చేపలు చాలామంది పట్టించుకోని ఆహార వనరు. మనం సూపర్ మార్కెట్ కి వెళ్ళినప్పుడు అనేక రకాల చేపలని చూస్తూ ఉంటాం. ప్రస్తుతం ప్రపంచంలో సుమారు 25,000 చేపల జాతులు ఉన్నాయి. అందులో ఇప్పుడు టిలాపియ అనే చేప గురించి తెలుసుకుందాం. టీలాపీయ అనేది తేలికపాటి రుచి కలిగిన చేప. ఈ ఫిష్ కొలనులలో, నదులలో, సరస్సులలో అలాగే లోతైన ప్రవాహాలలో నివసించే మంచినీటి చేప.
ఈ చేప అత్యంత రుచికరంగా ఉంటుంది. అలాగే ఇది చౌకగా లభిస్తుంది. ఈ చేప అంటే ఎంతో మందికి చాలా ఇష్టం. టిలాపియా చేప ని తెలుగులో జిలేబి చేప అంటారు. మనం ఉన్న ప్రాంతాన్ని బట్టి టీలాపియా చేపకి చాలా పేర్లు ఉన్నాయి. గోరక, చిప్ప మొదలైనవి వాటిలో కొన్ని దీని పేర్లు. చైనా టిలాపియా ఫిష్ ను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం. మనదేశంలో ఇవి ఎక్కువగా విశాఖపట్నం వంటి తీర ప్రాంతంలో, ఇతర మార్కెట్లలో మీకు అందుబాటులో ఉంటాయి. ఇది కిలో 425 రూపాయలకు మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫిష్ లో కొవ్వు, కేలరీలు తక్కువగా ఉంటాయి. ప్రోటీన్, అవసరమైన విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఈ ఫిష్ అధిక స్థాయి పొటాషియంను కలిగి ఉంటుంది. అలాగే రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
ఈ ఫిష్ రక్తపోటును నియంత్రించడంలో సహాయం చేస్తుంది. స్ట్రోక్ లేదా దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే బలమైన ఎముకలు, దంతాలకు ఇది ముఖ్యమైనది. టిలాపియా తినడం వల్ల బోలు ఎముకల వ్యాధి, ఇతర ఎముకలకు సంబంధించిన వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. ఈ ఫిష్ లో విటమిన్ బి12 అధికంగా ఉంటుంది. శరీరంలో డిఎన్ఏ తయారు చేయడంలో, నాడీ వ్యవస్థను నిర్వహించడంలో, ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. ఈ ఫిష్ లో కొవ్వు, ఒమేగా – 3 కొవ్వు ఆమ్లాలు, కేలరీలు, కార్బోహైడ్రేట్లు, సోడియం కూడా తక్కువగా ఉంటుంది. వీటిని ఆరోగ్యకరమైన ఆహారముగా తినవచ్చు.
ఇక ఈ ఫిష్ లో ఉండే విషపూరితమైన రసాయనం వాపును కలిగిస్తుంది. అలాగే రోగ నిరోధక శక్తిని బలహీన పరుస్తుంది. వీటిని అధికంగా తింటే క్యాన్సర్ ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ ఫిష్ లో అధిక స్థాయిలో పాదరసం ఉంటుంది. ఇది పెద్ద మొత్తంలో తీసుకుంటే విషపూరితం కావచ్చు. ఈ ఫిష్ ని ఎక్కువగా తింటే అలర్జీలు, ఆస్తమా, ఊబకాయం, జీవక్రియ రుగ్మతల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.