Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home ఆధ్యాత్మికం

తిరుమ‌ల‌లో ఉన్న ఈ తీర్థాల గురించి మీకు తెలుసా..? వీటిలో స్నానం చేస్తే ఎంతో పుణ్యం..!

Admin by Admin
March 27, 2025
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

మన దేశం కర్మభూమి. మహనీయులు సంచరించిన పవిత్రభూమి. కశ్మీరం నుంచి కన్యాకుమారం వరకు ఎన్నో విశేషాలు,వింతలు. ప్రకృతి ప్రసాదించిన అద్భుత విశేషాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి వాటిలో తీర్థాలు మరీ ప్రత్యేకత సంతరించుకున్నాయి. దేశంలో వెలిసిన ప్రాచీన తీర్థాలకు ఆధ్మాత్మికమైన కొన్ని కథలు పురాణాలలో, వ్యాసాలలో, గ్రంథాలలో వర్ణించబడి వున్నాయి. దేవతలు, రాక్షసుల మధ్య జరిగిన సంఘర్షణలో కొన్ని తీర్థస్థానాలు పుట్టుకువస్తే… మరికొన్ని తీర్థాలు మునులు చేసిన ఘోర తపస్సుకు నిలయంగా వెలిశాయి. అందులో ముఖ్యంగా ఆంధ్రరాష్ట్రంలోని తిరుమల ప్రాంతంలో ఎన్నీ తీర్థస్థానాలు కొలువై వున్నాయి. తిరుమలలో ఉన్న పలు తీర్థారాజాల గురించి తెలుసుకుందాం….

విరజానది : శ్రీ వెంకటేశ్వరస్వామి విగ్రహ పాదాల కింద భాగంలో ఈ నది ప్రవహిస్తుంటుంది. ఇది ఒక చిన్న బావిలా కనిపిస్తుంది. స్వామివారి రెండవ ప్రాకారంలో పడమటి భాగంలో ఉగ్రాణము ముందున్న భూమికి సమంగా నీరు వుంటుంది. ఈ తీర్థాన్ని తలపై వేసుకుంటే మోక్షప్రాప్తి సిద్ధిస్తుంది. పాండవ తీర్థం : పాండవులు, కౌరవుల మధ్య జరిగిన ఘోరమైన కురుక్షేత్ర సంగ్రామం తరువాత… పాండవులు తాము చేసిన బ్రహ్మహత్య పాపాలను పోగొట్టుకోవడానికి అభిషేక స్నానాలను ఆచరించారు. అనంతరం ఆ క్షేత్రపాలకునిని పూజించి, శ్రీనివాసునుని దర్శించుకున్నారు. ఆనాడు పాండవులు ఈ తీర్థంలో స్నానం చేయడంవల్లే దీనికి పాండవతీర్థం అనే పేరు వచ్చింది. ఈ తీర్థం తిరుమల దేవాలయానికి ఉత్తరదిశలో వుంది.

do you know about these teerthams in tirumala

సనక నందన తీర్థం : పూర్వం సకననందనాదులు సిద్ధిప్రాప్తి కోసం ఈ ప్రాంతంలో ఘోరమైన తపస్సును ఆచరించారు. దాంతో వారిపేరు మీదుగా ఇక్కడ తీర్థస్థలం వెలిసింది. ఇందులో మార్గశిక శుక్లపక్ష ద్వాదశినాడు స్నానం చేస్తే సిద్ధి పొందుతారని ఇక్కడి ప్రజలు ప్రగాఢంగా నమ్ముతారు. లక్షలాది భక్తులు ఇక్కడికి వస్తూ వుంటారు. ఈ తీర్థం పాపవినాశనం ఉత్తరభాగంలో ఒక మైలు దూరంలో వుంటుంది. కుమారధార తీర్థం : ఈ తీర్థం దేవాలయానికి ఆరుమైళ్ల దూరంలో వుంటుంది. మాఘపౌర్ణమినాడు ఇందులో స్నానమాచరిస్తే సంతానం ప్రాప్తితోపాటు… సకల కార్యసిద్ధి కూడా కలుగుతుంది. తుంబుర తీర్థం : ఈ తీర్థం ఆలయానికి ఆరుమైళ్ల దూరంలో వుంది. పూర్వం ఇందులోనే తుంబురు నాదమహర్షి ఘోరమైన తపమును ఆచరించారు. ఫాల్గుణ శుద్ధ పౌర్ణమినాడు ఈ తీర్థంలో స్నానం చేస్తే దేవుని మీద భక్తి పెరగడంతోపాటు గతంలో చేసిన సకలపాపాలన్నీ దూరమవుతాయి.

