Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home Off Beat

పాము కుబుసం ఎందుకు విడుస్తుంది? ఆ స‌మ‌యంలో పాముల‌ను చూస్తే అవి ప‌గ‌బ‌డ‌తాయా..?

Admin by Admin
March 22, 2025
in Off Beat, వార్త‌లు
Share on FacebookShare on Twitter

కుబుసం విడవటం కోసం పాము తన తలను గరుకు ప్రదేశంలో రుద్దుకుంటుందని ప్రొఫెసర్ మంజులత చెప్పారు. పొదలు, చిన్నచిన్న రంధ్రాలు, రాళ్ల మధ్య, ఇంటి గోడలకు ఉండే కన్నాల వద్ద పాము కుబుసాలు అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. కుబుసాన్ని పట్టుకుంటే విషం అంటుకుంటుందనే వాదనలు వింటుంటాం. ఇంకొందరు కుబుసం విడిచే సమయంలో చూస్తే పాములు పగబడతాయంటారు. ఇందులో నిజమెంత? ప్రపంచంలో ఉన్న అన్ని రకాల పాములు కుబుసం విడుస్తాయా? ఎన్ని రోజులకు ఒకసారి పాము కుబుసం విడుస్తుంది? పాము కుబుసం విడవటం మర్చిపోతుందా? అలా జరిగితే అర్థం ఏంటి? అసలు పాము కుబుసం ఎందుకు విడుస్తుందో తెలుసా?

వీటికి సమాధానాలు తెలుసుకునేందుకు ఆంధ్ర విశ్వవిద్యాలయం జువాలజీ విభాగం ప్రొఫెసర్ సి. మంజులత, అలాగే ఈస్ట్రన్ ఘాట్ వైల్డ్ లైఫ్ సొసైటీ కన్జర్వేషన్ బయోలజిస్ట్‌గా పని చేస్తున్న మూర్తి కంఠిమహంతిల మాట్లాడింది. కుబుసం(పాము శరీరంపై పొర) విడవడమనేది పాముల్లో జరిగే అత్యంత సహజమైన ప్రక్రియ అని ప్రొఫెసర్ సి. మంజులత చెప్పారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని ఆమె వివరించారు. ఇది మనుషుల్లో కూడా జరుగుతుంది. అయితే మనం రోజూ స్నానం చేస్తుండటంతో అది మనం గుర్తించలేం. కానీ పాములకు పాత పొర కింద కొత్త పొర ఏర్పడిన తర్వాత పాత పొరని వదిలేసే ప్రక్రియే కుబుసం విడవటం. పాములు తమ కుబుసాన్ని ఏకమొత్తంగా ఒకేసారి విడుస్తాయి.

why snakes shed skin

మన శరీరం సైజు పెరిగితే పాత బట్టలను ఎలాగైతే వదిలేసి మనకు తగ్గ సైజు బట్టలు కుట్టించుకుంటామో… అలాగే పాములు కూడా తమ చర్మంపై పొర బిగుతుగా మారిపోయి దాని కింద కొత్త పొర ఏర్పడినప్పుడు పాత పొరని వదిలేస్తాయి. కుబుసం విడవటం కోసం పాము తన తలను గరుకు ప్రదేశంలో రుద్దుకుంటుంది. అప్పుడు అక్కడ పొరపై ఒక చీలిక ఏర్పడుతుంది. దాని నుంచి పాత పొరను వదిలించుకుంటూ పాము బయటకు వచ్చేస్తుంది. దీన్నే కుబుసం విడవడం అంటారు. ప్రపంచంలో ప్రస్తుతం 3 వేలకు పైగా ఉన్న పాము జాతులు కుబుసాన్ని విడుస్తాయని ప్రొఫెసర్ మంజులత చెప్పారు. పాము జీవించి ఉన్నంత వరకూ దాని శరీరం కొంచెం కొంచెంగా పెరుగుతూ ఉంటుంది. పాము శరీరం పెరుగుతూ ఉంటే… సహజంగానే దాని చర్మం సాగుతూ బిగుతుగా అవుతుంది. ఇది మనుషుల్లో కూడా జరుగుతుంది. అలా బిగుతుగా మారిన చర్మం లేదా పైపొరనే పాము వదిలించుకుంటుంది.

