Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home food

Dondakaya Curry : దొండ‌కాయ కూర‌ను ఎంతో సుల‌భంగా ఇలా చేయ‌వ‌చ్చు.. రుచిగా ఉంటుంది..

D by D
January 27, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Dondakaya Curry : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో దొండ‌కాయ‌లు కూడా ఒక‌టి. ఇత‌ర కూర‌గాయ‌ల వ‌లె ఇవి కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దొండ‌కాయ‌ల‌తో చేసిన కూర‌ల‌ను తిన‌డం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. దొండ‌కాయ‌ల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే కూర‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ కూర‌ను త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. బ్యాచిలర్స్, వంట‌రాని వారు ఎవ‌రైనా దీనిని సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే దొండ‌కాయ‌ల‌తో రుచిగా, సుల‌భంగా కూర‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

దొండ‌కాయ క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

దొండ‌కాయ‌లు – పావు కిలో, పొడుగ్గా త‌రిగిన ఉల్లిపాయ – 1, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, ట‌మాటాలు – 4, పెరుగు – 2 టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – అర టీ స్పూన్, ప‌సుపు – అర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, నూనె – 2 టేబుల్ స్పూన్స్, క‌సూరి మెంతి – ఒక టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, క‌రివేపాకు – ఒక రెబ్బ‌.

Dondakaya Curry recipe in telugu make in this way
Dondakaya Curry

దొండ‌కాయ క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా దొండ‌కాయ‌ల‌ను గుత్తి వంకాయ‌ల వ‌లె నాలుగు ప‌చ్చాలుగా క‌ట్ చేసుకుని ప‌క్క‌కు ఉంచాలి. అలాగే ట‌మాటాలను జార్ లో వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని ప‌క్క‌కు ఉంచాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక క‌ట్ చేసుకున్న దొండ‌కాయ‌ల‌ను వేసి వేయించాలి. దొండ‌కాయ‌లు పూర్తిగా వేగిన త‌రువాత వాటిని ప్లేట్ లోకి తీసుకుని ప‌క్క‌కు ఉంచాలి. ఇప్పుడు అదే నూనె ఒక టీ స్పూన్ తాళింపు దినుసులు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. త‌రువాత ట‌మాట ఫ్యూరీ వేసి నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించాలి. ఇలా వేయించిన త‌రువాత పెరుగు, ప‌సుపు, ఉప్పు, కారం, ధ‌నియాల పొడి, గ‌రం మ‌సాలా, జీల‌క‌ర్ర పొడి వేసి రెండు నిమిషాల పాటు క‌లుపుతూ వేయించాలి.

త‌రువాత వేయించిన దొండ‌కాయ‌లు వేసి క‌ల‌పాలి. త‌రువాత ఒక గ్లాస్ నీళ్లు పోసి క‌ల‌పాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా ఉడికించిన త‌రువాత కసూరి మెంతి, కొత్తిమీర వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో రెండు నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే దొండ‌కాయ క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, పుల్కా వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. దొండ‌కాయ‌ల‌తో త‌ర‌చూ చేసే వంట‌కాల‌తో పాటు ఇలా కూడా క‌ర్రీని త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Dondakaya Curry
Previous Post

Badam Halwa : స్వీట్ షాపుల్లో ల‌భించే విధంగా బాదం హ‌ల్వాను ఎంతో రుచిగా ఇలా చేసుకోవ‌చ్చు..!

Next Post

Papaya Leaves Juice For Hair : బొప్పాయి ఆకుల‌తో ఇలా చేస్తే చాలు.. తెల్ల జుట్టు న‌ల్ల‌గా మారుతుంది..

Related Posts

హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

September 26, 2025
ఆధ్యాత్మికం

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

September 26, 2025
ఆధ్యాత్మికం

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

September 25, 2025
వినోదం

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

September 25, 2025
ఆధ్యాత్మికం

మీ ఇంట్లోకి ఇలాంటి పక్షులు వస్తున్నాయా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

September 24, 2025
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

September 23, 2025

POPULAR POSTS

చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
food

Paneer Mushroom Dum Biryani : ప‌నీర్‌, మ‌ష్రూమ్ ద‌మ్ బిర్యానీ.. ఇలా చేసి చూడండి.. ఎంతో బాగుంటుంది..!

by D
March 12, 2023

...

Read more
హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
September 26, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Shiva Darshan : నందికొమ్ముల నుంచి శివ‌లింగాన్ని ద‌ర్శిస్తారు.. ఎందుకంటే..?

by Admin
November 26, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

by Admin
September 23, 2025

...

Read more
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.