Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home international

B2 బాంబ‌ర్ల‌తో ఇరాన్‌లోని న్యూక్లియ‌ర్ కేంద్రాల‌పై అమెరికా ఎలా దాడి చేసింది అంటే..?

Admin by Admin
June 24, 2025
in international, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఆయుతోల్లా అలీ ఖోమైని శకం ముగిసిపోయినట్లే! ఇరాన్ అణు స్థావరాల మీద అమెరికా దాడి చేసి ధ్వంసం చేసింది. అమెరికాలోని గువామ్ ఎయిర్ బేస్ నుండి బయలుదేరిన 6 B2 స్పిరిట్ బాంబర్లు 36 గంటలపాటు ఏకబిగిన ప్రయాణం చేసి ఇరాన్ గగనతలం లోకి ప్రవేశించి మూడు ఇరాన్ కి చెందిన యూరేనియం శుద్ధి చేసే కర్మాగారాల మీద దాడి చేసి వాటిని ధ్వంసం చేసి సురక్షితంగా వెనక్కి వెళ్లిపోయాయి B2 బాంబర్లు! B2 బాంబర్లు దాడిచేసిన అణు శుద్ధి కర్మాగారాలు ఇవి: ఫారదౌ ( Fordow), నటంజ్ ( Natanz ), ఇస్ఫా హాన్ ( Esfahan). ఇరాన్ యూరేనియం శుద్ధి చేస్తున్నది అణు విద్యుత్ కోసమే అని చెప్తూ వస్తున్నా అది కేవలం అణు బాంబు తయారీ కోసమే అని ప్రపంచానికి తెలుసు! యురేనియం శుద్ధి చేసేది పౌర అవసరాలకి అయితే ప్రస్తుతం ఇరాన్ చేస్తున్నది అబద్ధమన్నది తెలిసిపోతుంది! ఒక సారి యురేనియం శుద్ధి చేసే విధానాలు వాటి ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాం…..

విద్యుత్ ఉత్పత్తి కోసం వాడే అణు రియాక్టర్ల కోసం యురేనియం ని 3-5% ల మధ్య ( 3-5% U 235 Isotope) శుద్ధి చేస్తే చాలు. ఈ స్థాయిలో శుద్ధి చేస్తే ( enrichment) న్యూక్లియర్ ఫిషన్ రియాక్షన్ ని కంట్రోల్ చేస్తూ వేడి పుట్టించి ( controlled Nuclear Fission) విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. అణు బాంబు గ్రేడ్ యురేనియం – Weapons Grade Uranium. అణు బాంబు తయారు చేయడానికి యురేనియం ని 90% ( U 238 ) శుద్ధి చేయాల్సి ఉంటుంది. ఈ యురేనియం ని విద్యుత్ ఉత్పదన కోసం వాడలేరు. తేడా గమనించారా? U 235 ని విద్యుత్ ఉత్పదన కోసం వాడితే U 238 ని అణు బాంబుల కోసం వాడతారు. ఇరాన్ మీద దాడి జరిగే సమయానికి 90% శుద్ధి చేసిన యురేనియం ని తయారు చేసింది! జస్ట్ శుద్ధి చేసిన యురేనియం ని అణు బాంబు కోసం తరలించడానికి సిద్ధంగా ఉన్న సమయంలోనే అమెరికా దాడి చేసింది! నిజానికి ఇరాన్ యురేనియం శుద్ధి చేస్తున్నది అని తెలిసినా ఇన్నాళ్ళు ఊరికే చూస్తూ కూర్చుని ఈ రోజు చివరి క్షణంలో దాడి చేయడం అమెరికా ఆత్మ రక్షణ చర్య అనే చెప్పాల్సిన అవసరం ఉంది!

