పాకిస్థాన్‌తో 3-4 రోజులు మాత్రమే యుద్ధం జరిగినప్పటికీ భారత్ సత్తా ఏమిటో ఈ యుద్ధం ద్వారా పాకిస్థాన్‌కు మాత్రమే కాదు, ప్రపంచానికి కూడా తెలిసింది. భారత్‌తో పెట్టుకుంటే ఏం జరుగుతుందో ఇరుగు పొరుగున ఉన్న దేశాలకు ఇప్పుడు పూర్తిగా తెలిసింది. ఈ క్రమంలోనే భారత్ అమ్ముల పొదిలో ఉన్న అస్త్ర శస్త్రాల గురించి కూడా ప్రపంచానికి అర్థమైంది. దీంతో అందరి చూపు ఇప్పుడు భారత్‌పై పడింది. ముఖ్యంగా పాక్‌ను తుత్తునియలు చేసిన మన బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలు చేసేందుకు ప్రపంచ దేశాలు ఆసక్తిని చూపిస్తున్నాయి. మరో వైపు రష్యాకు చెందిన ఎస్400 పనితనం గురించి కూడా తెలిసింది కనుక ఆ పరికరాలపై ఆ దేశానికి కూడా ఆర్డర్లు పెరుగుతున్నాయి. భారత్ – పాక్ యుద్ధం రష్యాకు కూడా మేలు చేసిందని చెప్పవచ్చు.
అయితే ఇప్పుడు అంతా బ్రహ్మోస్ మిస్సైల్ గురించి, S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గురించి చెప్పుకుంటున్నారు. ఒక్కొక్క విషయం చిన్నగా బయటికి వస్తున్నాయి. భారత్ ప్రయోగించిన బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణులు ఖచ్చితత్వంతో గురి తప్పకుండా టార్గెట్ ని ధ్వంసం చేశాయి. బ్రహ్మోస్ క్షిపణిని డెవలప్ చేసిన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు వాస్తవ పరిస్థితుల్లో ఈ క్షిపణి పనితనాన్ని చూసి సంతృప్తి చెందుతున్నారు. జీవితం ధన్యమైనదని, జన్మ భూమికి ఈ విధంగా సేవ చేయడం ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలో ఇలాంటి సూపర్ సోనిక్ క్షిపణి కలిగి ఉన్న దేశం భారత్, మరొక దేశం రష్యా మాత్రమే.
ఈ క్రూయిజ్ మిస్సైల్ పారామీటర్స్ అద్భుతం. అత్యంత శక్తిమంతమైన ఖరీదైన ఈ క్షిపణి సౌండ్ కంటే వేగంగా వెళ్లటమే కాకుండా శత్రు దేశ రాడార్లు గుర్తించి స్పందించే లోపే టార్గెట్ ని ధ్వంసం చేస్తాయి. బహుశా ఇది పాకిస్తాన్‌ని బాగా నాశనం చేసిందని అంటున్నారు. తట్టుకోలేని పాక్ FATEH-II బాలిస్టిక్ మిస్సైల్ ని ఢిల్లీపై ప్రయోగించింది. దాన్ని విజయవంతగా భారత్ ADS కూల్చేసింది. ఎస్-400 అద్భుత ఫలితాలను ప్రపంచం చూసింది. కాకతాళీయంగా బ్రహ్మోస్ తయారీ పరిశ్రమను లక్నోలో (టెస్టింగ్ యూనిట్) ని రాజ్ నాథ్ సింగ్ ప్రారంభించారు. బ్రహ్మోస్ మిస్సైల్ మాత్రమే కాదు ఒక సందేశం అని రాజ్ నాథ్ వ్యాఖ్యానించగా, బ్రహ్మోస్ సామర్ద్యం పాక్ కి బాగా తెలుసు అని యూపీ సీఎం యోగి అన్నారు.