ఊబకాయం వున్న ప్రతివారికి సహజంగా శరీరంలో కొన్ని అదనపు కేలరీలు వుంటాయి. వీటిని మీరు చెమట పట్టకుండా సులభంగా ఖర్చు చేయాలంటే కొన్ని మార్గాలు చూడండి. విటమిన్ డి కొరత వుంటే, బరువు తగ్గటం దీర్ఘకాలం తీసుకుంటుందని చెపుతారు. కనుక మీలో విటమిన్ డి కొరత లేకుండా చూడండి. రోజుకు కనీసం 2,000 మిల్లిగ్రాముల విటమిన్ డి కావాలి. రాత్రులందు 4 గంటలకంటే తక్కువగా ఎక్కువసార్లు పడుకోవటం చేస్తే, మీ మెటబాలిజం క్రియ తగ్గుతుంది. కనుక 7 నుండి 9 గంటల సమయం గాఢంగా నిద్రిస్తే అది అధిక కేలరీలు వ్యయం చేసి కావలసిన రీతిలో వుంచుతుంది.
ఇంటిపని చేస్తూ వుంటే, కేలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఇంటి శుభ్రత, గిన్నెలు శుభ్రం చేయటం, మొదలైన పనులు వేరేవారితో కాకుండా మీరే చేసుకోండి. ఎల్లపుడు ఆనందంగా వుండండి. అవసరమైనపుడు హాయిగా నవ్వండి. అది మీ మనసుకి చాలా మంచిది. ప్రతిరోజూ పది లేదా పదిహేను నిమిషాల హాయి అయిన నవ్వు సుమారు 50 కేలరీలు వ్యయం చేస్తుందట.
ప్రతిరోజు ఎనిమిది గ్లాసుల నీరు తాగితే అది మీలోని జీవప్రక్రియ రేటును 30 శాతం పెంచుతుంది. కనుక తగిన నీరు శరీరానికి అందించండి. మెల్లగా నడకలు చేసేకంటే వేగంగా నడుస్తూ కొంత శక్తి వ్యయం చేయండి. గట్టిగా నడవటం, అటూ ఇటూ బాగా కదులుతూండటం, విశ్రాంతిలేకుండా తిరగటం వంటివి ప్రతిరోజూ కనీసం 350 కేలరీలు ఖర్చు చేస్తాయి. కనుక వీటిని ఆచరించండి.