గుండె రక్తనాళాలు ఆరోగ్యవంతంగా వుండాలంటే మనం తినే ఆహారం సరైనదేనా అనేది ఎప్పటికపుడు పరిశీలించుకోవాలి. ఆహారమే కాక, మన శరీర బరువు, పొగతాగే అలవాటు, రక్తపోటు, వ్యాయామం, ఒత్తిడి మొదలైనవి కూడా చెక్ చేసుకోవాలి. వీటితో పాటు ఆహారంలో కొవ్వు తగ్గించటానికి గాను కొన్ని పద్ధతులు పాటించాలి.
ఆహారాన్ని అధికంగా వేయించి తినటం చేయరాదు. మాంసాహారం తక్కువగా తినాలి. గింజధాన్యాలు, కాయ ధాన్యాలు, కూరగాయలు అధికంగా తినాలి. మాంసాహార ఉత్పత్తులైన సాసేజస్, బీఫ్ బర్గర్స్, వంటివి మానివేయాలి. తక్కువ కొవ్వు వుండే ఆహారాలు భుజించాలి. ఎర్రటి మాంసం కేంటే కూడా చికెన్, టర్కీ, చేప మొదలైనవి తరచుగా తినాలి.
అయితే వీటిలో కూడా కొవ్వు వుంటుందని గ్రహించాలి. జొన్నపిండిని వెన్నతీసిన పాలు లేదా కూరగాయలతో కలిపి తక్కువ కొవ్వుకల ఆహారంగా తినాలి. వెన్న వున్న పాలుకంటే, వెన్న తీసిన పాలు గుండె జబ్బు రోగులకు మేలు చేస్తాయి. అయితే ఇవి 5 సంవత్సరాల వయసు లోపు పిల్లలకు ఇవ్వరాదు.