Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

ఐక్యూ అంటే ఏమిటి..? దాన్ని ఎలా కొలుస్తారో తెలుసా..?

Admin by Admin
January 1, 2025
in lifestyle, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

సాధారణంగా మనం పాలు, నీళ్లు ఇతర ద్రవ పదార్థాలను లీటర్లలో కొలుస్తాం. అదే ఘన పదార్థాలైతే కేజీల లెక్కన కొలుస్తాం. ఇక వాయువులైతే క్యుబిక్ మీటర్లు, సెంటీమీటర్లు, ఫీట్లలో కొలుస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే.. అయితే మరి ఒక మనిషికి ఉన్న తెలివితేటలను కొలవాలంటే.. అందుకు ఏ కొలమానం వాడుతాం..? ఏంటీ.. తెలివితేటలను ఎవరైనా కొలుస్తారా..? ఎవరికైనా ఉండే తెలివిని కేజీలు, లీటర్ల లెక్కన కొలవడం సాధ్యమవుతుందా..? అని మీరు సందేహించవచ్చు. కానీ తెలివితేటలను కొలవవచ్చు. అయితే అది కేజీలు, లీటర్లలోకాదు.. వేరే పద్ధతిలో.. అదెలాగంటే…

ఎవరైనా ఒక వ్యక్తికి తెలివితేటలు ఎంత ఉన్నాయి.. అని మనకు తెలియజేసే సాధనం ఐక్యూ. దీన్నే ఇంటెలిజెన్స్ కోషెంట్ (Intelligence Quotient) అంటారు. అంటే ఐక్యూ సంఖ్య ఎంత పెద్దదైతే వారికి అన్ని ఎక్కువ తెలివితేటలు ఉంటాయన్నమాట. తెలివితేటలకు కొలమానమే ఐక్యూ. ఒక మనిషికి ఉండే ఐక్యూని బట్టి అతని తెలివితేటలను నిర్దారిస్తారు. అయితే ఐక్యూను ఎలా కొలుస్తారు..? అంటే…

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ఐక్యూని కొలిచేందుకు రక రకాల పద్ధతులు వాడుతున్నారు. వాటిల్లో ముఖ్యమైంది వెక్స్లర్ టెస్టు. ఇందులో మనిషి శబ్ద గ్రహణ శక్తి, జ్ఞానవంతమైన నిర్ణయాలు తీసుకునే శక్తి, జ్ఞాపకశక్తి, ప్రాసెసింగ్ స్పీడ్ (ఒక ప్రశ్నకు ఎంత వేగంగా సమాధానం చెప్పగలరనే శక్తి) తదితర అన్ని పరిజ్ఞానాలను కొలుస్తారు. వాటిల్లో సాధించే స్కోరును బట్టి చివరకు ఐక్యూని నిర్ణయిస్తారు. అయితే స్టాన్ఫర్డ్ బినెట్ స్కేల్ అనే మరో ఐక్యూ టెస్ట్ కూడా ఉంది. ఇందులో దృశ్య ప్రాదేశిక ప్రాసెసింగ్ వంటి నూతన అంశాల్లో కూడా ఐక్యూను కొలుస్తారు.

what is iq and how it is measured

సాధారణంగా ఐక్యూ టెస్టులో ఒక వ్యక్తికి ఉండే గణిత శాస్త్ర సామర్థ్యం, పదజాలం ప్రతిభ వంటి అంశాలకు చెందిన ప్రశ్నలను ఇస్తారు. వాటిని ఆ వ్యక్తులు నిర్ణీత కాలంలోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే ఇవే కాకుండా పలు ఇతర ఐక్యూ టెస్టులు కూడా అందుబాటులో ఉన్నప్పటికీ.. ఏవీ కచ్చితమైన ఫలితాలను ఇస్తాయన్న గ్యారంటీ లేదు. అందుకనే ఐక్యూ టెస్టులకు అంత ప్రాధాన్యత ఇవ్వడం లేదు. కాకపోతే పలు మానసిక వ్యాధులతో బాధపడేవారి ఐక్యూ ఎంత ఉంది అని తెలుసుకునేందుకు ఈ టెస్టులు ఉపయోగపడతాయని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో వారి స్థితిని అంచనా వేసి తగిన విధంగా చికిత్స చేసేందుకు వీలు కలుగుతుందని వారు అంటున్నారు.

అయితే ప్రముఖ సైంటిస్టులు ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఐక్యూ 160 ఉంటుందనే ఒక వాదన బలంగా ప్రచారంలో ఉంది. నిజానికి ఐన్‌స్టీన్ కాలంలో ఐక్యూను కొలిచే పద్ధతులు అప్పటికి ఇంకా అందుబాటులోకి రాలేదు. మరలాంటప్పుడు ఆయన ఐక్యూ 160 ఎలా ఉంటుంది..? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయినప్పటికీ ఐక్యూ అనేది నిజంగానే ఒక వ్యక్తి తెలివితేటలను కచ్చితంగా తెలియజేస్తుందని చాలా మంది నమ్మకం. అయితే ఐక్యూ వల్ల తెలివిలేని వారిని చిన్న చూపు చూస్తారని కూడా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో ఈ విషయంపై మరింత లోతుగా పరిశోధనలు జరగాల్సిందేనని సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా.. ఐక్యూ వల్ల ఒక మనిషికి ఉన్న తెలివితేటలను అంచనా వేయడం అంత సులభమేమీ కాదని మెజారిటీ సైంటిస్టుల అభిప్రాయం. ఇదీ.. ఐక్యూ కథాకమామీషు..!

Tags: iq
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

అనంత పద్మనాభ స్వామి ఆలయ గదిలో అంతులేని రహస్యాలు.. సంపద..?

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.