శరీరం ఆరోగ్యంగా వుండాలంటే రక్తంలోని కణాల సంఖ్య లేదా బ్లడ్ కౌంట్ ప్రధానమైంది. బ్లడ్ కౌంట్ తక్కువైతే ఎనీమియా అంటే రక్తహీనత ఏర్పడే ప్రమాదం వుంది. బ్లడ్ కౌంట్ తగ్గితే సాధారణంగా మందులు, టానిక్ లు వాడుతూంటాం. అయితే బ్లడ్ కౌంట్ పెరిగేందుకు సహజ ఆహారాలు ఏమి తీసుకోవాలో పరిశీలించండి. బీట్ రూట్ – దీనిలో ఐరన్, ప్రొటీన్ వుంటాయి. రక్తాన్ని శుభ్రపరుస్తుంది. బీట్ రూట్ ఆకులలో విటమిన్ ఎ అధికం. విటమిన్ సి కూడా పుష్కలంగా వుంటుంది.
పచ్చని ఆకు కూరలు – బచ్చలి, బ్రక్కోలి, తోటకూర, గోంగూర, కేబేజి, కాలీ ఫ్లవర్, చిలకడ దుంప కూడా రక్తంలోని కణాల సంఖ్య పెరగటానికి ఉపయోగిస్తాయి. జీర్ణక్రియ బాగుంటుంది. బరువును తగ్గించుకుంటూ కూడా బ్లడ్ కౌంట్ మెరుగుపరచుకోవచ్చు. ఐరన్ – శరీరానికి ఐరన్ అత్యవసరం. ఎముకలు గట్టిపడేస్తుంది. ఆక్సిజన్ సరఫరా చేస్తుంది. ఐరన్ లోపించినా రక్తహీనత కలుగుతుంది.
మెంతులు, ఖర్జూరం, బాదం, బంగాళదుంప, అంజీర్ మొదలైనవి తినాలి. బాదంపప్పులు – ఐరన్ పుష్కలంగా వుంటుంది. ప్రతిరోజూ ఒక ఔన్సు తీసుకుంటే రోజులో అవసరమైన 6 శాతం ఐరన్ ఇస్తుంది. పండ్లు – రక్తహీనత అంటే పండ్లు, ఆకు కూరలు తినమంటారు. వీటితో బ్లడ్ కౌంట్ బాగా పెంచుకోవచ్చు. పుచ్చకాయ, ఆపిల్స్, ద్రాక్ష, ఎండు ద్రాక్ష మొదలైనవి తినాలి. ఈ ఆహారాలు తింటే బ్లడ్ కౌంట్ మెరుగవుతుంది రక్తప్రసరణ బాగా జరుగుతుంది.