Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home information

రైలులో ప్ర‌యాణం చేస్తున్నారా.. అయితే ఈ చిట్కాల‌ గురించి తెలుసుకోండి..!

Admin by Admin
May 7, 2025
in information, వార్త‌లు
Share on FacebookShare on Twitter

వీలయినంత వరకు మీ టికెట్ ముందుగానే బుక్ చేస్కోండి. ఆలస్య, అనిశ్చిత వీరులకు రైల్వే వారు తత్కాల్, ఏ సీ, సువిధ, డైనమిక్ ఫేర్, వేటింగ్ లిస్ట్ కాన్సిలేషన్, ఆందోళన మొదలైన అనేక బహుమతి వడ్డనలు ఎపుడూ సిధ్ధంగా వుంచుతారు. ఎక్కడయితే ప్రజా ప్రవాహం ఉంటుందో అక్కడ మోసాలు తీవ్రంగా, ఆశ్చర్యకరంగా, సృజనాత్మకంగా ఉంటాయి. ఎంత తక్కువ లగేజి వుంటే అంత సౌకర్యంగా వుంటుంది. అలాగని అవసరం అయినవి వదిలేయ‌కూడదు, ఇబ్బంది పడతాం. వీలైనంత వరకు ఒంటరిగా కాక, కనీసం ఇద్దరు లేక బృంద ప్రయాణం మేలు. వీలైనంత వరకు ఒక్క రూపాయి కూడా బయటకు తీసి ఏమీ కొనాల్సిన అవసరం రాకుండా చూస్కోండి. చాలా వరకు అధిక ధరలు, నాసి రకం క్వాలిటీ, మోసాలే.

ప్రయాణం నాలుగు గంటల లోపయితే, మంచినీళ్ళు, 4-6 లోపయితే కాసిని స్నాక్స్, ఒక రోజు లోపయితే భోజనం ఏర్పాట్లు ఇంటి నుంచే చేస్కుని వెళ్ళడం అత్యుత్తమం. అంతకు మించయితే ఇక తప్పదేమో- అపుడు ప్లాట్ఫారం ల మీద కాకుండా పాంట్రీ కార్ లో నే కొనండి- ఏదయినా సమస్య అయితే కంప్లయింట్ చేయడం తేలిక. పిల్లలతో ప్రయాణిస్తుంటే చాలా సూచనలు మారిపోతాయి. వారి ప్రపంచం కొంత తరలించాల్సి రావచ్చు. ఎనిమిది నుంచి 14 గంటల ప్రయాణం అయితే, రాత్రి ట్రయిన్ ఎంచుకోవడం మంచిది- ఎక్కువ అవసరాలు లేకుండా నిద్ర లో ప్రయాణం గడిచిపోతుంది. మీరు మందులు ఏమన్నా వాడుతుంటే అవి సరిపడా తప్పకుండా ముందే సర్ది ఉంచుకోండి. 6 గం కు మించి ప్రయాణం అయితే ఒక వార్త పత్రిక, ఒక దుప్పటి ఉంచుకోండి.

if you are on train journey follow these smart hacks

ఇక పూర్తి చార్జింగ్ లో ఉన్న ఫోను, పవర్ బాంక్, తగినంత డబ్బు, ఐ డి కార్డు తప్పనిసరి. దారిలో చదువుకోడానికి ఒక మంచి పుస్తకం ఉంటే అపరిచితులతో మాట కలిపి చిక్కుల్లో పడే బాధ తప్పుతుంది. ఈ రోజుల్లో ఎవరినీ నమ్మలేము మరి. ప్రస్తుత పరిస్థితి లో మాస్క్, సానిటైజెర్ తప్పనిసరి. ఎవరు ఎంత మంచిగ తినడానికి లేక త్రాగటానికి ఏమిచ్చినా తీస్కోకండి. మొహమాటం అసలు వద్దు. మరీ బలవంతం చేస్తే, బాగ్ లో పెట్టుకుని, ఇంటికెళ్ళి తింటాననొ, లేక ఈ రోజు మీరు ఉపవాసమనో చెప్పేయండి. వేర్ ఇస్ మై ట్రయిన్ అనే ఆప్ డౌన్లోడ్ చేస్కోండి. ఇది ప్రయాణం ముందు నుంచి, పూర్తయేవరకు, మీ ట్రయిన్ ఎక్కడ వుంది అనేది, అది వెళ్ళే దారి, దాటిన, రాబోయే స్టేషన్లు, సరి సమయమా, లేటా మొదలగు అనేక విషయాలు తెలియజేస్తుంటుంది.

దక్షిణ భారతం అయితే తమిళం, ఉత్తర భారతమయితే హిందీ భాషలు తెలిసి ఉంటే మంచి సౌకర్యం గా ఉంటుంది. మీ ట్రయిన్ ప్రయాణంలో భద్రత లేక అత్యవసర వైద్య సహాయ విషయమై ఎటువంటి సమస్య లేక అనుమానం ఎదురయినా, 139 కు కాల్ చెయండి. చేసినాక IVRS లో 1 నొక్కండి. ట్విట్టర్ లోనూ రైల్వే వారికి సంప్రదించవచ్చు. కాని ఏమి చెప్పాలన్నా, మీ వివరాలు ఫలానా బోగీ, నంబర్ వగయిరా చెప్పకుండా, PNR నంబర్ చెప్పండి. వారికదే ప్రామాణికం. ఆ నంబర్ అందుబాటులో ఉంచుకోండి. మీరెన్ని చెప్పినా, వారు PNR నంబర్ ఎంత అనే అడుగుతారు. అదొక్కటి చాలు.

Tags: train journey
Previous Post

అంత్యక్రియల సమయంలో కుండలో నీళ్లు పోసి రంధ్రం ఎందుకు పెడతారో తెలుసా..?

Next Post

ఈ సారి టీ చేసేట‌ప్పుడు ….ఇలా చేయండి, ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు చెక్ చెప్పండి.!

Related Posts

ఆధ్యాత్మికం

ఒకే గోత్రం ఉన్న‌వారు పెళ్లి చేసుకోకూడ‌దా..? వివాహం అయితే పిల్ల‌లు పుట్టరా..?

July 23, 2025
వైద్య విజ్ఞానం

దంతాలు, చిగుళ్లు, నోరు ఆరోగ్యంగా లేక‌పోతే గుండె జ‌బ్బులు వ‌స్తాయా..?

July 23, 2025
ఆధ్యాత్మికం

ప‌సికందుల క‌ణ‌త‌ల‌కు న‌ల్లని చుక్క ఎందుకు పెడ‌తారో తెలుసా..?

July 23, 2025
హెల్త్ టిప్స్

అంద‌మైన వ‌క్ష సంప‌ద కావాలంటే.. అమ్మాయిలు ఈ చిట్కాల‌ను పాటించాలి..!

July 23, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

రోజూ గంట‌ల త‌ర‌బ‌డి కూర్చుని ప‌నిచేస్తున్నారా..? అయితే ఇది చ‌దవండి..!

July 23, 2025
ఆధ్యాత్మికం

ఈ రాశులు ఉన్న‌వారు రెండు స్వ‌భావాల‌ను క‌లిగి ఉంటార‌ట‌..!

July 23, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.