Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home చిట్కాలు

Acidity : కడుపులో మంటగా ఉందా ? ఈ చిట్కాలను పాటించి చూడండి.. చల్లబడుతుంది..!

Admin by Admin
February 16, 2022
in చిట్కాలు, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Acidity : కడుపులో మంట.. దీన్నే అసిడిటీ అంటారు. ఎలా పిలిచినా సరే ఇది వచ్చిందంటే ఒక పట్టాన తగ్గదు. అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కడుపులో మంట ఉంటే ఏ పని చేయబుద్దికాదు. ఏమీ తినలేం. తీవ్ర అవస్థలు పడాల్సి వస్తుంది. అయితే అసిడిటీ సమస్య వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి.

follow these amazing remedies for Acidity
Acidity

వేళకు భోజనం చేయకపోవడం.. రాత్రి పూట బాగా ఆలస్యంగా తినడం.. మద్యం ఎక్కువగా సేవించడం.. పొగ తాగడం.. కారం, మసాలాలు అధికంగా ఉండే ఆహారాలను తినడం.. టీ, కాఫీలను అధికంగా తాగడం.. వంటి పలు కారణాల వల్ల అసిడిటీ వస్తుంటుంది. దీన్ని కింద తెలిపిన చిట్కాలను పాటించి సులభంగా తగ్గించుకోవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. కడుపులో మంట మరీ ఎక్కువగా ఉన్నవారికి పుదీనా ఆకులు ఎంతో మేలు చేస్తాయి. పుదీనా ఆకులను నాలుగైదు తీసుకుని వాటిని ఉదయాన్నే పరగడుపునే అలాగే బాగా నమిలి మింగాలి. పుదీనాలో సహజసిద్ధమైన అంటాసిడ్‌ గుణాలు ఉంటాయి. ఇవి కడుపులో మంటను తగ్గిస్తాయి. రోజూ ఇలా తింటుంటే దెబ్బకు అసిడిటీ తగ్గుతుంది.

2. భోజనం చేసే ముందు ఒక గ్లాస్‌ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగాలి. దీంతో అసిడిటీ తగ్గుతుంది. నిమ్మరసం అంటే యాసిడ్‌ స్వభావం ఉన్నది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. అది మన జీర్ణాశయంలోకి వెళ్లినప్పుడు వేరే రూపంలోకి మారుతుంది. కనుక దాన్ని నిర్భయంగా తీసుకోవచ్చు.

3. అరటి పండు సహజసిద్ధమైన అంటాసిడ్‌లా పనిచేస్తుంది. భోజనం అనంతరం రెండు గంటల తరువాత ఒక అరటి పండును తినాలి. దీంతో కడుపులో మంట తగ్గిపోతుంది.

4. చల్లని పాలలో ఒక టీస్పూన్‌ తేనె కలిపి తాగాలి. దీని వల్ల కూడా అసిడిటీ నుంచి బయట పడవచ్చు.

5. భోజనం అనంతరం రెండు లవంగాలను నోట్లో వేసుకుని బాగా నమిలి మింగాలి. అనంతరం నీళ్లు తాగాలి. ఇలా చేస్తుంటే కడుపులో మంట తగ్గిపోతుంది.

Tags: acidityఅసిడిటీక‌డుపులో మంట‌
Previous Post

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. పండుగ చేసుకునే విష‌యం..!

Next Post

Naatu Kodi : వారెవ్వా.. నాటుకోళ్ల‌కు భ‌లే డిమాండ్ ఉందే.. ఎంత రేటైనా సరే కొంటున్నారు..!

Related Posts

హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

September 26, 2025
ఆధ్యాత్మికం

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

September 26, 2025
ఆధ్యాత్మికం

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

September 25, 2025
వినోదం

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

September 25, 2025
ఆధ్యాత్మికం

మీ ఇంట్లోకి ఇలాంటి పక్షులు వస్తున్నాయా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

September 24, 2025
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

September 23, 2025

POPULAR POSTS

No Content Available
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.