వారాంతపు సెలవులు వస్తే, సాధారణంగా అధిక సమయం నిద్రిస్తూంటారు. మరి ఇంతసేపు నిద్రిస్తే ఎంతో హుషార్ గా చురుకుగా వుండాలి. కానీ కొంతమంది అధిక సమయం నిద్రిస్తే పూర్తిగా సోమరిగా, చురుకుదనం లేకుండా తలనొప్పిగా వుందని చెపుతూంటారు. నిద్ర చాల లేదని, మరింత విశ్రాంతి కావాలని కోరతారు. అయితే, నమ్మశక్యం కాని విషయం ఏమంటే, అధిక సమయం నిద్రించటమనేది చెడు కలిగిస్తుంది. నిద్రతో వచ్చే తలనొప్పులు గృహిణులకు, ఉద్యోగస్తులకు, విద్యార్ధులకు సాధారణంగా వుంటాయి.
ఈ తలనొప్పి కొద్దిపాటి హేంగోవర్ తలనొప్పిని పోలివుండి తేలికగా తగ్గేది కాదు. మరి వీటినివారణ ఎలా అనేది పరిశీలిద్దాం. ప్రధానంగా శరీరంలో వుండే సెరోటోనిన్ హార్మోన్ నిద్రలో ఎక్కువ, తక్కువలు అవతూంటుంది. రెమ్ (ర్యాపిడ్ ఐ మూవ్ మెంట్ స్లీప్) సైకిల్ కూడా తరచుగా మారటం దీనికి కారణం. ఈ రకమైన తలనొప్పి తగ్గించాలంటే… రోజంతా చురుకుగా, ఆరోగ్యంగా వుండటానికి ఒక వ్యక్తి 8 గంటలపాటు నిద్రిస్తే చాలు. పడక సమయం అంటూ ఒకటి పెట్టుకుంటే అధిక నిద్ర అనేది వుండదు.
మధ్యాహ్నం వేళ దీర్ఘంగా అంటే 2 లేదా 3 గంటల నిద్ర మానండి. కాఫీ, ఆల్కహాల్, మసాలా ఆహారాలు మధ్యాహ్నం వేళ నిద్రముందు తీసుకోకండి. సౌకర్యవంతమైన బెడ్, మంచి తలగడ వాడి నిద్రాభంగం లేకుండా చూసుకోండి. మీ బెడ్ పై ల్యాప్ టాప్ పని లేదా చిరుతిండ్లు తినడం వంటివి చేయకండి. ఆందోళనలు పక్కన పెట్టి హాయిగొలిపే మ్యూజిక్ వినండి. నిద్ర ముందు గట్టిగా శ్వాస పీల్చి వదలటం లేదా కొద్ది సమయం ధ్యానం వంటివి చేసి పడుకుంటే, ఈ రకమైన తలనొప్పి రాకుండా చేసుకోవచ్చు.