అన్నీమూడ్ పాడుచేసే సమస్యలే! ఇంట్లో భార్యతో, బయట ట్రాఫిక్ జామ్ లతో, ఆఫీస్ లో బాస్ తో అన్ని చోట్లా సమస్యలను ఎదుర్కోవడమే. మరేం ఫరవాలేదు…మీ మూడ్ మంచిగా మారటానికి ఏం చేయాలో చూడండి! మంచి భావనలు కలిగించే ఆహారాలు తింటే అవి మీ మూడ్ మంచిగా వుంచుతాయి. అన్నీ ప్రయోగాత్మకంగా ఆచరించిచూసినవే. మరి మీరూ ఆచరించండి. బ్యాడ్ మూడ్ తెప్పించే ఆహారాలు – మూడ్ చెడుగా వుంటే, మనం కార్బోహైడ్రేట్లు, షుగర్ వంటివి తినేసి తాత్కాలికంగా సంతోష పడతాం. షుగర్ తినేటపుడు సంతోషంగా వున్నా తర్వాత మూడ్ మార్చేస్తుంది. మరి వెంటనే మరోమారు తీపి తినేయాలనుకుంటాం. అధిక కొవ్వు పెంచేస్తుంది వ్యాయామం చేయనివ్వదు. ఈ రకంగా మరింత మూడ్ దిగజార్చేస్తుంది.
మూడ్ పెంచే ఆహారాలు చూడండి – ప్రతిరోజూ కనీసం రెండైనా సరే ఇవి తినండి. చిలకడదుంపలు – వీటిలోని ఫోలేట్ మీ బ్లడ్ షుగర్ ఖచ్చితంగా వుండేలా చేసి ఆనందింపచేస్తుంది. బఠానీలు – ఆందోళన పోగొట్టి ప్రశాంతంగా వుంచే సెలీనియం అనే పదార్ధం ఇందులో వుంది. చేప నూనెలు – ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు వుండే నూనెలు మీ ఏకాగ్రత పెంచుతాయి. గుడ్లు – వీటిలో జింక్ అధికం. మెళకువగా వుండేలా చేసి శక్తినిస్తాయి షుగర్ నియంత్రిస్తాయి. పెరుగు – ప్రొటీన్లు, కాల్షియం అధికం. డిప్రెషన్, ఆందోళనలను తరిమేస్తుంది.
ఆకు కూరలు – ఐరన్ అధికం. అలసట పోగొడతాయి. మరి మానేయాల్సినవి మరికొన్ని చూడండి – బిస్కట్లు, కేకులు, చాక్లెట్లు, కూల్ డ్రింకులు వదలండి. తెల్లటి కార్బో హైడ్రేట్ ఆహారాలు తెల్లబియ్యం, తెల్ల బ్రెడ్ వంటివి తినకండి. కేలరీలు అధికమే కాక, మిమ్మల్ని డిప్రెస్ చేసే వైన్ జోలికి పోకండి. వారానికి కనీసం 45 నిమిషాల చొప్పున మూడు నుండి నాలుగు సార్లు చక్కటి వ్యాయామం, సైకిలింగ్, స్విమ్మింగ్ లేదా వేగంగా నడవటం వంటివి చేయండి. పై సూచనలు పాటిస్తే మీ మూడ్ ఎప్పటికపుడు మంచిగా వుండి మీరే కాక మీచుట్టుపక్కల వున్న వారు కూడా ఆనందిస్తారు.