కీళ్ల నొప్పులకు నివారణ ఎలా? కీళ్ల నొప్పులు తగ్గటానికి ఎక్స‌ర్‌సైజ్‌లు ఏవి..?

కీళ్ల నొప్పులు అనేవి వయస్సు పెరగడం, ఆర్థరైటిస్‌, గాయాలు, అధిక బరువు, సరైన శరీర ధారణ లేకపోవడం వంటివి వల్ల రావచ్చు. ఇవి తగ్గించేందుకు కొన్ని జీవనశైలిలో మార్పులు, వ్యాయామాలు, ఆహార నియ‌మాలను అనుసరించాలి. తరచూ వ్యాయామం చేయడం. వ్యాయామం వల్ల కీళ్ల చుట్టూ ఉన్న కండరాలు బలపడతాయి, నరాలు చురుగ్గా మారుతాయి. రోజుకు కనీసం 30 నిమిషాల‌ నడక నొప్పులు తగ్గించడంలో చాలా ఉపయోగపడుతుంది. నీటిలో వ్యాయామం చేయడం వల్ల కీళ్ల మీద ఒత్తిడి తక్కువగా ఉంటుంది. బెంచ్ మీద కూర్చుని కాళ్లను నెమ్మదిగా పైకి ఎత్తడం. భుజాల చుట్టూ చేతులు తిప్పడం. వజ్రాసనము, భుజంగాసనము, మార్జాలాసనము, తాడాసనము. ఇవి కీళ్లను మెల్లగా కదిలించే ఆసనాలు.

అధిక బరువు వల్ల కీళ్లపై ఒత్తిడి పెరుగుతుంది. బరువు తగ్గితే నడుము, కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ ఉన్న ఆహారం తినాలి. బంగాళదుంపలు, చేపలు (సాల్మన్), వాల్‌నట్స్, అవకాడో తినాలి. అలొవెరా జ్యూస్, తులసి కషాయం, అల్లం టీ తాగాలి. కాల్షియం, విటమిన్ డి ఉండే పాల పదార్థాలు, డ్రై ఫ్రూట్స్‌, కోడిగుడ్డు ప‌చ్చ సొన తినాలి. హాట్ వాటర్ ప్యాక్ లేదా కోల్డ్ ప్యాక్ వేసుకోవ‌చ్చు. అయుర్వేద ఆయిల్ అయిన మాహానారాయణ తైలం, దశమూల తైలం వంటి వాటితో మ‌సాజ్ చేసుకోవ‌చ్చు.

which exercises we have to do to reduce knee pain

కీళ్లపై ఎక్కువ ఒత్తిడి పెరగకుండా తరచూ విశ్రాంతి ఇవ్వడం కూడా అవసరం. ఈ విధ‌మైన సూచ‌న‌లు పాటిస్తే కీళ్ల నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.