Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home politics

పెద్ద ఎన్టీఆర్ గురించి మీకు తెలిసిన కొన్ని చీకటి కోణాల గురించి చెప్పండి?

Admin by Admin
June 26, 2025
in politics, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ.. అనేది ఇంగ్లీష్ లో ప్రసిద్ధి చెందిన నానుడి. ఆరోపించినంత మాత్రాన ఏ మనిషికి కళంకం అంటదు. న్యాయస్థానంలో నేరం నిరూపించబడాలి. నిరూపించనంతవరకు ఏ వ్యక్తి అయినా నిర్దోషే. నాకు తెలిసినంతవరకూ అలా నిరూపించబడినవి ఒక్కటి కూడా సీనియర్ ఎన్టీయార్ విషయంలో లేదు. అవినీతి, అక్రమ సంపాదన, కుటుంబ పరిపాలన, క్విడ్ ప్రో కో వంటివి కానరాలేదు. నమ్మినవారిని ప్రక్కన ఉంచుకోవడం ప్రతీ ఒక్కరూ చేసేదే అయినా అల్లుళ్లు అయినప్పటికీ దగ్గుబాటి, నారా చంద్రబాబులను ఉన్నత స్థానాల్లో ఉంచలేదు. ఏదో ఓ విధంగా మినిస్ట్రీ అంటగట్టేయలేదు. న్యాయబద్ధంగా వారు ఎలెక్షన్లలో గెలిచినవారే. ఎన్టీయార్ కి బంధువులు కాదు, ఆయన దృష్టిలో కేవలం నమ్మకస్తులు. అలాగే, కొడుకులను పదవుల్లో కూర్చోబెట్టలేదు. సినిమా హీరోగా ఉన్న బాలకృష్ణ విషయంలో రికమెండేషన్లు చేయలేదు. తాను క్రమశిక్షణతో ఉండేవాడు, క్రమశిక్షణ తన పిల్లల్లో ఉండేలా చూసుకున్నాడు. ఆ క్రమశిక్షణే బాలకృష్ణను కష్టపడేలా చేసింది, అందలం ఎక్కించింది.

ఒకరిని మోసం చేసి గద్దెనెక్కే పని చేయలేదు. ఒక పార్టీ నుండి మరో పార్టీకి జంప్ చేయలేదు. పదవి కోసం నానాగడ్డీ కరవలేదు. ఏది చేసిన ఒంటరిగా చేశాడు. ఒక్కో మెట్టు ఎక్కాడు. తనకంటూ ఎదురే లేదని నిరూపించాడు. అర్థంలేని అవాకులు చెవాకులు పేలుతూ మీడియా వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేయలేదు. ఆవేశంతో రంకెలు వేస్తూ కనబడలేదు. ఆరోపణల మాటేమిటి? నిందలు ఉంటే ఉండొచ్చు గాక. గాంధీలో, మదర్ థెరిసాలలోనూ లోపాలు వెతకడం లేదూ? అంతటి మహనీయులపైనే నిందలు లేవూ? కృష్ణ కుమారి అనే హీరోయిన్ తో ప్రేమలో పడ్డాడని, అంత గొప్ప క్యారెక్టర్ ఏమీ కాదని, తెలుగుదేశం పార్టీ వారే ప్రచారం చేయబూనారు. ఆధారాలెక్కడ? అప్పటి ప్రముఖ రౌడీ షీటర్, తర్వాతి కాలంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన వంగవీటి మోహన్ రంగా హత్య వెనక ఆయన హస్తం ఉందని జనాల్లో గుసగుసలు మొదలయ్యాయి. ఆధారాల మాటేమిటి? ఆ కేసులో నిందితుడు కూడా కాడాయన. సహనటులలో కొందరి పట్ల, ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ పట్ల అసూయతో వ్యవహరించి ఉండొచ్చు గాక. ఇద్దరు ఆల్ఫాల మధ్య పోరాటం సామాన్యంగా ఉండదు. పరిపక్వత వచ్చేదాకా అసూయ వదిలిపోదు. తనకు అనుకూలంగా ఉన్నవారికి, తనని అభిమానించేవారికి చేయూతనూ ఇచ్చాడు.

what are some real truths about sr ntr

నిజంగానే ఏదో చేద్దాం అని వచ్చిన ముఖ్యమంత్రుల్లో చిట్ట చివరి నాయకుడు ఎన్టీయార్. రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం ఎంతోమంది మధ్యతరగతి వారికి ఊరటనిచ్చింది. ఆ కాలంలో రేషన్ షాప్ కి వెళ్లి బియ్యం తెచ్చుకున్నవాళ్ళల్లో మేమూ ఉన్నాం. తెలుగు భాష అభివృద్ధి కోసం చేయని ప్రయత్నం లేదు. కాన్వెంట్ ల హవా అప్పటికే నడుస్తోంది. తెలుగు కనుమరుగవుతోంది. పాఠశాలల్లో తెలుగు తప్పనిసరి భాషగా ఉండాలని కోరుకోవడమే గాక దాని అమలుకు ప్రణాళికలు రచించాడు. గవర్నమెంట్ ఉద్యోగాల్లో తెలుగు తెలియడం ఒక అర్హతగా మార్చాడు. అది తెలుగు భాష పట్ల ఆసక్తిని నిజంగానే పెంచింది. అలా అని ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ లను ప్రక్కన పెట్టేయలేదు. వివిధ కారణాల వల్ల చదువు మధ్యలో ఆగిపోయినవారు తమ పనులు మానుకోకుండా విద్యను పూర్తి చేయగలిగే ఓపెన్ యూనివర్సిటీ సిస్టంని ప్రవేశపెట్టింది ఎన్టీయార్ యే. ఆయన తెచ్చిన, అమల్లో పెట్టిన చట్టాలెన్నో. అందులో ఎన్నో తర్వాతి కాలంలో దేశం మొత్తం అనుసరించింది. ఎంసెట్ (EAMCET) ప్రవేశపెట్టినది ఎన్టీయారే. ఆ తర్వాతి కాలంలో అది దేశం మొత్తం అమలులో పెట్టింది.

