దేవాలయాల్లో ప్రతిరోజూ ఉదయాన్నే మనకు గాయత్రీ మంత్రాలు వినిపిస్తుంటాయి. హిందూ మత విశ్వాసాల ప్రకారం, ఈ మంత్రాలను పఠించడం వల్ల కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని, జీవితమంతా సంతోషంగా ఉంటుందని నమ్ముతారు. బుుగ్వేదంలో తొలిసారిగా ప్రస్తావించబడిన ఈ గాయత్రీ మంత్రం సంస్కృతం నుంచి వచ్చింది. ఈ మంత్రాల్లో వ్యాహృతులు అనేవి దివ్యమైన శక్తిని కలిగి ఉంటాయి. ఇవి మూడు కాలాలను సూచిస్తాయి. గాయత్రీ మంత్రంలో మొత్తం 24 బీజాక్షరాలు ఉంటాయి. మన పూర్వీకులు ఈ 24 బీజాక్షరాలను ఆధారం చేసుకుని ఆలయాలను కూడా నిర్మించారు. ఈ సందర్భంగా హిందూ మతంలో ఎంతో మహిమ కలిగిన గాయత్రీ మంత్రాల అర్థాలేంటి.. వీటిని జపించడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం…
ఓం భూర్భువః సువః తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. తాత్పర్యం.. మేము దైవిక జీవి, సృష్టికర్త ప్రకాశాన్ని ధ్యానిస్తాము. ఆ భగవంతుని తేజస్సు మన మేధస్సును సన్మార్గంలో నడపడానికి ప్రేరేపిస్తుంది. ఇందులోని ప్రతి ఒక్క బీజాక్షరం మహిమాన్వితమైంది. ఈ మంత్రాన్ని జపిస్తే సకల దేవతలను ఆరాధించేట్టేనని బుుగ్వేదంలో పేర్కొనబడింది. ఈ మంత్రం గాయత్రీ దేవికి అంకితం ఇవ్వబడింది. గాయత్రీ దేవిని వేదాలకు తల్లిగా భావిస్తారు. అందుకే ప్రతిరోజూ ఉదయాన్నే చాలా మంది ప్రజలు గాయత్రీ మంత్రాన్ని స్వచ్ఛమైన మనసుతో పఠించాలని శాస్త్రాలలో పేర్కొనబడింది. ఈ మంత్రాన్ని ఏ సమయంలో అయినా పఠించవచ్చు. ప్రతిరోజూ గాయత్రీ మంత్రాన్ని పఠించడం వల్ల జీవితంలో సంతోషం, గెలుపు సులభంగా దక్కుతాయని చాలా మంది నమ్ముతారు.
గాయత్రీ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం వల్ల మనసును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఈ మంత్రం పఠించడం వల్ల మన మన మేధస్సు చురుగ్గా పని చేస్తుంది. ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా ఏకాగ్రతను కాపాడుకోవచ్చు. ఈ మంత్రాన్ని జపించడం వల్ల శరీరంలోని విష పదార్థాలన్నీ బయటకొస్తాయి. నాడీ వ్యవస్థ, శ్వాస, పనితీరులో సహాయపడుతుంది. ఈ మంత్రాలను పఠించడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గి మనసు ప్రశాంతంగా మారుతుంది. గాయత్రీ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం వల్ల మనసు ప్రశాంతంగా, ఏకాగ్రతతో ఉంటుంది. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల దుఃఖం, బాధలు, దారిద్ర్యం, పాపాలన్నీ తొలగిపోతాయి. గాయత్రీ మంత్రాలను నూతన దంపతులు సంతానం కోసం పఠిస్తారు. మనం చేసే పనిలో విజయం సాధించడం కోసం, పనిలో పురోగతి తదితర వాటి కోసం గాయత్రీ మంత్రాన్ని జపిస్తారు. ప్రత్యర్థులు లేదా శత్రువుల మధ్య ఆధిపత్యాన్ని నెలకొల్పడానికి నెయ్యి, కొబ్బరికాయ హవనం చేయొచ్చు. పూర్వీకుల దోషం, కాల సర్పదోషం, రాహు-కేతు, శని దోషాల నుంచి ఉపశమనం కోసం శివ గాయత్రీ మంత్రాన్ని పఠించాలి.
ప్రతిరోజూ గాయత్రీ మంత్రాన్ని పఠించడం వల్ల పేదరికం తగ్గిపోతుంది. అంతేకాదు ఆర్థిక ప్రయోజనాల ద్వారా మీ ఆదాయం పెరగడం ప్రారంభమవుతుంది. ప్రతిరోజూ గాయత్రీ మంత్రాలను పఠించడం వల్ల వ్యాపారులకు, ఉద్యోగులకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. మీకు వివాహ సంబంధిత సమస్యలు ఎదురైతే సోమవారం ఉదయం పసుపు రంగు దుస్తులు ధరించి గాయత్రీ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే శుభ ఫలితాలొస్తాయి.