Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home Off Beat

రెస్టారెంట్‌కు వ‌చ్చిన ధ‌నికుడి క‌ళ్లు తెరిపించిన బేర‌ర్‌.. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే..?

Admin by Admin
April 16, 2025
in Off Beat, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఆ ఏరియాలో మంచి పేరున్న రెస్టారెంట్ అది. ఎప్పుడూ కస్టమర్లతో కళకళలాడుతూ వుంటుంది. వారాంతాలలో అయితే చాలా రద్దీగా వుంటుంది. డబ్బున్న శ్రీమంతులు పెద్దపెద్ద కార్లలో కుటుంబ సమేతంగా అక్కడికి వచ్చి రకరకాల రుచులను ఆస్వాదించి వెళ్తుంటారు. అలాంటి వారిలో ఒక శ్రీమంతుడు ప్రతివారం తన కుటుంబంతో అక్కడికి వస్తుంటాడు. అతను వచ్చిన ప్రతిసారీ పెద్ద మొత్తంలో బేరర్ టిప్ ఇస్తుంటాడు. అందుకే అతనికి సర్వ్ చేసే అవకాశంకోసం బేరర్ లు ఎదురుచూస్తుంటారు. అలాట్‌మెంట్ సిస్టం వుండటం వలన ఒక్కొక్క వారం ఒక్కొక్కర్ని ఆ అదృష్టం వరిస్తుంది. ఒక వారాంతంలో అతను ఎప్పటిలాగే కుటుంబసమేతంగా హోటల్ కి విచ్చేశాడు. ఆ శ్రీమంతుడికి సర్వ్ చేసే అవకాశం వచ్చిన కుర్రాడు ఆరోజు సెలవు పెట్టాడు. అందుచేత ఆ డ్యూటీ కొత్తగా వచ్చిన హనుమంతుకి పడింది.

నెల క్రితమే పనిలో చేరి, ఆరోజే మొదటి జీతం అందుకున్న హనుమంతుకి ఈ అవకాశం మరింత సంతోషాన్నిచ్చింది. తోటివారందరూ అతని అదృష్టానికి కొంచెం అసూయపడ్డారు. శ్రీమంతుడికి, అతని ఫ్యామిలీకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా సర్వ్ చేశాడు హనుమంతు. ఆరోజు హోటల్ లో వున్న స్పెషల్ ఐటెమ్స్ గురించి చెప్పి, ఏ పదార్ధాలు ఎలాంటి ప్రత్యేకమైన రుచికోసం తయారు చెయ్యబడ్డవో పూస గుచ్చినట్టు వివరించాడు. అతని పనితనానికి శ్రీమంతుడు చాలా ముచ్చటపడ్డాడు. అతను చెప్పిన స్పెషల్ ఐటెమ్స్ ని తెప్పించుకున్నాడు. కానీ ఆర్డర్ ఇచ్చిన ఏ ఐటెమ్ ని సగం కూడా తినలేదు. ఒక్కొక్క ఐటెమ్ ని ప్లేట్ లో వడ్దించుకోవడం, కొంచెం తినడం, టిష్యూ పేపర్ తో మూతి తుడుచుకుని ఆ మిగిలిన ఆహారపదార్ధంలో పడెయ్యడం. మళ్ళీ ఇంకో ప్లేట్ తీస్కోవడం… మళ్ళీమళ్ళీ అదే తంతు. ఇంచుమించు ఫ్యామిలీ అందరూ అదే పద్దతిలో తమ తమ భోజనాలను ముగించారు.

