Curry Leaves For Dandruff : చుండ్రు.. ప్రస్తుత కాలంలో మనల్ని వేధించే జుట్టు సంబంధిత సమస్యల్లో ఇది ఒకటి. చలికాలంలో ఈ సమస్య మనల్ని మరింత ఇబ్బంది పెడుతుంది. చుండ్రు సమస్య రావడానికి అనేక కారణాలు ఉంటాయి. జుట్టును సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం, వాతావరణ కాలుష్యం, తలపై ఉండే చర్మం పొడిబారడం వంటి వాటిని చుండ్రు సమస్య తలెత్తడానికి అనేక కారణాలు ఉంటాయి. ఈ చుండ్రు కారణంగా దురద, జుట్టు రాలడం వంటి ఇతర సమస్యలు తలెత్తుతాయి. చుండ్రును నివారించడానికి మార్కెట్ లో అనేక రకాల షాంపులు మనకు అందుబాటులో ఉన్నాయి. వీటిని వాడినప్పటికి ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడుతున్న వారు మనలో చాలా మంది ఉండే ఉంటారు.
మనల్ని ఎంతగానో ఇబ్బంది పెడుతున్న ఆ చుండ్రును ఒక చిట్కాను ఉపయోగించి నివారించుకోవచ్చు. చుండ్రును నివారించే ఇంటి చిట్కాను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చుండ్రును తొలగించడంలో మనకు కరివేపాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కరివేపాకులో జుట్టు పోషణకు అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉన్నాయి. జుట్టు కుదుళ్లకు కావల్సిన పోషకాలను అందించి జుట్టు కుదుళ్లను ధృడంగా చేయడంలో కరివేపాకు మనకు ఎంతో దోహదపడుతుంది. కరివేపాకులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చుండ్రును నివారించడంలో ఎంతగానో సహాయపడతాయి. కరివేపాకును వాడడం వల్ల చుండ్రు సమస్యతో పాటు ఇతర జుట్టు సంబంధింత సమస్యల నుండి బయట కూడా బయటపడవచ్చు.

అలాగే చుండ్రును నివారించడంలో మనకు నిమ్మకాయ కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. చుండ్రు సమస్యను తగ్గించి జుట్టు ఆరోగ్యంగా ఉంచడంలో ఈ నిమ్మకాయ మనకు ఎంతో దోహదపడుతుంది. కరివేపాకును, నిమ్మకాయను ఉపయోగించి చుండ్రు సమస్యను నివారించే చిట్కాను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీళ్లును తీసుకోవాలి. తరువాత ఇందులో గుప్పెడు కరివేపాకు ఆకులను వేసి చిన్న మంటపై 10 నిమిషాల పాటు మరిగించాలి. తరువాత ఈ నీటిని వడకట్టి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఈనీటిలో నిమ్మకాయ రసాన్ని పిండి కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న నీటిని తలకు, జుట్టుకు బాగా పట్టించాలి.
తరువాత కుదుళ్లలోకి ఇంకేలా మర్దనా చేసుకోవాలి. ఇలా కరివేపాకు నీటిని జుట్టుకు పట్టించిన తరువాత గంట పాటు అలాగే ఉంచాలి. గంట తరువాత ఆర్గానిక్ షాంపుతో తలస్నానం చేయాలి. ఇలా వారినికి రెండు నుండి మూడు సార్లు చేయడం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది. దీనిని వాడిన రెండు వారాల్లోనే చుండ్రు సమస్య తగ్గడాన్ని అలాగే జుట్టు పెరుగుదలలో వచ్చిన మార్పును మనం గమనించవచ్చు. ఈ చిట్కాను వాడడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాల బారిన పడకుండా చుండ్రు సమస్య నుండి మనం శాశ్వత పరిష్కారాన్ని పొందవచ్చు.