ఐక్యూ అంటే ఏమిటి..? దాన్ని ఎలా కొలుస్తారో తెలుసా..?
సాధారణంగా మనం పాలు, నీళ్లు ఇతర ద్రవ పదార్థాలను లీటర్లలో కొలుస్తాం. అదే ఘన పదార్థాలైతే కేజీల లెక్కన కొలుస్తాం. ఇక వాయువులైతే క్యుబిక్ మీటర్లు, సెంటీమీటర్లు, ఫీట్లలో కొలుస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే.. అయితే మరి ఒక మనిషికి ఉన్న తెలివితేటలను కొలవాలంటే.. అందుకు ఏ కొలమానం వాడుతాం..? ఏంటీ.. తెలివితేటలను ఎవరైనా కొలుస్తారా..? ఎవరికైనా ఉండే తెలివిని కేజీలు, లీటర్ల లెక్కన కొలవడం సాధ్యమవుతుందా..? అని మీరు సందేహించవచ్చు. కానీ తెలివితేటలను కొలవవచ్చు….