగా అనాధలు ఉన్న ఆశ్రమంలో వారికి అత్యంత ఓపికగా ప్రేమగా కావాల్సిన వైద్యం అందిస్తూ ఉంటాడు డాక్టర్ హర్ష కి వాళ్లు అన్న వారికి హర్ష అన్న పిచ్చి ప్రేమ. కానీ డాక్టర్ హర్షా కి తెలుసు తన అనుకున్న వాళ్ళందరినీ ఈ భూమి మీద నుండి వెళ్లిపోవడానికి తనకి చికిత్స చేస్తున్న వైద్యులు మూడు ముందస్తు డెత్ తేదీలు ఇచ్చారని. ఈ సమయంలోనే అత్యంత స్థితప్రజ్ఞత ప్రదర్శిస్తూ తన తల్లిదండ్రులను అందరూ ఆశ్చర్యపోయే విధంగా మానసికంగా సిద్ధం చేసిన విధానం వల్ల హర్ష అంటే అందరికీ మరింత గౌరవం ఏర్పడింది

చక్కటి మనస్తత్వం కలిగి సహాయం చేసే సుగుణవంతుడైన డాక్టర్ హర్షకు స్నేహితులు ఇండియాలో ఆస్ట్రేలియాలో అనేకమంది ఉన్నారు. అవసరం ఉండి స్నేహితుల మెసేజ్ పెడితే ఎంత పనిలో ఉన్నా ఖచ్చితంగా సాధ్యమైనంత త్వరగా స్పందించేవాడు ఫోన్ లో నేను ఒక గంట లేదా రెండు గంటల్లో స్పందించలేదు అంటే ఇక హర్ష లేడు అనుకోమని స్నేహితులతో ముందుగానే అన్నాడు. సమయం రానే వచ్చింది డాక్టర్లు ముందుగా ఇచ్చిన ఒక డెత్ డేట్ మార్చి 27 2023 దీనికి ముందుగానే తను చనిపోయినప్పుడు ఎవ్వరికీ బరువు భారం కాకుండా లాయర్ తో మాట్లాడి ఆథరైజేషన్ అక్కడి తన స్నేహితులకు ఇచ్చాడు. అలాగే శవపేటికను స్వయంగా ఆర్డర్ చేసుకున్నాడు తన కారు అమ్మేశాడు నిర్జీవమైన స్థితిలో తన తల్లిదండ్రుల వద్దకు రావడానికి కనీసం సింగిల్ డాలర్ కూడా ఖర్చు పెట్టుకోవడానికి తన స్నేహితులకు అవకాశం ఇవ్వకుండా ప్రతిదీ తనే ప్లాన్ చేసుకున్నాడు

సిడ్నీలో ఉండే సైంటిస్ట్ అయినా తన బంధువుని మార్చ్ 24 వ తారీకు రమ్మన్నాడు మార్చి 23 తను రెగ్యులర్ గా వైద్య సేవలు అందించే ఆశ్రమానికి వెళ్ళాడు నేను ఇండియాకు వెళ్తున్నాను అని బాయ్ బాయ్ చెప్పి వారి దగ్గర నుండి వీడ్కోలు తీసుకున్నాడు. 24 మార్చి ఉదయం బ్రౌన్ కలర్ జాకెట్ వేసుకొని తెల్లటి పాయింట్ తెల్లటి షూ ధరించి చక్కగా ఉన్నాడు తన స్నేహితులతో కలిసి చాలాసేపు తల్లిదండ్రులతో వీడియో కాల్ మాట్లాడాడు అనంతరం అందరూ కలిసి టిఫిన్ చేసి వచ్చారు ఒక గంట తర్వాత మళ్లీ ఫోన్ చేస్తా అని తల్లికి చెప్పాడు. నాకు మళ్ళీ కాఫీ తాగాలనిపిస్తుంది వెళ్లొద్దాం పద అని స్నేహితులతో అంటే ఎందుకురా ఇప్పుడే కదా తాగాము అని స్నేహితులు అంటే తను ఒక్కడే స్వయంగా కారు నడుపుకుంటూ వెళ్లి కాఫీ తాగి వచ్చాడు. అనంతరం మూత్ర విసర్జనకు వాష్ రూమ్ కి వెళ్ళగా మూత్రం బదులు రక్తం రావడం గమనించాడు స్నేహితులకు చెప్పాడు నేను మరొక గంట కంటే ఎక్కువ సమయం మీ ముందు ఉండకపోవచ్చు అని.

నేను కొంచెం రెస్ట్ తీసుకుంటా అని పడుకున్నాడు అంతే రెండు నిమిషాల తర్వాత 32 సంవత్సరాల హర్ష వర్ధన్ శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా అంతిమ దశలో తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లడానికి కావలసిన ఏర్పాట్లు తనే స్వయంగా చేసుకొని ఇలా కూడా చేయొచ్చా అని చూపి అందరికీ ఆదర్శవంతుడు అయ్యాడు.

Tags: dr harsha
Previous Post

మధ్యపానం,ధూమపానమే కాదు ఈ ప‌దార్థాలు కూడా లివ‌ర్ చెడిపోడానికి ప్ర‌ధాన కార‌ణాలు.

Next Post

కృష్ణ‌ను అప్ప‌ట్లో ఆయ‌న యాంటీ ఫ్యాన్స్ బెండు అప్పారావు అని ఆట ప‌ట్టించే వారా..? ఎందుక‌ని..?

Related Posts

ఆధ్యాత్మికం

ప‌సికందుల క‌ణ‌త‌ల‌కు న‌ల్లని చుక్క ఎందుకు పెడ‌తారో తెలుసా..?

July 23, 2025
హెల్త్ టిప్స్

అంద‌మైన వ‌క్ష సంప‌ద కావాలంటే.. అమ్మాయిలు ఈ చిట్కాల‌ను పాటించాలి..!

July 23, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

రోజూ గంట‌ల త‌ర‌బ‌డి కూర్చుని ప‌నిచేస్తున్నారా..? అయితే ఇది చ‌దవండి..!

July 23, 2025
ఆధ్యాత్మికం

ఈ రాశులు ఉన్న‌వారు రెండు స్వ‌భావాల‌ను క‌లిగి ఉంటార‌ట‌..!

July 23, 2025
వినోదం

సీనియర్ ఎన్టీఆర్ నుండి పవన్ కళ్యాణ్ వరకు రెండు పెళ్లిళ్లు చేసుకున్న నటులు ..!!

July 22, 2025
హెల్త్ టిప్స్

రోడ్లపై పునుగులు, బోండాలు, మంచూరియా, తింటున్నారా..అయితే నష్టాలు తప్పవు..!

July 22, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.