బరువు తగ్గాలంటూ ఆహారాలు తగ్గించి తినేస్తూవుంటే శరీరానికి అధిక మొత్తంలో ప్రొటీన్లు అందించాల్సిన అవసరం వుంటుంది. అందుకుగాను సాధారణంగా మల్టీ విటమిన్ టాబ్లెట్ మిల్క్ షేక్, మిల్క్ బార్, సూప్, డెజర్ట్స్ రెడీమెడ్ పండ్లరసాలు, హార్లిక్స్, బూస్ట్ అంటూ ప్రతివారు కొన్నిపానీయాలు టాబ్లెట్ల రూపంలో ఈ ప్రొటీన్లను, విటమిన్లను అందిస్తూనే వుంటారు. వీటివలన కలిగే ప్రయోజనాలు పరిశీలించండి.
క్రమం తప్పకుండా వాడే ఈ ప్రొటీన్ పోషక ఆహారాలు భోజనానికి భోజనానికి మధ్య మీ ఆకలిని అరికడతాయి. పనులతో బిజీగా వుండేవారికి వేసుకోవడం, తినడం లేదా తాగడం ఎంతో తేలిక. చిన్నమొత్తాలలో తీసుకుంటాం కనుక ఖచ్చితమైన పోషణ అందుతుంది. శరీరం కొవ్వును కరిగించేలా చేసి ఆరోగ్యకరంగా బరువు తగ్గిస్తుంది.
కేలరీలు నియంత్రించేటపుడు చాలినంత ప్రొటీన్ సరఫరా చేస్తాయి. బరువు నియంత్రించవచ్చు. అధిక కేలరీలు వున్న అధిక కొవ్వుకల స్వీట్లను తగ్గిస్తాయి. కష్టపడి సమయం వెచ్చించి ఆహారం తయారు చేయకుండా కొనుగోలుతో సరిపెట్టవచ్చు. డైట్, పోషకాహార నిపుణతలు మొదలైన వాటి ఆహారంగా సరైన పాళ్ళలో లభిస్తాయి. రోజువారీ దినచర్యకు అవసరమైన శారీరక శ్రమకు శక్తినందిస్తాయి.