how america destroyed irans nuclear sites

ఇజ్రాయేల్ దాడి చేస్తే అది ఇరాన్, ఇజ్రాయేల్ దేశాల మధ్య జరుగుతున్న ఘర్షణ గా ప్రపంచం చూస్తుంది అని అమెరికన్ మేధావుల ఆలోచన! కానీ ఏదో ఒక రోజున దాడి చేయకతప్పదని తెలిసీ ఉదాసీనంగా ఉండడం అమెరికా చేసిన, చేస్తున్న వ్యూహత్మక తప్పిదం ఇది! ఇరాన్ U 235 యురేనియం కోసం ప్రయత్నిస్తున్నా లేదా U 238 వెపన్ గ్రేడ్ యురేనియం కోసం ప్రయత్నిస్తున్నా వంకలు చూపకుండా ముందే దాడి చేసిఉంటే ఇంత దూరం వచ్చి ఉండేది కాదు! పాకిస్థాన్ అణు అస్త్రాలు కలిగిన దేశమే అయినా మోడీజీ నేరుగా దాడి చేశారు కానీ ఇరాన్ ఇప్పటికే అణు బాంబు తయారు చేసుకొని ఉండవచ్చు అనే భయం తోనే ఇన్నాళ్ళు తాత్సరం చేసింది అమెరికా! ఇక్కడ సరైన ఇంటెలిజెన్స్ ఇన్పుట్ అనేది కీలక అంశం గా చెప్పుకోవాలి! పేరు గొప్ప CIA ఏం చేస్తున్నట్లు? RAW చేయగలగింది CIA ఎందుకు చేయలేకపోయింది? మరి ఇజ్రాయేల్ ఎందుకు దాడి చేయలేక పోయింది?

ఇజ్రాయేల్ వారం క్రితమే అంటే జూన్ 16 న దాడులు చేసింది కానీ మూడు అణు కేంద్రాలు కూడా పర్వతపాదాల వద్ద చాలా లోతుగా నిర్మించింది ఇరాన్! ఇరాన్ కి తెలుసు ఇజ్రాయేల్ దగ్గర బంకర్ బస్టర్ బాంబులు ఉన్నాయని అవి రీ ఎన్ఫోర్స్డ్ కాంక్రీట్ ని కూడా తొలుచుకుంటూ వెళ్లి ధ్వంసం చేయగలవు అని! దాంతో పర్వతపాదాల వద్ద లోపలికి మూడు అంచెలుగా అణు రియాక్టర్ల ని నిర్మించింది ఇరాన్! జూన్ 16 న ఇజ్రాయేల్ చేసిన దాడిలో మొదటి అంతస్థు మాత్రమే ధ్వంసం అయింది. మిగతా రెండు అంతస్థుల ని తొలుచుకుంటూ వెళ్లగలిగిన బాంబులు ఇజ్రాయేల్ దగ్గర లేవు, ఒకవేళ అమెరికా ఇచ్చినా వాటిని మోసుకెళ్లి వదలగలిగిన బాంబర్లు ఇజ్రాయేల్ దగ్గర లేవు! 80 మీటర్లు లోతుకి వెళ్లి దాడి చేయాలి అంటే చాలా బరువైన బంకర్ బస్టర్ బాంబు కావాలి అది…. GBU -57 MOP బాంబ్! GBU – 57 MOP అంటే మాసీవ్ ఆర్డినేన్స్ పెనిట్రేటర్ ( MASSIVE ORDINANCE PENETRATOR ). ప్రపంచంలో ఏ దేశంలో లో కూడా GBU 57 MOP బాంబు లేదు.

