Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home చిట్కాలు

Papaya Leaves Juice For Hair : బొప్పాయి ఆకుల‌తో ఇలా చేస్తే చాలు.. తెల్ల జుట్టు న‌ల్ల‌గా మారుతుంది..

D by D
January 27, 2023
in చిట్కాలు, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Papaya Leaves Juice For Hair : మ‌న‌లో చాలా మంది తెల్ల జుట్టు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మస్య బారిన ప‌డుతూ ఉంటారు. పోష‌కాహార లోపం, వాతావ‌ర‌ణ కాలుష్యం, ఒత్తిడి, ఆందోళ‌న‌, ర‌సాయ‌నాలు క‌లిగిన షాంపుల‌ను వాడ‌డం, థైరాయిడ్, విట‌మిన్ బి 12 లోపం వంటి అనేక కార‌ణాల చేత తెల్ల జుట్టు స‌మ‌స్య త‌లెత్తుతుంది. చాలా మంది తెల్ల జుట్టును న‌ల్ల‌గా మార్చుకోవ‌డానికి హెయిర్ డై ల‌ను, షాంపుల‌ను వాడుతూ ఉంటారు. వీటిని వాడ‌డం వ‌ల్ల జుట్టు న‌ల్ల‌బ‌డిన‌ప్ప‌టికి జుట్టు రాల‌డం, జుట్టు పొడి బార‌డం, అల‌ర్జీ, వివిధ ర‌కాల చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌లు త‌లెత్తూ ఉంటాయి. హెయిర్ డై ల‌నే కాకుండా ఇంటి చిట్కాల‌ను ఉప‌యోగించి కూడా మ‌నం ఈ సమ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు.

అయితే కొన్ని ర‌కాల చిట్కాల‌ను పాటించ‌డం చాలా క‌ష్టంగా ఉంటుంది. వాటిని త‌యారు చేయ‌డం కూడా శ్ర‌మ‌తో కూడుకున్న ప‌ని. ఎటువంటి శ్ర‌మ లేకుండా చాలా సుల‌భంగా చ‌క్క‌టి చిట్కాను త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల మ‌నం తెల్ల జుట్టును న‌ల్ల‌గా మార్చుకోవ‌చ్చు. తెల్ల జుట్టును న‌ల్ల‌గా మార్చే చిట్కా ఏమిటి… దీనిని ఎలా త‌యారు చేసుకోవాలి..త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి… అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి గానూ మ‌నం రెండు బొప్పాయి చెట్టు ఆకుల‌ను, 5 బిర్యానీ ఆకుల‌ను, 5 ల‌వంగాల‌ను, ఒక టీ స్పూన్ కాఫీ పౌడ‌ర్ ను, త‌గినంత హెన్నా పౌడ‌ర్ ను ఉప‌యోగించాల్సి ఉంటుంది. ముందుగా బొప్పాయి ఆకుల‌ను శుభ్రంగా క‌డ‌గాలి.

Papaya Leaves Juice For Hair how to make it and use
Papaya Leaves Juice For Hair

త‌రువాత వాటిని ముక్క‌లుగా చేసి ఒక జార్ లోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో అర గ్లాస్ నీళ్లు పోసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని వ‌డ‌క‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత మ‌రో గిన్నెలోకి ఒక గ్లాస్ నీళ్లు, బిర్యానీ ఆకులు, ల‌వంగాలు, కాఫీ పౌడ‌ర్ వేసి మ‌రిగించాలి. వీటిని అర గ్లాస్ అయ్యే వ‌ర‌కు మ‌రిగించి వ‌డ‌క‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇనుప క‌ళాయి లేదా గిన్నెను తీసుకుని అందులో జుట్టుకు త‌గినంత హెన్నా పౌడ‌ర్ ను తీసుకోవాలి. త‌రువాత ఇందులో బొప్పాయి ఆకుల ర‌సం, అలాగే బిర్యానీ ఆకుల డికాష‌న్ ను వేస్తూ పేస్ట్ లా క‌లుపుకోవాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి 5 గంట‌ల పాటు అలాగే ఉంచాలి. 5 గంట‌ల త‌రువాత ఈ పేస్ట్ ను మ‌రోసారి క‌లుపుకుని జుట్టు కుదుళ్ల నుండి జుట్టు చివ‌రి వ‌ర‌కు ప‌ట్టించాలి.

దీనిని ఒక గంట పాటు జుట్టుకు అలాగే ఉంచి ఆరిన త‌రువాత త‌ల‌స్నానం చేయాలి. ముందుగా షాంపు వాడ‌కుండా త‌ల‌స్నానం చేయాలి. మ‌రుస‌టి షాంపుతో త‌ల‌స్నానం చేయాలి. ఈ విధంగా ఈ చిట్కాను నెల‌కు రెండు సార్లు వాడ‌డం వ‌ల్ల తెల్ల జుట్టు న‌ల్ల‌గా మారుతుంది. అలాగే జుట్టు న‌ల్ల‌గా, ఒత్తుగా, ధృడంగా పెరుగుతుంది. అంతేకాకుండా జుట్టు రాల‌డం, చుండ్రు, జుట్టు చివ‌ర్లు చిట్ల‌డం వంటి స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయి. తెల్ల‌జుట్టు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు.

Tags: Papaya Leaves Juice For Hair
Previous Post

Dondakaya Curry : దొండ‌కాయ కూర‌ను ఎంతో సుల‌భంగా ఇలా చేయ‌వ‌చ్చు.. రుచిగా ఉంటుంది..

Next Post

Tomato Capsicum Pachadi : ట‌మాటా క్యాప్సికం ప‌చ్చ‌డి త‌యారీ ఇలా.. ఎంతో టేస్టీగా ఉంటుంది..

Related Posts

హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

September 26, 2025
ఆధ్యాత్మికం

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

September 26, 2025
ఆధ్యాత్మికం

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

September 25, 2025
వినోదం

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

September 25, 2025
ఆధ్యాత్మికం

మీ ఇంట్లోకి ఇలాంటి పక్షులు వస్తున్నాయా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

September 24, 2025
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

September 23, 2025

POPULAR POSTS

చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
food

Paneer Mushroom Dum Biryani : ప‌నీర్‌, మ‌ష్రూమ్ ద‌మ్ బిర్యానీ.. ఇలా చేసి చూడండి.. ఎంతో బాగుంటుంది..!

by D
March 12, 2023

...

Read more
హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
September 26, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Shiva Darshan : నందికొమ్ముల నుంచి శివ‌లింగాన్ని ద‌ర్శిస్తారు.. ఎందుకంటే..?

by Admin
November 26, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

by Admin
September 23, 2025

...

Read more
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.