సాధారణంగా మనుషుల మధ్య శత్రుత్వం చూసాం. ఒకే జాతికి చెందిన జంతువుల మధ్య శత్రుత్వం చూసాం. కానీ అడవిలో ఉండే వివిధ జాతులకు చెందిన ముంగిస మరియు పాముల మధ్య శత్రుత్వం అనేది మనం చూస్తూనే ఉంటాం. మరి ఈ రెండింటి మధ్య శత్రుత్వం అనేది పూర్వకాలం నుంచే వస్తోంది. మరి ఈ రెండు జీవులకు ఎందుకు పడదు.. అనేది తెలుసుకుందాం..
సాధారణంగా ఈ రెండు జంతువుల మధ్య శత్రుత్వం ఏమిటంటే పాము ఎప్పుడైనా ముంగిస పిల్లలను వేటాడుతుంది. ఎందుకంటే వాటిని ఆహారంగా తినడం అంటే పాముకు చాలా ఇష్టం. ఈ కారణంగానే ముంగిస తన పిల్లలను రక్షించుకోవడానికి పాముని చూడగానే దాడి చేస్తుంది. ఈ క్రమంలోనే పాము విషం ముంగిసపై ప్రభావం చూపదా అనే అందరికీ ఆలోచన రావచ్చు.
కానీ ఇది నిజం కాదు పాము ముంగీసను కాటేస్తే దానిపై విష ప్రభావానికి కొంత సమయం పడుతుంది. ఎందుకంటే ముంగిస శరీరంలో ఎసీటైలకోలీన్ రిఫ్లెక్స్ ఉంటుంది. ఇది పాము విషం లోని న్యూరో టాక్సిన్ నుండి రక్షిస్తుంది. పాముల కంటే ముంగిసలు చాలా చురుకైనవి. అయినప్పటికీ అటువంటి పరిస్థితులలో అవి చాలా సందర్భాలలో పాము నుండి తనను తాను రక్షించుకుంటుంది. చాలా వరకు పాము కాటు వేసేలోగానే ముంగిస వెనక్కి వెళ్తుంది. చాలా వేగంగా ఈ ప్రతిచర్య ఉంటుంది. కనుకనే పాములు అంటే ముంగిసలకు భయం ఉండదు. ఇక ఇవి కూడా దాడి చేస్తాయి. అందుకే పాముకు మరియు ముంగిసకు అస్సలు పడదు.