Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home ఆధ్యాత్మికం

అనంత పద్మనాభ స్వామి ఆలయ గదిలో అంతులేని రహస్యాలు.. సంపద..?

Admin by Admin
January 1, 2025
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

మన దేశంలో శ్రీమహావిష్ణువుకు ఉన్న ముఖ్యమైన ఆలయాల్లో తిరువనంతపురంలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం కూడా ఒకటి. పాలసముద్రంలో శేషతల్పంపై విష్ణువు శయనిస్తూ ఉన్న రూపాన్ని మనం ఈ ఆలయంలో దర్శించుకోవచ్చు. ఇక ఈ ఆలయంలో బయటపడ్డ సంపద ప్రపంచ దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. కొన్ని లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే సంపదతో ప్రపంచంలోనే అనంత పద్మనాభ స్వామి అత్యంత ధనం కలిగి ఉన్న దైవంగా మనకు దర్శనమిస్తున్నాడు. కాగా ఈ క్షేత్రంలో అనంత పద్మనాభ స్వామి స్వయంగా వెలిశాడని స్థల పురాణం చెబుతోంది.

అనంత పద్మనాభ స్వామి ఆ క్షేత్రంలో ఎలా వెలిశాడనేది మనకు కొన్ని పురాణాల ద్వారా తెలుస్తుంది. పూర్వం దివాకరుడు అనే రుషి ఉండేవాడు. అతను విష్ణు భక్తుడు. అతనికి విష్ణువు ఒక రోజు చిన్న బాలుడి రూపంలో కనిపిస్తాడు. ఆ బాలుడు ముద్దులొలుకుతూ ఉండడంతో దివాకరుడు అతన్ని తన ఇంట్లో ఉండాలని కోరుతాడు. అయితే ఆ బాలుడు సాక్షాత్తూ శ్రీమహావిష్ణువేనని దివాకరుడికి తెలియదు. ఈ క్రమంలో ఆ బాలుడు.. తాను చేసే పనులకు అడ్డు చెప్పకూడదని, ఒకవేళ చెబితే వెంటనే ఇంటి నుంచి వెళ్లిపోతానని షరతు విధిస్తాడు. అందుకు దివాకరుడు సరేనంటాడు.

anantha padmanabha swamy temple this chamber has lot of wealth

అలా ఆ బాలుడు దివాకరుడి ఇంటికి చేరుకున్నాక నిత్యం అతన్ని హేళన చేసేవాడు. అల్లరి కూడా చేసేవాడు. అయినా దివాకరుడు ఆ బాలున్ని ఒక్క మాట కూడా అనేవాడు కాదు. అయితే ఒక రోజు దివాకరుడు తపస్సు చేసుకుంటుండగా ఆ బాలుడు వచ్చి సాలగ్రామాలను అతని నోట్లో వేస్తాడు. దీంతో దివాకరుడికి పట్టరానంత ఆగ్రహం వస్తుంది. అంతే.. మరుక్షణమే ఆ బాలుడు అదృశ్యమైపోతాడు. అప్పుడే దివాకరుడికి ఆ బాలుడు శ్రీమహావిష్ణువు అన్న సంగతి తెలుస్తుంది. అయితే ఆ బాలుడు అదృశ్యమవుతూ తనను చూడాలంటే అనంతన్‌కాడు దగ్గరకు రమ్మని చెబుతాడు. దీంతో దివాకరుడు స్వామిని వెదుక్కుంటూ వెళతాడు.

సముద్ర తీరపాత్రంలో ఓ భారీ వృక్షం శ్రీమహావిష్ణువు రూపంలో అప్పుడే దివాకరుడికి కనిపిస్తుంది. అయితే అంతటి పెద్ద రూపాన్ని సరిగ్గా చూడలేకపోతున్నానని దివాకరుడు చెప్పడంతో స్వామి దివాకరున్ని భారీ కాయుడిగా మారుస్తాడు. దీంతో దివాకరుడు స్వామి దర్శనం చేసుకుంటాడు. అప్పటి నుంచి అక్కడ శ్రీమహావిష్ణువు అనంత పద్మనాభ స్వామిగా భక్తుల పూజలందుకుంటూ వస్తున్నాడు. ఇక ఆ ఆలయంలో టెంకాయలో మామిడికాయను ఉంచి ప్రసాదం ఇస్తారు. ఆలయం ప్రారంభం అయినప్పటి నుంచీ ఇలా ప్రసాదాన్ని ఇవ్వడం అక్కడ ఆనవాయితీగా వస్తోంది.

