జాబ్ చేయాలనుకునే ప్రతి వ్యక్తి ఏదో ఒక సబ్జెక్టు ఎంచుకుని అందులో విద్య పూర్తి చేసి దానికి తగ్గ కెరీర్‌ను ఎంచుకోవడం సహజమైన విషయమే. ఈ క్రమంలోనే ఎన్నో రకాల కోర్సులు, కెరీర్‌లు యువతీ యువకులకు నేడు అందుబాటులో ఉన్నాయి. అయితే ఎన్ని కెరీర్స్ ఉన్నా వాటిలో కొన్ని మాత్రం ఎప్పటికీ హాట్ ఫేవరెటే. అంతేకాదు, ఆయా కెరీర్స్ కు మరో 20 ఏళ్లలో ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుందట. అవును, మేం చెబుతోంది నిజమే. ఓ సంస్థ చేసిన సర్వేలో వెల్లడైన నిజమిది. ఇంతకీ ఆ కెరీర్స్ ఏంటో ఓ లుక్కేద్దామా. స్కూల్స్, కాలేజీ… ఏవైనా టీచర్లు, లెక్చరర్లుగా స్థిరపడాలనుకునే వారికి మాత్రం మరో 20 ఏళ్లలో మంచి ఫ్యూచర్ ఉంటుందట. రానున్న 20 ఏళ్లలో వారికి మంచి డిమాండ్ ఏర్పడుతుందట. జనాభా పెరుగుతున్న కారణంగా వారి విద్యావసరాలకు తగినట్టుగా టీచర్లు, లెక్చరర్ల కొరత భారీగా ఉంటుందని తెలిసింది. అందుకే ఆ రంగంపై దృష్టి పెడితే బెటర్.
కన్‌స్ట్రక్షన్ ఎస్టిమేటర్, ఎన్విరాన్‌మెంట్ హెల్త్ స్పెషలిస్ట్… ఈ రెండు రంగాల్లో రాబోయే 20 ఏళ్ల కాలంలో భారీగా ఉద్యోగాలు ఉంటాయట. ప్రధానంగా అమెరికాలో వీరి అవసరం ఎక్కువగా ఉంటుందట. హెల్త్‌కేర్, మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్స్… వ్యాపార, వాణిజ్య రంగాల్లో రాబోయే సంవత్సరాల్లో చోటు చేసుకోనున్న మార్పుల కారణంగా ఈ రెండు కెరీర్స్‌ను ఎంచుకునే వారికి కూడా భారీగానే డిమాండ్ ఉండబోతున్నదట. ఇంజినీరింగ్… సివిల్, ఎన్విరాన్‌మెంటల్, ప్రాజెక్ట్, బయో మెడికల్, స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ చదివే వారికి రానున్న కాలంలో భారీగా డిమాండ్ ఉంటుందట. ఆయా రంగాల్లో కుప్పలు కుప్పలుగా అవకాశాలు ఏర్పడుతాయట. ఫైనాన్షియల్ సేవలు… అకౌంటెంట్లు, ఫైనాన్షియల్ అడ్వయిజర్లు, ఆక్చువరీలకు రాబోయే కాలంలో విపరీతమైన డిమాండ్ ఏర్పడుతుందట. చాలా కంపెనీలు ఈ సేవలు చేసే పెట్టే వారి కోసం ఆకర్షణీయమైన వేతనాలను ఇచ్చేందుకు రెడీ అయ్యే అవకాశం ఉంటుందట.
మెడికల్… ఫిజిషియన్ అసిస్టెంట్లు, డాక్టర్లు, నర్సులు, అనస్థిటిస్ట్స్ లకు రానున్న సంవత్సరాల్లో ఇంకా డిమాండ్ ఉంటుందట. ఈ కోర్సులు చేసే వారికి పుష్కలంగా అవకాశాలు ఏర్పడుతాయి. సేల్స్… సేల్స్ ఎగ్జిక్యూటివ్, సేల్స్ డైరెక్టర్, సీనియర్ సేల్స్ ప్రొఫెషనల్ కెరీర్‌లను ఎంచుకునే వారికి కూడా మంచి డిమాండ్ ఏర్పడుతుంది. వారికి పుష్కలంగా అవకాశాలు ఉంటాయి. టెక్నికల్ జాబ్స్… ఫిజికల్ థెరపిస్టులు, అసిస్టెంట్స్, డెంటల్ హైజీనిస్ట్స్, వెటర్నరీ టెక్నిషియన్లకు కూడా మంచి డిమాండే ఉంటుందట. ఆయా కెరీర్‌లను ఎంచుకునే వారికి ఉద్యోగావకాశాలు బాగుంటాయి. ఐటీ… చివరిగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈ రంగంలోనూ రాబోయే రోజుల్లో చోటు చేసుకోనున్న అనూహ్యమైన మార్పుల కారణంగా ఉద్యోగావకాశాలు ఎక్కువగా లభిస్తాయట.