అనేక గుండెసంబంధిత వ్యాధులున్నాయి. విటికి వివిధ రకాల లక్షణాలుంటాయి. డయాగ్నసిస్ మేరకు ప్రతి వ్యాధి కూడా చివరకు గుండెపోటు తెచ్చి మరణింపజేసేదే. అదే సమయంలో సరైన సమయంలో సరైన మందులతో గుండెపోటు రోగులను రక్షించవచ్చు. ఈ వ్యాధుల పేర్లు పరిశీలించండి. వాల్వులర్ హార్ట్ డిసీజ్ – ఈ గుండె సమస్యలో గుండె వాల్వులు తెరుచుకోవు. మూసుకొనిపోయి వుండి శరీరంలోని ఇతర భాగాలకు రక్తాన్ని తక్కువ చేస్తాయి.
ఇన్ ఫెక్టివ్ ఎండోకార్డిటిస్ – గుండెకు వచ్చే ఈ పరిస్ధితిలో గుండె వాల్వుకు బాక్టీరియా సోకుతుంది. ఈ వాల్వు లోకి బ్లడ్ రాదు కనుక ఈ భాగానికి బాక్టీరియా సోకితే దానితో పోరాటానికి శరీరాన్ని రక్షించే వైట్ బ్లడ్ సెల్స్అందులోకి రాలేవు. అక్కడి బాక్టీరియాతో పోరాడలేవు. యాంటీ బయాటిక్స్ వేసినా అవి కూడా రక్తం ద్వారానే వచ్చి వాటితో పోరాడాలి. కనుక గుండెలోని ఈ భాగానికి బాక్టీరియా సోకరాదు. రుమాటిక్ ఫీవర్ వచ్చిన వారికి ఈ సమస్య వచ్చే అవకాశం వుంది. కన్ జనిటాల్ హార్ట్ డిసీజ్ – దీనినే కన్ జనిటాల్ హార్ట్ డిసీజ్ అని కూడా అంటారు. కొత్తగా పుట్టిన బేబీ గుండె అది వుండవలసిన రీతిలో లేకుంటే దానిని కన్ జనిటాల్ హార్ట్ డిసీజ్ అంటారు. ఇది పుటుకలో వచ్చే సమస్య. శిశువులలో వచ్చే సమస్యలలో గుండె సంబంధిత సమస్యలు సాధారణమైపోయాయి. పసికందుల మరణాలు చాలావరకు గుండె సంబంధంగానే జరుగుతున్నాయి.
కరోనరీ హార్ట్ డిసీజ్ – దీనిలో గుండెకు రక్తం చేరవేసే రక్తనాళాలు సన్నబడిపోతాయి. సన్నబడటం వలన వాటిలో రక్తం ప్రవహించదు. గుండెకు అవసరమైన ఆక్సిజన్ అందదు. గుండెకు తగిన రక్తం, ఆక్సిజన్ అందక పోవటంతో గుండెపోటుకు దోవతీసే ప్రమాదం వుంది. ఏట్రియల్ మైక్సోమా – ఈ సమస్యలో గుండె గోడ అంటే ఏట్రియల్ సెప్టం….ఒక కేన్సర్ సంబంధితం కాని పుండు పెరుగుతుంది. సాధారణంగా ఇది గోడకు ఎడమ పక్క వస్తుంది. అది కనుక కుడి భాగానికి వచ్చినట్లయితే గుండె కొట్టుకోవడంలో తేడాలు వచ్చే అవకాశం వుంది.