నాగతీర్థం : శ్రీహరి దేవాలయం నుంచి ఒక కిలోమీటరు దూరంలో ఈ తీర్థం కనువిందు చేస్తుంది. పెళ్ళికాని కన్యలు ఇందులో భక్తిశ్రద్ధలతో స్నానాలు చేస్తే.. సకల సద్గుణాలు కలిగిన ఉత్తమ భర్తను పొందుతారు. చక్రతీర్థం : భారతయుద్ధం ముగిసిన అనంతరం శ్రీహరి చక్రం మహాపాతకాలకు గురికావడం వల్ల… ఆయన తన సుదర్శన చక్రాన్ని ఈ తీర్థంలో స్నానం చేయించారు. అటువంటి పుణ్యతీర్థంలో ఎవరైనా స్నానం చేస్తే.. వారికి బ్రహ్మహత్య, శిశుహత్య దోషాలు పూర్తిగా తొలిగిపోయి… పుణ్యపవిత్రులు అవుతారు. శ్రీహరి ఆలయం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఈ తీర్థం వుంటుంది. జాబాలి తీర్థం : పూర్వం జాబాలి అనే మహర్షి ఈ తీర్థంలో ఘోరమైన తపస్సు చేసి తరించారు. ఈ తీర్థంలో స్నానం చేస్తే భూతప్రేత పిశాచాలు తొలగిపోవడంతోపాటు మనోవాంఛ కూడా సిద్ధిస్తుంది. ఇక్కడే ఆంజనేయ స్వామివారి ఆలయం కూడా వుంది. హథీరాంజీ మఠాధిపతుల అధీనంలో వున్న ఈ ఆలయానికి… వారు నిత్యం స్వామివారికి నైవేద్య ఆరాధనలు ఇస్తారు.

బాలతీర్థము : ఈ తీర్థంలో స్నానం చేస్తే వృద్ధులు సైతం బాలురు శక్తిని పొందుతారని విశ్వాసం. అయితే ఇది సృష్టికి అవరోధం కావడంతో జలం కూడా కనిపించకుండా శిలలో మూసివేయబడింది. నాగతీర్థం నుంచి రెండువందల గజాల దూరంలోనే ఈ తీర్థం వుంటుంది. వైకుంఠ తీర్థం : కోవెలకు తూర్పు దిశలో ఒక కిలోమీటరు దూరంలో వున్న ఈ తీర్థంలో స్నానం చేస్తే వైకుంఠప్రాప్తి కలుగుతుంది. పురజనులు అప్పుడప్పుడు ఇక్కడ వైకుంఠసమారాధన చేస్తూ వుంటారు. శేష తీర్థం: శ్రీహరి దేవాలయానికి పదికిలోమీటర్ల దూరంలో వున్న ఈ తీర్థానికి చేరుకోవడం చాలా కష్టం. పర్వతాలను ఎక్కుకుంటూ.. దారిలో వున్న చిన్నచిన్న ప్రవాహాలను చాలా జాగ్రత్తగా దాటాలి. ఈ ప్రవాహాలు కూడా పాచి పట్టి వుంటాయి. ఈ తీర్థంలో ఆదిశేషుడు శిలారూపంలో వుంటాడు. అలాగే కొన్ని ప్రత్యేకమైన నాగుపాములు కూడా ఇక్కడ నిత్యం తిరుగుతూనే వుంటాయి. ఈ తీర్థంలో ఒక్కసారి స్నానం చేస్తే వారికి మరోజన్మ వుండదు.