GBU-57 MOP ప్రత్యేకతలు…. GBU 57 బాంబు బరువు 14 టన్నులు ఉంటుంది. GBU 57 GPS ఆధారంగా గట్టిగా ఉండే భూమి లేదా పర్వతాలు, కొండలు లోపలికి 80 మీటర్ల లోతుకి చొచ్చుకువెళ్లి దాడి చేస్తుంది. GBU -57 బాంబు 80 మీటర్ల లోతుకి వెళ్లిన తరువాత ఆగిపోయి అప్పుడు దానిలో ఉండే పేలుడు పదార్ధం పేలిపోయేట్లుగా డిజైన్ చేశారు. దీనిని delayed action fuse అంటారు. అంటే బాంబు భూమి లేదా కాంక్రీట్ ని తోలుచుకుంటూ వెళ్ళిపోయి ఆగిన కొద్దిసేపటి తరువాత పేలిపోయి భూగర్భంలో ఉండే టార్గెట్ ని ధ్వంసం చేస్తుంది. So! ఇజ్రాయేల్ జూన్ 16 న ఇరాన్ అణు కేంద్రాల మీద దాడి చేసిన తరువాత సాటిలైట్ ఇమేజెస్ ని పరిశీలించి తమ దాడిలో అణు కేంద్రాలు పూర్తిగా నాశనం అవలేదని ఇంకా ఆక్టివిటీస్ జరుగుతూనే ఉన్నాయని నిర్ధారణకి వచ్చి GBU 57 తో దాడి చేయమని అమెరికాని అడిగింది! ఇజ్రాయేల్ అభ్యర్ధన అనేది కొద్ది గంటలలోనే అంటే జూన్ 17 న దాడి చేస్తేనే ప్రయోజనం ఉంటుందని ట్రంప్ ని అడగడం జరిగింది కానీ ట్రంప్ మీన మేషాలు లెక్కిస్తూ చివరికి దాడి చేశాడు!

ఆయుధాల విషయంలో గొప్యత ఎందుకు అవసరమో GBU – 57 MOP బాంబు ఉదంతం ఒక ఉదాహరణ! GBU – 57 MOP గురుంచి బయటి ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ. ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ కి కూడా నూరు శాతం వివరాలు తెలియవు. బిన్ లాడెన్ – కొండ గుహ – GBU 57 MOP! బిన్ లాడెన్ ఆఫ్ఘానిస్థాన్ లోని ఎడారి ప్రాంతంలో ఒక కొండ గుహలో ఉన్నాడని ఇంటెలిజెన్స్ సమాచారం రాగానే అప్పటికప్పుడు ఆఫ్ఘానిస్తాన్ లో ఉన్న అమెరికన్ సైనిక వ్యూహకర్తలు, పెంటగాన్ లో ఉన్న వ్యూహకర్తలు లాడెన్ ని చంపెందుకు రకరకాల ప్లాన్స్ వేసినా చివరికి అంత సమయం లేదని బంకర్ బస్టర్ బాంబుతో కొండ ని పేల్చేయాలని నిర్ణయించుకొని వెంటనే అప్పటికే ఖతార్ లో ఉన్న B2 స్పిరిట్ బాంబర్ లో GBU-57 బాంబుని లోడ్ చేసి ఆఫ్ఘానిస్తాన్ లో లాడెన్ ఉన్న కొండ గుహని పేల్చేసారు! ఈ మొత్తం ఆపరేషన్ ని వీడియో తీశారు అప్పట్లో! GBU 57 తో దాడి చేసిన తరువాత చూస్తే అప్పటికే లాడెన్ అక్కడినుండి వెళ్లిపోయాడని తెలిసింది!

కానీ GBU – 57 MOP లాడెన్ ఉన్న గుహని ఎంత తీవ్రంగా నష్టపరచగలిగిందో రీసెర్చ్ కి ఉపయోగపడింది కానీ వాటి వివరాలు బయటికి రాలేదు! అంతిమంగా 2015 లో తాజాగా ప్రయోగించిన GBU-57 MOP బాంబుని అభివృద్ధి చేసి స్టోర్ చేసింది అమెరికా! 2015 తరువాత కొత్తగా ఏవీ తయారుచేయలేదు! GBU-57 MOP బోయింగ్ సంస్థ తయారు చేసింది! ఆఫ్ఘానిస్తాన్ కొండ గుహ అనుభవంతో బోయింగ్ కొత్త వర్షన్ GBU-57 MOP ని అభివృద్ధి చేసింది. వార్ హెడ్ ని హై పెర్ఫామేన్స్ స్టీల్ అలాయ్ తో తయారు చేయడం వలన 200 అడుగుల రీ ఎన్ఫోర్సడ్ స్టీల్ కాంక్రీట్ ని కూడా సునాయాసంగా చీల్చుకుంటూ వెళ్లి ధ్వంసం చేసింది. ఇరాన్ భూగర్భ అణు కేంద్రాన్ని నిర్మించినపుడు అమెరికా దగ్గర ఉన్న GBU-57 MOP బాంబు మహా అయితే 150 అడుగులు లోతుకు వెళ్ళగలదని అంచనా వేసి భూమి లోపల 200 అడుగుల మందంతో కాంక్రీట్ వేసింది కానీ ఇరాన్ అంచనాకి అందని విధంగా ఇజ్రాయేల్ అమెరికాలు ఒక ప్లానింగ్ తో వెళ్లాయి.

