నేనొక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ని, నాకు మంచిగానే జీతం వస్తుంది. నా జీతంతో నేను సంతృప్తిగా వున్నా. అలానే నేను ఓ బ్లాగ్ ని మైన్టైన్ చేస్తున్నా.. ఆ బ్లాగ్ మీద చాలా టైమ్ స్పెండ్ చేస్తున్నా, అదే టైమ్ నా వర్క్ కి సంబందించి పెడితే నాకు వచ్చే జీతం కంటే 50% ఎక్స్‌ట్రా వస్తుంది. కానీ ఆ టైమ్ ని ఈ బ్లాగ్ రన్ చెయ్యడానికి పెడుతున్నా.. ఈ బ్లాగ్ నుండి నెలకి నాకు ఓ 5 వేలు వస్తున్నాయి. అవి ఈ బ్లాగ్ మైన్టైన్ చెయ్యడానికి సరిపోతున్నాయి. ఆర్దికంగా చూస్తే ఇది ఏ విధంగాను సరైనది కాదు, కానీ మానసికంగా.. బ్లాగ్ కి సంబందించిన వర్క్ చేస్తున్నంత సేపు నాకు అలసట రాదు. కొంచెం రిఫ్రెష్ కూడా అనిపిస్తుంది. ఇందులో నుండి వస్తున్న ప్రతి రూపాయి నాకు ఆనందాన్ని ఇస్తుంది.
రోజు వచ్చే దాని కన్నా ఒక పది రూపాయలు ఎక్కువ వస్తే ఎందుకో చాలా ఆనందంగా అనిపిస్తుంది. నేను చేసే ప్రతి పనిని ఇష్టపడతా.. ఉద్యోగం పరంగా నా పనిని నేను ఎప్పుడు బలవంతంగా చెయ్యలేదు. అలానే ఈ బ్లాగ్ ని, దీనిని నేను పనిలా చూడటం లేదు. దీనిని చేస్తూ ఇష్టపడటం లేదు, ఇష్టంతో చేస్తున్నా.. ప్రతి ఒక్కరికీ వారి జీవితంలో ఏదో చెయ్యాలనుకుని కుదరక మరేదో చేస్తూ వుంటారు కదా.. అది ఫైన్.. అది అవసరం. అలా అని మనకు నచ్చినవి పూర్తిగా వదిలేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికీ సమయం వుంటుంది. కొన్ని వాటి నుండి మీకు డబ్బు రాకపోయినా ఆనందం అనిపిస్తే తప్పకుండా చెయ్యాలి.
ఇంకో విషయం, ఇక్కడ నాకు నెలకి 5 వేలు వస్తున్నాయి అంటే.. నేను కేవలం 5 వేలు సంపాదిస్తున్నట్టు కాదు, నెలకి 5 వేలు వచ్చే అంత ఒక ప్రాడక్ట్ ని నేను బిల్డ్ చేశాను అని అర్దం. మనం బ్యాంక్ లో ఎంత వేస్తే నెలకి 5 వేలు వస్తాయో తెలుసా.. దాదాపుగా 9 లక్షలు. అంటే దాని అర్దం నేను 9 లక్షల బ్రాండ్ ని బిల్డ్ చేశాను అని అర్దం. ఇలా అనుకున్నప్పుడు నాకు ఇంకొంత సంతృప్తిగా వుంటుంది.