bearer made wealthy person know his mistake

ఈ హొటల్ లో పనికి కుదిరినప్పట్నించి ఇప్పటి వరకూ ఇలాంటి కస్టమర్స్ ని హనుమంతు చూడలేదు. వాళ్ళు ఆహారపదార్ధాలను వృధా చేస్తున్న పద్దతి చూసి మనసులో కలతచెందాడు. కస్టమర్ తనకు కావలసింది ఆర్డర్ ఇస్తాడు. ఆర్డర్ ఇచ్చిన దానికి డబ్బులు కడతాడు. కాబట్టి వృధాలాంటి విషయాలలో కస్టమర్ ని ప్రశ్నించే హక్కు మనకు వుండదు – ఇది రెస్టారెంట్లో పనికి కుదిరిన మొదటిరోజు చెప్పిన రూల్. అందుకే ఏమీ అనలేక మౌనంగా తన పని తాను చేసుకుంటూ వెళ్ళాడు హనుమంతు. శ్రీమంతుడు బిల్ పే చేసిన తర్వాత పర్స్ లో వున్న కొన్ని కరెన్సీ నోట్లు తీసి మెనూ బుక్ లో పెట్టి లేచి వెళ్ళిపోయాడు. ఎంత టిప్పు ఇచ్చుంటాడో.. అని మిగిలిన బేరర్స్ అందరూ అనుకుంటుండగా, హనుమంతు మెనూ బుక్ లో వున్న డబ్బులు తీస్కుని బయటకు పరుగెత్తాడు.

శ్రీమంతుని కారు దగ్గరికి వచ్చిన హనుమంతుని చూసి… ఏంటయ్యా! టిప్ సరిపోలేదా? లేదు సార్! నాదొక చిన్న రిక్వెస్ట్ అన్నాడు హనుమంతు. చెప్పమన్నట్టుగా చూశాడు. టిప్ పేరుతో అతనిచ్చిన కరెన్సీ నోట్లకు మరికొన్ని నోట్లను జతచేసి ఇస్తూ.. మీరిచ్చిన డబ్బులకు నా నెల జీతం కూడా కలిపి మీకు ఇస్తాను సార్, మీరు తినకుండా వృధా చేసినంత ఆహారాన్ని ఎన్ని రోజుల్లో కష్టపడి పండించి తీసుకురాగలరో చెప్పండి అన్నాడు. ఊహించని ప్రశ్నకు శ్రీమంతుడు షాక్ అయ్యాడు. డబ్బులు అందరూ సంపాదిస్తారు సార్. కానీ సంపాదించేవాళ్ళందరి డబ్బూ కలిపినా ఒక్కడి ఆకలి తీరదు సార్. పంచభూతాలతో పోరాటం చేసి పుట్టిన మెతుకుని పచ్చనోట్లు చూస్కుని వృధా చెయ్యొద్దు సార్ చేతులు జోడించి అభ్యర్దించాడు. ఆ అభ్యర్ధనకు తన దగ్గర సమాధానం లేదని తెలుసుకుని సిగ్గుపడ్డాడు శ్రీమంతుడు. హనుమంతులో తన అజ్ణానాన్ని పోగొట్టడానికొచ్చిన అతిధి కనిపించాడతనికి.

Tags: bearerrestaurant
Previous Post

బ్ర‌హ్మ త‌ల‌రాత‌ను రాస్తే అది క‌చ్చితంగా జ‌రిగే తీరుతుంది.. ఈ క‌థే అందుకు ఉదాహ‌ర‌ణ‌..

Next Post

వ్యాపారికి క‌నువిప్పు క‌లిగించిన రుషి.. అందరూ దీన్ని గుర్తించాల్సిందే..

Related Posts

mythology

శ్రీ‌కృష్ణుడు ఎన్ని శాపాల‌ను ఎదుర్కొన్నాడో తెలుసా..?

July 24, 2025
వినోదం

విక్టరీ వెంకటేష్ ముగ్గురు కూతుళ్ల గురించి ఆసక్తికరమైన విషయాలు..!

July 24, 2025
ఆధ్యాత్మికం

శివ‌పార్వ‌తుల వివాహం జ‌రిగిన చోటు ఇప్పుడు ఎక్క‌డ ఉందో తెలుసా..?

July 24, 2025
హెల్త్ టిప్స్

మ‌ద్యం సేవించ‌డం మానేయ‌లేక‌పోతున్నారా..? ఇలా చేస్తే ఈజీగా మానేయ‌వ‌చ్చు..!

July 24, 2025
lifestyle

పెళ్ళిలో వధూవరులు తెల్లని వస్త్రాలే ఎందుకు ధరిస్తారో తెలుసా..? అసలు కారణం ఇదే..!

July 23, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

ఈ కాఫీని తాగితే ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉంటాయ‌ట‌..!

July 23, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
మొక్క‌లు

Gadida Gadapaku : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో.. చేల‌లో ల‌భించే మొక్క ఇది.. అస‌లు విడిచిపెట్ట‌వ‌ద్దు..!

by D
June 10, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.