జూన్ 16 న ఇజ్రాయేల్ చేసిన దాడిలో 100 అడుగుల కాంక్రీట్ మాత్రమే ధ్వంసం అవగా మిగిలిన 100 అడుగుల కాంక్రీట్ ని GBU – 57 MOP లు కూల్చేసాయి. మొత్తం 6 B2 స్పిరిట్ బాంబర్లు ఒక్కోటి రెండు GBU-57 MOP లని తమతో తీసుకొని దాడికి వచ్చాయి. అంటే మొత్తం 12 GBU-57 MOP లతో దాడికి వచ్చాయి. మొత్తం 36 గంటలు ప్రయాణించి రెండు సార్లు గాల్లోనే ఇంధనం నింపుకొన్నాయి అన్నమాట! రెండో సారి ఇరాన్ గగనతలంలోనే ఇజ్రాయేల్ ట్యాంకర్ లు B2 స్పిరిట్ లకి ఇంధనం నింపాయి. అప్పటికే ఇజ్రాయేల్ ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ ని ధ్వంసం చేయడం వలన స్వేచ్ఛగా అమెరికన్, ఇజ్రాయల్ జెట్ ఫైటర్స్, ఇంధనం అందించే టాంకర్ లు మరియు గగనతలం లో ఉంటూ నిఘా పెట్టే అవాక్స్ విమానాలు తిరగగాలిగాయి! మొత్తం 6 B2 స్పిరిట్ బాంబర్లు 12 GBU-57 MOP బంకర్ బస్టర్ బాంబులని FORDOW అణు కేంద్రం మీద ఒక దాని తరువాత ఇంకోటిగా వేసాయి.

అదే సమయంలో అమెరికన్ సబ్ మేరైన్ లు మొత్తం 30 టోమ్ హాక్ క్రూయిజ్ మిస్సళ్ళ తో NATANZ, ఇ స్పహాన్ అణు కేంద్రాల మీద ఏక కాలంలో దాడులు చేసి ధ్వంసం చేశాయి. ఈ మొత్తం ప్రక్రియని సంవత్సరం ముందే అమెరికా, ఇజ్రాయేల్ లు కలిసి రిహార్సల్స్ చేశాయి. ఫోర్ దౌవ్ (FORDOW )అణు కేంద్రం మీదనే 12 GBU-57 MOP లని ఎందుకు ప్రయోగించారు? QUOM దగ్గర పర్వతపాదాల దగ్గర రాయిని తొలిచి రెండు వందల మీటర్ల లోతులో FORDOW అణు కేంద్రం నిర్ముంచింది ఇరాన్. FORDOW అణు కేంద్రం 2006 లో మొదలు పెట్టి 2012 లో పూర్తి చేసి ఆపరేషన్ లోకి తెచ్చింది ఇరాన్!ఈ అణు కేంద్రమే అత్యంత పటిష్టమైన భద్రత కలిగి ఉంది కాబట్టి 12 GBU-57 MOP లతో ధ్వంసం చేశారు. 2012 లో ఈ అణు కేంద్రం ప్రారంభం అయ్యే నాటికి అయిన ఖర్చు $1.2 బిలియన్ డాలర్లు, 6 సంవత్సరాల కష్టం!

