Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home ఆరోగ్య‌క‌ర‌మైన రెసిపిలు ఆహారం

Walnuts Laddu : ఈ లడ్డూను రోజుకు ఒక్కటి తినండి చాలు.. మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి, రక్తం బాగా తయారవుతుంది..!

Editor by Editor
February 3, 2022
in ఆహారం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Walnuts Laddu : మనం ఆరోగ్యంగా ఉండాలంటే.. రోజూ పోషకాలు కలిగిన ఆహారాలను తీసుకోవాలి. కానీ ప్రస్తుతం ఉరుకుల పరుగుల బిజీ జీవితంలో చాలా మంది రోజూ జంక్‌ ఫుడ్‌ను ఎక్కువగా తింటున్నారు. పోషకాలు ఉండే ఆహారాలను తినడం లేదు. దీంతో అనేక సమస్యలు వస్తున్నాయి. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు పోషకాహారం తీసుకోకపోవడం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. అయితే కింద చెప్పిన విధంగా లడ్డూలను తయారు చేసుకుని రోజుకు ఒకటి తింటే చాలు. పోషకాహార లోపం అన్న సమస్యే ఉండదు. పైగా అనేక ప్రయోజనాలు కలుగుతాయి. మరి ఆ లడ్డూలను ఎలా తయారు చేయాలంటే..

eat one Walnuts Laddu daily for these amazing health benefits
Walnuts Laddu

150 గ్రాముల నువ్వులు, 150 గ్రాముల పల్లీలు, 250 గ్రాముల వాల్‌ నట్స్‌ తీసుకోవాలి. వాల్‌ నట్స్‌ను మిక్సీలో వేసి మెత్తగా కాకుండా పొడిగా పట్టుకోవాలి. అలాగే నువ్వులు, పల్లీలను పెనంపై వేసి వేయించాలి. తరువాత నువ్వులను కూడా పొడిలా చేసుకోవాలి. అనంతరం పల్లీలను పొట్టు తీసి వాటిని కూడా పొడిగా పట్టుకోవాలి. అనంతరం ఈ మూడు రకాల పొడిలను కలపాలి. ఆ మిశ్రమంలో కొద్దిగా నెయ్యి కూడా వేయాలి. ఆ తరువాత ఆ మిశ్రమంలోకి సరిపోయేట్లు బెల్లం పాకంను సిద్ధం చేసుకోవాలి. అనంతరం అందులో ఆ మిశ్రమాన్ని వేసి కలుపుతూ లడ్డూల్లా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న లడ్డూలను రోజుకు ఒక్కటి తింటే చాలు.. అనేక లాభాలు కలుగుతాయి.

పైన చెప్పిన విధంగా లడ్డూలను తయారు చేసుకుని రోజుకు ఒక్కటి తింటే.. చిన్నారుల్లో మెదడు చురుగ్గా మారుతుంది. బద్దకం, సోమరితనం పోతాయి. చురుగ్గా మారుతారు. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. చదువుల్లో రాణిస్తారు. తెలివితేటలు పెరుగుతాయి. వాల్‌ నట్స్‌, నువ్వులు, పల్లీల్లో ఉండే పోషకాలు చిన్నారులకు ఎంతగానో మేలు చేస్తాయి.

ఈ లడ్డూలను వృద్ధులు తింటే కీళ్ల నొప్పులు ఉండవు. కీళ్ల నొప్పులు, వాపులు తగ్గిపోతాయి. రక్తం తక్కువగా ఉన్నవారు ఈ లడ్డూలను తింటుంటే కొద్ది రోజుల్లోనే రక్తం బాగా తయారవుతుంది. రక్తహీనత సమస్య తగ్గుతుంది.

రోజూ శారీరక శ్రమ, వ్యాయామం ఎక్కువగా చేసేవారు ఈ లడ్డూలను తింటే అమితమైన శక్తి లభిస్తుంది. ఉత్సాహంగా మారుతారు. నీరసంగా, నిస్సత్తువగా ఉండేవారు కూడా వీటిని తింటే శక్తి వస్తుంది. చురుగ్గా ఉంటారు.

సీజన్లు మారినప్పుడల్లా సహజంగానే దగ్గు, జలుబు వస్తుంటాయి. కానీ ఈ లడ్డూలను తింటే రోగ నిరోధక శక్తి పెరిగి ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు.

ఈ లడ్డూలను తినడం వల్ల వాటిల్లో ఉండే కాల్షియం ఎముకలకు బలాన్నిస్తుంది. ఎముకలు దృఢంగా మారుతాయి. బాడీ పెయిన్స్‌ ఉన్నవారు ఈ లడ్డూలను తింటే ఆ నొప్పుల నుంచి బయట పడవచ్చు. ఇలా ఈ లడ్డూలతో ఎన్నో లాభాలు కలుగుతాయి.

Tags: Walnuts Ladduవాల్ న‌ట్స్ ల‌డ్డూ
Previous Post

Thotakura : పురుషుల సమస్యలను పోగొట్టే తోటకూర.. దీంట్లోని ఆరోగ్య రహస్యాలు ఇవే..!

Next Post

Kanuga Chettu : మన చుట్టూ పరిసరాల్లో ఉండే చెట్టు ఇది.. దీంట్లో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు ఇవే..!

Related Posts

హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

September 26, 2025
ఆధ్యాత్మికం

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

September 26, 2025
ఆధ్యాత్మికం

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

September 25, 2025
వినోదం

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

September 25, 2025
ఆధ్యాత్మికం

మీ ఇంట్లోకి ఇలాంటి పక్షులు వస్తున్నాయా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

September 24, 2025
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

September 23, 2025

POPULAR POSTS

food

Paneer Mushroom Dum Biryani : ప‌నీర్‌, మ‌ష్రూమ్ ద‌మ్ బిర్యానీ.. ఇలా చేసి చూడండి.. ఎంతో బాగుంటుంది..!

by D
March 12, 2023

...

Read more
పోష‌కాహారం

పోషకాల గ‌ని న‌లుపు రంగు కిస్మిస్ పండ్లు.. వీటిని తింటే ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయంటే..?

by Admin
July 6, 2021

...

Read more
home gardening

Betel Leaves Plant : త‌మ‌ల‌పాకు మొక్క‌కు వీటిని వేయండి.. ఆకులు బాగా వ‌చ్చి మొక్క ఏపుగా పెరుగుతుంది..!

by Editor
July 12, 2023

...

Read more
హెల్త్ టిప్స్

మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య ఉందా.. అయితే ఈ పండ్ల‌ను తినండి..

by Admin
August 4, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Shiva Darshan : నందికొమ్ముల నుంచి శివ‌లింగాన్ని ద‌ర్శిస్తారు.. ఎందుకంటే..?

by Admin
November 26, 2024

...

Read more
jobs education

బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోవచ్చు..!

by Peddinti Sravya
October 21, 2024

...

Read more
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.