అనంత పద్మనాభ స్వామిని బలరాముడు దర్శించుకున్నాడని భాగవతంలో ఉంది. ఇక ఈ ఆలయానికి తిరువనంతపురం ట్రావెన్‌కోర్ రాజులు సంరక్షకులుగా ఉండేవారు. వారి కాలంలోనే అనంత పద్మనాభ స్వామికి అంతులేని సంపద వచ్చి చేరిందని చెబుతారు. ఇక ఆలయంలోని నేలమాళిగలలో ఉన్న గదుల్లో అన్ని గదులను ఇప్పటికే తెరిచి సంపదను లెక్కించారు. కానీ ఒక్క గదిని మాత్రం తెరవలేదు. ఎందుకంటే ఆ గదికి నాగబంధం ఉన్నదట. దాంతో ఆ గదిని తెరిస్తే అరిష్టాలు జరుగుతాయని విశ్వసిస్తున్నారు. అందుకనే అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఆ ఒక్క గదిని తెరవడం లేదు.

కాగా ఈ ఆలయంలో ఉన్న తెరవని ఆ ఒక్క గదిలోనే వెలకట్టలేని సంపదతోపాటు ఎన్నో రహస్యాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అవన్నీ మనుషుల కంట పడితే ప్రమాదమని, మానవజాతి వినాశనం జరుగుతుందని ప్రచారంలో ఉంది. ఈ క్రమంలోనే ఆ గది తలుపులను ఇప్పటి వరకు ఎవరూ తెరవలేదు. అయితే భవిష్యత్తులో దీనిపై ఏదైనా నిర్ణయం తీసుకుంటారేమో చూడాలి. కేరళ రాజధాని తిరువనంతపురంలో అనంత పద్మనాభ స్వామి ఆలయం ఉంది. దేశంలోని దాదాపు అన్ని ప్రముఖ నగరాల నుంచి అక్కడికి వెళ్లవచ్చు. రైల్వే, బస్సు, విమాన సదుపాయాలు ఉన్నాయి. తిరువనంత పురం రైల్వే స్టేషన్ లేదా ఎయిర్‌పోర్టులలో దిగితే ప్రైవేటు వాహనాల్లోనూ ఆలయానికి వెళ్లవచ్చు..!

Tags: Anantha Padmanabha Swamy Temple
Previous Post

ఐక్యూ అంటే ఏమిటి..? దాన్ని ఎలా కొలుస్తారో తెలుసా..?

Next Post

Sri Devi Death : అసలు శ్రీదేవికి మ‌ద్యం ఎవరు అల‌వాటు చేశారు..? ఆమె మరణం వెనుక అసలు రహస్యం ఏమిటి..?

Related Posts

ఆధ్యాత్మికం

ఎరుపు, ప‌సుపు, నారింజ రంగులో ఉండే ఈ దారాన్ని ఎందుకు క‌డ‌తారో తెలుసా..?

August 8, 2025
వినోదం

బాలకృష్ణ పెళ్లికి ఎన్టీఆర్, హరికృష్ణ ఎందుకు రాలేదో తెలుసా..?

August 7, 2025
home gardening

మీ ఇంట్లో ఉన్న మొక్క‌లు ఏపుగా పెర‌గాలంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!

August 7, 2025
lifestyle

మీరు వాడుతున్న గోధుమ పిండి స్వ‌చ్ఛ‌మైందేనా..? క‌ల్తీ అయిందా..? ఇలా సుల‌భంగా గుర్తించండి..!

August 6, 2025
lifestyle

మీ భర్త మిమల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఇలా సులువుగా తెలుసుకోవచ్చు !

August 6, 2025
వినోదం

సినిమాలో హీరో క్యారెక్టర్ చనిపోయినా కూడా బ్లాక్ బస్టర్ సాధించిన సినిమాలు ఇవే..!

August 5, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Darbha Gaddi : ఈ వేరును గుమ్మానికి కడితే.. ఇంట్లోకి డబ్బులు వద్దన్నా వస్తాయి..!

by Editor
May 27, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Atti Patti Plant : పురుషుల‌కు ఈ మొక్క ఎంతో ఉప‌యోగ‌క‌రం.. ఇత‌ర ప్ర‌యోజ‌నాలు కూడా ఉంటాయి..!

by D
July 11, 2022

...

Read more
మొక్క‌లు

Kodi Juttu Aku : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. పిచ్చి మొక్క అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లే..!

by Editor
December 19, 2022

...

Read more
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.