2006 నుండి 2012 వరకూ ఒబామా అమెరికా అధ్యక్షుడుగా ఉన్నాడు. ఇరాన్ అణు కార్యక్రమం కి ముగింపు పలికి ఇజ్రాయేల్ ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో అమెరికా కూడా భాగస్వామి అయ్యింది 1978 తరువాత మొదటిసారిగా! అఫ్కోర్స్! భూగర్భ బంకర్ లో భయంతో తలదాచుకున్న ఆయుతొల్లా అలీ ఖోమేని తన తరువాతి వారసుడు ఎవరు అన్నది ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి తన ముఖ్య అనుచరుల చేతికి ఇచ్చినట్లుగా తెలుస్తున్నది! ఆ లిస్టులో ఖోమేని కొడుకు పేరు లేదు! ఇది చాలు ఇరాన్ ని ఇకముందు ఎవరూ నాశనం చేయనక్కరలేకుండా ఇరాక్ లాగా అంతర్యుద్ధం తో తనంత తానే నాశనం అవుతుంది! 400 బాలిస్టిక్ మీసైళ్ళ ని ఇజ్రాయేల్ మీదకి ప్రయోగించబోతున్నది ఇరాన్! మరో వైపు అంతర్జాతీయ అణు శక్తి సంఘం ( International atomic Energy Agency – IAEA) తెలుపుతున్న ప్రకారం ఇరాన్ దాడికి ముందే 83.7% శుద్ధి చేసిన యురేనియం ని సురక్షితమైన ప్రాంతాలకి తరలంచింది అని ప్రకటించింది. ఇరాన్ ఈ వార్తని ధ్రువీకరించింది. కాబట్టి ఇప్పటికిప్పుడు ఏమీ అయిపోలేదు! 83.7% ఎన్ రిచిడ్ యురేనియం తో డర్టీ బాంబు తయారు చేసి బాలిస్టిక్ మీసైళ్ళ ద్వారా ప్రయోగించే అవకాశం ఉంది. అణు బాంబు తయారు చేయాలంటే 90% శుద్ధి చేసిన యురేనియం కావాలి! ఇప్ప‌టి నుండి ఆయుతోల్లా అలీ ఖోమైని ని వెతికి చంపేసే పనిలో మోస్సాద్ ఉండవచ్చు!

— పార్థసారథి పొట్లూరి.

Tags: americab2 bombersiran
Previous Post

పాములకు పాలు, స్వీట్లు జీర్ణం కానప్పటికీ నాగుల చవితి సమయంలో పుట్టలలో పాలు, తీపి పదార్ధాలను ఎందుకు పోస్తారు?

Next Post

వాకింగ్ ఇలా చేస్తే.. గుండె ఆరోగ్యంగా ఉంటుంది..!

Related Posts

వినోదం

సీనియర్ ఎన్టీఆర్ నుండి పవన్ కళ్యాణ్ వరకు రెండు పెళ్లిళ్లు చేసుకున్న నటులు ..!!

July 22, 2025
హెల్త్ టిప్స్

రోడ్లపై పునుగులు, బోండాలు, మంచూరియా, తింటున్నారా..అయితే నష్టాలు తప్పవు..!

July 22, 2025
ఆధ్యాత్మికం

స్త్రీలు సాష్టాంగ న‌మ‌స్కారం ఎందుకు చేయ‌కూడ‌దు..? దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటి..?

July 22, 2025
హెల్త్ టిప్స్

పాప్‌కార్న్‌ను అధికంగా తింటున్నారా..? అయితే ముందు ఈ విష‌యాల‌ను తెలుసుకోండి..!

July 22, 2025
inspiration

మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ వాడే ఫోన్ ఏంటో తెలుసా..? ఆపిల్ iPhone వాడకపోవటానికి కారణం ఇదే..!

July 22, 2025
హెల్త్ టిప్స్

రోజూ భోజ‌నంలో పెరుగును త‌ప్ప‌నిస‌రిగా తినాల్సిందే.. ఎందుకంటే..?

July 22, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.