1995లో మాక్స్ (Mutually Aided Cooperative Society) చట్టాన్ని అమల్లోకి తెచ్చింది ఎన్టీయారే. అంటే కో ఆపరేటివ్ సొసైటీ. కన్సూమర్ కో ఆపరేటివ్, ప్రొడ్యూసర్ కో ఆపరేటివ్, వర్కర్ కో ఆపరేటివ్ వంటివి ఎన్నో దేశంలో మిగిలిన రాష్ట్రాలూ అమల్లోకి తెచ్చాయి. ప్రభుత్వ టీచర్లు, ప్రయివేటు స్కూల్స్, ట్యూషన్స్ చెప్పకూడదని శాసించాడు. ప్రభుత్వ పాఠశాలలో చదువు చెప్పకుండా, తమ ట్యూషన్లో రావాలని టీచర్లు చేస్తున్న పనులను అడ్డుకోవడం దీని వెనక ఉన్న లక్ష్యం. టీచర్లు ఉద్యమించారు. అయినా ఆయన చేయాలనుకున్నది చేశారు. ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు ఎన్టీయార్ స్థాపించినదే. తిరుపతిలో ఉన్న పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఎన్టీయార్ స్థాపించినదే. ఆంద్రప్రదేశ్ లోకాయుక్త చట్టం11ను అమల్లోకి తెచ్చినది కూడా ఎన్టీయారే. ఓ సామాన్యుడికి ముఖ్యమంత్రిని అయినా సరే, ప్రశ్నించే అధికారం ఉండాలనే ఆలోచన.

జీవిత ప్రయాణంలో రాగద్వేషాలు, తప్పుడు ఆలోచనలు, తడబడే అడుగులు సాధారణం. పరిపక్వత ఎంత త్వరగా వస్తుందో, ఎంత త్వరగా పరిణతి చెందుతారో అనేదే ముఖ్యం. సమాజానికి హాని చేస్తున్న దుష్టశక్తులను అందలం ఎక్కిస్తూ, సమాజం కోసం కొద్దోగొప్పో పాటుపడిన వారి కృషిని తగ్గించే ప్రయత్నం అమానుషం. చీకట్లో నిలబడి వెలుగులో ఉన్నవారిని చూసి అసూయ చెందడం, వారి మీద బురద జల్లే ప్రయత్నం మానాలి. మాని తీరాలి. నాకు సంబంధించినంతవరకూ ఎన్టీయార్ ఒక స్ఫూర్తి. ఎక్కడో మొదలుపెట్టి చరిత్రలో తనకో పేజీ సృష్టించుకున్నవాడు. మరణించి ఇన్ని దశాబ్దాలు గడిచినా ఈ రోజుకీ తన గురించి చెప్పుకునేలా చేసుకుంటున్నాడు. అదీ – విజయం అంటే..!!

Tags: sr ntr
Previous Post

భాషాభిమానం హ‌ద్దులు దాటి దుర‌భిమానంగా మారుతుందా..? త‌మిళుల పద్ధ‌తి అస‌లు బాగాలేదే..?

Next Post

మీరు కోపంగా ఉన్న‌ప్పుడు మీ గుండె ఎలా ప్ర‌వ‌ర్తిస్తుందో తెలుసా..?

Related Posts

వినోదం

సీనియర్ ఎన్టీఆర్ నుండి పవన్ కళ్యాణ్ వరకు రెండు పెళ్లిళ్లు చేసుకున్న నటులు ..!!

July 22, 2025
హెల్త్ టిప్స్

రోడ్లపై పునుగులు, బోండాలు, మంచూరియా, తింటున్నారా..అయితే నష్టాలు తప్పవు..!

July 22, 2025
ఆధ్యాత్మికం

స్త్రీలు సాష్టాంగ న‌మ‌స్కారం ఎందుకు చేయ‌కూడ‌దు..? దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటి..?

July 22, 2025
హెల్త్ టిప్స్

పాప్‌కార్న్‌ను అధికంగా తింటున్నారా..? అయితే ముందు ఈ విష‌యాల‌ను తెలుసుకోండి..!

July 22, 2025
inspiration

మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ వాడే ఫోన్ ఏంటో తెలుసా..? ఆపిల్ iPhone వాడకపోవటానికి కారణం ఇదే..!

July 22, 2025
హెల్త్ టిప్స్

రోజూ భోజ‌నంలో పెరుగును త‌ప్ప‌నిస‌రిగా తినాల్సిందే.. ఎందుకంటే..?

July 22, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.