సన్నగా నాజూకుగా వున్న యువతిని చూసి ఆమె వలెనే తమ శరీరాన్ని కూడా షేప్ చేసేయాలని చాలామంది మహిళలు బరువు తగ్గించుకోటానికి వేగిర పడతారు. ఇక రెండో రోజునుంచే కేలరీలు తగ్గించే ఆహారం, వ్యాయామాలు అంటూ ఒక ప్రణాళిక మొదలు పెట్టేస్తే, వారి ఆరోగ్యం దెబ్బతిని డైటింగ్ వెనకపడే ప్రమాదముంది. కనుక సాధారణంగా డైటర్స్ చేసే తప్పులు కొన్ని పరిశీలించి మీ ప్రణాళికలు సరిచేసుకోండి. చాలా తక్కువ తింటారు – రోజూ హేపీగా ఐస్ క్రీమ్ లు, బేకరీ ఫుడ్లు తింటూ ఆనందించేవారు వెంటనే రుచి పచి లేని మాల్ట్, సూప్, సలాడ్ వంటివి తిని ఆకలి చంపుకుంటూంటారు.
ఏదో అడవిలోవుండే వారిలా ఆకులూ పండ్లూ వంటివి తినేస్తూంటారు. దీనికి పరిష్కారంగా అధిక పీచు వుండి, విటమిన్లు అధికంగా వుండి, తక్కువ కొవ్వు కల పదార్ధాలు తినండి. రుచికల దోస, కేరట్, మొలకలు, హెర్బల్ టీలు, తీపి లేని ఐస్ క్రీములు మొదలైనవి తింటే మీరు గతంలోని మీ ఆహారాలు కోల్పోయినట్లుండదు. వారాంతపు సెలవల్లో – వారాంతపు శెలవులు అంటే శని, ఆది వారాలు, రుచులు లేని డైటింగ్ చేయటం కష్టమే. కనుక ఈ రెండు రోజుల్లో మీరు కోరే తిండ్లు తినండి. భోజనం మితంగా చేయండి. నీరు – బరువు తగ్గాలంటూ రోజంతా నీరు అధికంగా తాగటం, నీరు ఎక్కువ వుండే ఆహారాలు తీసుకోవడం చేయకండి. దీనివలన, శరీరం పాలిపోయినట్లుండి ముఖ వర్చస్సు లేదా చర్మ కాంతి తగ్గి బలహీనమయ్యే ప్రమాదం వుంది.దీనికి పరిష్కారంగా పండ్లరసాలు, ఎనర్జీనిచ్చే ఇతర పానీయాలు కేలరీలు తక్కువ వుండేవిగా తాగండి. సోయా, బాదం పాలు వంటివి బాగుంటాయి.
బరువు – మీ పోషకాహార నిపుణుడు బరువు తరచుగా చూసుకోమని చెపుతాడు. స్కేలుపై చూస్తే బరువు తగ్గినప్పటికి, మీ శరీరం తగ్గినట్లు కనపడదు. దీనికిగాను నడక, పరుగు పెట్టటం, లేదా ఇతర ఫిట్ నెస్ వ్యాయామాలు చేయండి. ఫలితం నిదానమైనప్పటికి తప్పక ప్రయోజనం వుంటుంది. ఆహార ప్రణాళికల మార్పు – లావు తగ్గలేదనిపిస్తే ఆహారాలు మార్చటానికి ప్రయత్నిస్తారు. ఈ రకమైన మార్పులు, సురక్షితమూ, ఆరోగ్యమూ కాదు. కొద్ది రోజులు మీరు ఆచరించే ఆహార ప్రణాళిక కొనసాగాలని మార్పు తక్షణమే రాదని గుర్తించండి. ప్రతి పండు, ప్రతి కూరలో మేలు కలిగించే ఆహారం వుంటుంది. అన్ని రకాలు తీసుకోండి. అయితే పరిమితంగా ప్రతిరోజూ మీ ఆహారాన్ని ప్రణాళిక చేయండి. (రోజుకు 1500 కేలరీలు మాత్రమే).