Constipation : ప్రస్తుత తరుణంలో చాలా మంది మలబద్దకం సమస్యతో బాధపడుతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. థైరాయిడ్, అధిక బరువు, మాంసాహారం ఎక్కువగా తినడం, డయాబెటిస్, నిత్యం అనేక గంటలపాటు కూర్చుని ఉండడం.. వంటి అనేక కారణాల వల్ల మలబద్దకం సమస్య వస్తోంది. అయితే ఖర్జూరం, పాలను రోజూ తీసుకుంటే మలబద్దకం సమస్య నుంచి బయట పడవచ్చు. అందుకు ఇలా చేయాల్సి ఉంటుంది.

రాత్రి పూట రెండు ఖర్జూరాలను తినాలి. తరువాత ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలను తాగాలి. ఇలా వరుసగా మూడు రోజుల పాటు చేస్తే చాలు.. మలబద్దకం సమస్య ఇట్టే తగ్గిపోతుంది. అయితే ఈ సమస్య ఉన్నవారు. రోజూ కచ్చితంగా 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. మాంసాహారం తినడం తగ్గించాలి. బరువు ఉన్నవారు బరువు తగ్గే ప్రయత్నం చేయాలి.

ఖర్జూరాల్లో సహజసిద్ధమైన లాక్సేటివ్ గుణాలు ఉంటాయి. అందువల్ల వాటిని తిని పాలు తాగితే మరుసటి రోజు ఉదయం సుఖ విరేచనం అవుతుంది. దీంతో జీర్ణ సమస్యలు కూడా ఉండవు. ఖర్జూరాలు జీర్ణ సమస్యలను తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. అజీర్ణాన్ని తగ్గిస్తాయి. ఆకలిని కూడా పెంచుతాయి. నీరసం, నిస్సత్తువగా ఉండేవారు కూడా ఇలా చేయవచ్చు. దీంతో శక్తి లభిస్తుంది. ఉత్సాహంగా మారుతారు. చురుగ్గా పనిచేస్తారు. ఎంత పనిచేసినా అలసట అంత త్వరగా రాదు.