పాము కుబుసాన్ని ఏక మొత్తంగా విడిచిపెట్టడంతో ఇది పాములాగే కనిపిస్తుంది. ప్రపంచంలో ప్రస్తుతం 3 వేలకు పైగా ఉన్న పాము జాతులు కుబుసాన్ని విడుస్తాయని, కుబుసం విడవని పాములు ఉండవని మంజులత చెప్పారు. కుబుసం విడవడమంటే సూక్ష్మజీవులు, మలినాలతో బిగుతుగా మారిన చర్మంపై పొరని వదిలించుకోవడమే. పాములు ఒక నిర్ధిష్ట కాలానికి ఒకేసారి ఏక మొత్తంగా కుబుసాన్ని విడుస్తాయి. పాత చర్మంపై ఉన్న సూక్ష్మజీవుల నుంచి కాపాడుకోడానికి పాములకు కుబుసం విడిచే ప్రక్రియ ఎంతో ఉపయోగపడుతుందని ప్రొఫెసర్ చెప్పారు. కుబుసం విడుస్తుందంటే ఆ పాము పై పొర కింద కొత్త పొర ఏర్పడినట్లే అర్థం అని మూర్తి కంఠిమహంతి చెప్పారు. పాము కుబుసం వదిలే సమయంలో దాని పరిస్థితిని మూర్తి వివరిస్తూ.. తన చర్మంపై కొత్త పొర ఏర్పడిందనే విషయం పాముకి ఎప్పుడైతే అర్థం అవుతుందో… అది వెంటనే పాత పొరని వదిలించుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెడుతుంది. అప్పటికే దాని కళ్లు సరిగా కనిపించవు. ఎందుకంటే దాని కళ్లపై కూడా పొర ఏర్పడటమే కారణం. పైగా కళ్లు నీలంగా మారిపోతాయి. అటువంటి సమయంలో పాములు వెంటనే కుబుసం వదలడానికి సిద్ధమవుతాయి.

కుబుసం వదిలే సమయంలో పాము కష్టంలో ఉన్నట్లే అర్థం. కుబుసం విడిచిపెట్టిన తర్వాత ఒక్కసారిగా రిలాక్స్ అయిపోతుంది. దాంతో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ప్రెష్‌గా కనిపిస్తుంది. ఎందుకంటే పాము కుబుసం విడిచిపెట్టే సమయంలో అసౌకర్యంగా ఉండి ఎటువంటి ఆహారం తీసుకోదు. దాంతో ఆకలి తీర్చుకునేందుకు చాలా ఉత్సాహంతో తిరుగుతూ ఉంటుంది అని చెప్పారు. కుబుసం విడిచే సమయంలో ఆ సమీపంలో అలికిడి వినిపిస్తే పాము దాడి చేసేందుకు ప్రయత్నిస్తుందని మూర్తి కంఠిమహంతి చెప్పారు. కుబుసం విడిచిపెట్టే సమయంలో పాముని చూస్తే అది పగపట్టి, కాటేస్తుందనే కొందరి నమ్మకాలపై మూర్తి స్పష్టతనిచ్చారు. శరీరంపై కుబుసం ఉన్నపుడు పాము అసౌకర్యంగా ఉంటుంది. దీంతో ఎవరు దాడి చేయకుండా చీకటిగా ఉన్న చోటే ఉంటుంది. ఆ సమయంలో దానికి ఇబ్బంది కలిగించేలా అలికిడి చేసినా, దానిని కదిపినా అది చాలా అసౌకర్యానికి గురై, దాడి చేస్తుంది. పైగా కుబుసం విడిచిపెట్టే సమయంలో కంటి వద్ద కుబుసం సరిగా విడవకపోతే అది మరింత ఇబ్బంది. దాంతో కుబుసం విడిచే సమయంలో ఆ సమీపంలో అలికిడి వినిపిస్తే దాడి చేసేందుకు సహజంగానే ప్రయత్నిస్తాయి. దీనినే అందరు పగ పట్టాయి అంటుంటారు అని మూర్తి కంఠిమహంతి చెప్పారు.

ప్రపంచంలో అన్ని పాము జాతులు కుబుసం విడుస్తాయి. రెండు, మూడు వారాల వయసున్న పాములు, ఇంకా పిల్లలుగానే ఉన్నవి నెలలో మూడు నాలుగు సార్లు కుబుసం విడుస్తాయని మూర్తి కంఠిమహంతి తెలిపారు. ఇక వయసు ఎక్కువైన పాములు ఏడాదికి ఒకటి, రెండు సార్లు కుబుసం విడుస్తాయన్నారు. పాములు కుబుసం ఎంత తరుచుగా విడుస్తాయనే దానికి నిర్ధిష్టమైన లెక్క ఉండదు. పాము తీసుకున్న ఆహారం, అది ఉన్న ప్రదేశం, అక్కడ ఉష్ణోగ్రత, తేమశాతంపై కూడా అది ఆధారపడి ఉంటుంది. అలాగే పాము జాతి కూడా ప్రధాన అంశమే అని మూర్తి కంఠిమహంతి చెప్పారు. కంటి పై పొర నుంచి తోక చివరి భాగం వరకు మొత్తం పొరని ఏక కాలంలో విడిచే ఏకైన జీవజాతి పాములేనని చెప్పారు.