సీతమ్మ తీర్థం : పూర్వం సీతాదేవి కుశవులకు కరం నూరిపోసింది. బండ అరిగివున్న కొంత భాగం ఇప్పటికీ అక్కడ చూడవచ్చు. ఈ ప్రాంతంలో ఒక బిలం కూడా వుంది. అయితే అందులో వున్న జలం బయటకు కనిపించదు. ఒక పొడుగాటి వెదురుకు కొబ్బరి పీచుకట్టి ఆ బిలంలో తోడితే.. నీరు ప్రవహిస్తుంది. ముఖ్యంగా స్త్రీలు భక్తితో ఈ తీర్థంలో స్నానం ఆచరిస్తే ముక్తిని పొందుతారు. యుద్ధగళ తీర్థం : ఈ తీర్థం గురించి రామాయణంలో కూడా వర్ణించబడి వుంది. పూర్వం రాముడు, రావణునిని సంహరించిన తరువాత తాను చేసిన బ్రహ్మహత్య మహాపాతకాన్ని నిర్మూలించుకోవడం కోసం ఇందులో స్నానం చేశాడు.

పద్మ సరోవరం : పద్మావతి మందిరం దగ్గరున్న ఈ సరోవరం.. తిరుపతి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో వుంటుంది. ఇందులో వున్న జలం స్వర్ణముఖి నదిలో కలుస్తుంది. ఈ పద్మసరోవరంలో స్నానం చేసినవారికి సకల భోగభాగ్యాలు కలగటమే కాకండా… భూతప్రేతపిశాచాలు కూడా వదిలిపోతాయి. కేవలం ఇవి మాత్రమే కాదు… కాయరసాయ తీర్థం, ఫల్గుణి తీర్థము, కటాహ తీర్థము, వరాహ తీర్థము, విష్వక్సేన తీర్థము, పంచాయుధ తీర్థము, బ్రహ్మతీర్థము, సప్తముని తీర్థము, దేవ తీర్థము వంటి ఎన్నో ముఖ్యతీర్థాలు తిరుమలలో కొలువై ఉన్నాయి. పవిత్రమైన ఈ తీర్థరాజాలలో స్నానం లేదా ఆ నీళ్లను తలపై చల్లుకున్నంత మాత్రానే సకల పాపాలు పోతాయని ప్రతీతి. ఈసారి తిరుమలకు వెళ్లినప్పుడు అవకాశం ఉన్న తీర్థాలను సందర్శించండి.

Tags: theerthamTirumala
Previous Post

ఏసుక్రీస్తును అస‌లు ఎందుకు శిలువ వేశారు.. కార‌ణం తెలుసా..?

Next Post

మీలో క‌నిపించే అనారోగ్య ల‌క్ష‌ణాల‌ను బ‌ట్టి మీకు ఎలాంటి వ్యాధి ఉందో ఇలా గుర్తించ‌వ‌చ్చు..!

Related Posts

హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

September 26, 2025
ఆధ్యాత్మికం

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

September 26, 2025
ఆధ్యాత్మికం

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

September 25, 2025
వినోదం

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

September 25, 2025
ఆధ్యాత్మికం

మీ ఇంట్లోకి ఇలాంటి పక్షులు వస్తున్నాయా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

September 24, 2025
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

September 23, 2025

POPULAR POSTS

food

Paneer Mushroom Dum Biryani : ప‌నీర్‌, మ‌ష్రూమ్ ద‌మ్ బిర్యానీ.. ఇలా చేసి చూడండి.. ఎంతో బాగుంటుంది..!

by D
March 12, 2023

...

Read more
పోష‌కాహారం

పోషకాల గ‌ని న‌లుపు రంగు కిస్మిస్ పండ్లు.. వీటిని తింటే ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయంటే..?

by Admin
July 6, 2021

...

Read more
హెల్త్ టిప్స్

మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య ఉందా.. అయితే ఈ పండ్ల‌ను తినండి..

by Admin
August 4, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Shiva Darshan : నందికొమ్ముల నుంచి శివ‌లింగాన్ని ద‌ర్శిస్తారు.. ఎందుకంటే..?

by Admin
November 26, 2024

...

Read more
jobs education

బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోవచ్చు..!

by Peddinti Sravya
October 21, 2024

...

Read more
food

Mushroom Pulao : పుట్ట‌గొడుగుల‌తో పులావ్‌ను ఇలా చేస్తే.. ఒక్క ముద్ద ఎక్కువే తింటారు.. ఎంతో రుచిగా ఉంటుంది..!

by Editor
February 9, 2023

...

Read more
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.