నందమూరి నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్న నటసింహం నందమూరి బాలకృష్ణ గురించి తెలుగు రాష్ట్రాలలో తెలియని వారు ఉండరు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలతో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నారు బాలయ్య. కథానాయకుడిగా మాత్రమే కాదు, నిర్మాత, రచన, దర్శకత్వం లో కూడా ప్రతిభ చూపించారు. స్టూడియో స్థాపించారు. పరిశ్రమకు అండగా నిలిచారు. ఈయనకి ఉన్న మాస్ ఫాలోయింగ్ వేరు, ఆయన సినిమాలకు వచ్చే కలెక్షన్లే వేరు. మాస్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ బాలయ్య. అయితే ఇండస్ట్రీలో ఈయనది పెద్ద ఫ్యామిలీ అయినా.. కుటుంబాన్ని మీడియాకు వీలైనంత దూరంగానే ఉంచుతాడు బాలయ్య.
బాలయ్యకి ఇద్దరు కూతుర్లు, ఓ కుమారుడు ఉన్న విషయం తెలిసిందే. అయితే చాలామందికి ఆయన పెద్ద కూతురు బ్రాహ్మణి గురించి మాత్రమే తెలుసు. కానీ ఆయన చిన్న కూతురు తేజస్విని గురించి ఎవరికీ పెద్దగా తెలియకపోవచ్చు. వాస్తవానికి బాలయ్య భయపడే ఒకే ఒక వ్యక్తి కూడా ఈమెనే. బాలయ్య ముందు ఎవరైనా కొంచెం అటు ఇటుగా ప్రవర్తిస్తే ఒక్కటి పీకుతాడు అన్న విషయం మనకు తెలుసు. కానీ బాలయ్య మాత్రం తన చిన్న కూతురు తేజస్వినికి భయపడతారట. ఆమె ఏది చెప్తే అది వింటారట బాలయ్య. ప్రస్తుతం బాలయ్య సినిమాలకు సంబంధించిన అన్ని వ్యవహారాలను తేజస్విని చూసుకుంటుంది. ఇదివరకు బాలయ్య సినిమా డేట్స్, ఇతర ప్రోగ్రామ్ లు డాక్టర్ సురేందర్ చూసుకునేవారు. కానీ ఇప్పుడు తేజస్విని చూసుకుంటుంది.
అంతేకాకుండా బాలయ్య ఏ డ్రెస్ వేసుకోవాలి అనేది కూడా తేజస్వినే నిర్ణయిస్తుందట. తేజస్విని గీతం గ్రూప్ చైర్మన్ భరత్ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తండ్రి మీద మమకారంతో తేజస్విని ఆయన సినిమాల వ్యవహారాలు చూసుకునేందుకు ఇష్టపడిందట. గతంలో బాలయ్య సినిమాలకు సంబంధించి ఫైనాన్షియల్ వ్యవహారాలు ఆయన సతీమణి వసుంధర చూసుకునేవారని టాక్. కానీ ఇప్పుడు తేజస్వినే చూసుకుంటుంది. ప్రస్తుతం ఫ్యామిలీ తో పాటు బాలయ్య సినిమా వ్యవహారాలను చూసుకుంటూ హైదరాబాద్ లోనే ఉంటుంది. త్వరలోనే తేజస్విని సినిమా నిర్మాణ రంగంలోకి కూడా అడుగు పెడతారనే టాక్ నడుస్తుంది. ఆదిత్య 999 తో ఆమెను నిర్మాతగా పరిచయం చేయాలని బాలకృష్ణ భావిస్తున్నారట. చూడాలి మరి ఏం జరుగుతుందో.