పాముకి పై పొర ఎప్పుడైతే అసౌకర్యంగా మారుతుందో.. దానిని పాము భరించలేని పరిస్థితి వస్తుంది. ఒక సెన్సార్స్ వంటి వ్యవస్థ ఆ పొరని వదిలించుకోమని పాముకి సిగ్నల్స్ ఇస్తుంది. దాంతో పాము తన పై పొరని వదిలించుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటుంది. ఈ కుబుసం విడవడమనేది సహజ ప్రక్రియ. అది అవ్వకపోతే పాము అనారోగ్యం పాలైనట్లే భావించాలి. అప్పుడు అది యాక్లివ్‌గా ఉండదు. చర్మ వ్యాధులకు కూడా లోనవుతుంది. ఆహారం సరిగా తీసుకోలేదు. అలా ఒక సమస్య తర్వాత మరొకటి చేరి ఒకటి చేరి పాము మరణానికి కూడా దారి తీస్తుందన్నారు. ఆ సమయంలో మనం దానికి ఏదైనా సహాయం చేద్దామన్నా.. అవి పూర్తి అసౌకర్యంగా ఉండి, వాటి దగ్గరకు వెళ్లిన వారిపై దాడి చేసే అవకాశం ఉందని మూర్తి కంఠిమహంతి చెప్పారు.

పాము కుబుసం విడవకపోతే అనారోగ్యం పాలైనట్లే భావించాలని మూర్తి చెప్పారు. పాము విడిచిన కుబుసం విషంతో సమానమనే ప్రచారం కూడా ఉంది. దీనిపై ప్రొఫెసర్ మంజులత స్పష్టతనిచ్చారు. కుబుసాన్ని తాకితే ఏమీ కాదు. కుబుసం అనేది ప్రాణం లేని కణ జాలం. దానిపై పాము విషం ఉండదు. కాబట్టి కుబుసంపై అపోహాలు వద్దు అని మంజులత చెప్పారు. అయితే కుబుసం వదిలిన ప్రాంతానికి సమీపంలో పాము ఉండే ప్రమాదం ఉంటుందని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కుబుసం వదిలిన చోటు దానికి ఆవాసం లాంటిది. అందుకే కుబుసం విడిచిన తర్వాత కూడా అది అక్కడే ఉండొచ్చు. మనకు కుబుసం కనిపిస్తే.. అక్కడ పొగ పెట్టడం ద్వారా పాముని మరొక చోటుకు పంపేయవచ్చు అని ప్రొఫెసర్ మంజులత చెప్పారు.

Tags: snake skin
Previous Post

కరాచీ బేకరి అన్న పేరు ఆ బేకరీకి ఎలా వచ్చింది?

Next Post

నా వద్ద రూ.10 లక్షలు ఉన్నాయి. ఈ డబ్బుతో నెలకు కనీసం రూ.35,000 తిరిగి రావడానికి నేనేం చేయాలో చెప్పగలరా?

Related Posts

అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

ఈ కాఫీని తాగితే ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉంటాయ‌ట‌..!

July 23, 2025
vastu

మీ ఇంట్లో తాబేలు విగ్ర‌హాన్ని ఇలా పెట్టండి.. ల‌క్ క‌ల‌సి వ‌స్తుంది..!

July 23, 2025
వినోదం

కెరీర్ పిక్స్ లో ఉండగా మరణించిన ప్రముఖ సినీ సెలెబ్రిటీలు వీళ్లే?

July 23, 2025
ఆధ్యాత్మికం

ఒకే గోత్రం ఉన్న‌వారు పెళ్లి చేసుకోకూడ‌దా..? వివాహం అయితే పిల్ల‌లు పుట్టరా..?

July 23, 2025
వైద్య విజ్ఞానం

దంతాలు, చిగుళ్లు, నోరు ఆరోగ్యంగా లేక‌పోతే గుండె జ‌బ్బులు వ‌స్తాయా..?

July 23, 2025
ఆధ్యాత్మికం

ప‌సికందుల క‌ణ‌త‌ల‌కు న‌ల్లని చుక్క ఎందుకు పెడ‌తారో తెలుసా..?

July 23, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.