Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home inspiration

జీవితంపై విర‌క్తి క‌లిగిన ఓ అమ్మాయికి త‌న తండ్రి చెప్పిన మాట‌లు.. ఆలోచించాల్సిందే..

Admin by Admin
May 9, 2025
in inspiration, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఒకరోజు ఒక అమ్మాయి తన తండ్రి దగ్గరకి వచ్చింది. నాన్నా..! నేను ఈ కష్టాలు పడలేను. నాకు జీవితం అంటేనే విసుగేస్తోంది. నాకే ఇన్ని కష్టాలు రావాలా..? అంటూ తన బాధలను చెప్పుకుంటూ వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. తండ్రి మౌనంగా విన్నాడు. ఏమీ మాట్లాడలేదు. చిన్నగా నవ్వుకుంటూ వంటింట్లోకి నడిచాడు. గ్యాస్ పొయ్యి మీదున్న – మూడు బర్నర్ల మీద మూడు గిన్నెలు పెట్టాడు. వాటిల్లో నీళ్ళు పోసి ఒకదానిలో బంగాళా దుంపలు ( ఆలుగడ్డలు), మరొకదానిలో కోడిగుడ్లు, ఇంకో గిన్నెలో కాఫీగింజలు వేశాడు. తండ్రి తనతో అలా నిర్లక్ష్యముగా ఉండి, ఏమీ మాట్లాడకుండా చేస్తున్న పని మీద కోపం వస్తున్నా – అలాగే చూడసాగింది ఆ అమ్మాయి.

అలా 20 నిముషాలు మరిగించాక – స్టవ్ ని కట్టేసి, ఆ గిన్నెలను దింపి, వాటిని కూతురు ముందు పెట్టి ఏమి జరిగిందో పరిశీలింఛి చెప్పమన్నాడు. నాన్న అలా ఎందుకు చేసాడా పని.. అని అయోమయముగా ఉన్న ఆ కూతురు వాటిని పరిశీలించాక అంది, ఏముందీ..! దుంపలు మెత్తబడ్డాయి. కోడిగుడ్డు గట్టిపడింది. కాఫీ డికాషన్ వచ్చింది…….. అయినా ఇదంతా నన్ను ఎందుకు అడుగుతున్నావు నాన్నా?.. అంది.

a girl in depression father given good advice

అప్పుడు ఆ తండ్రి చిన్నగా నవ్వి, ఆ మూడింటికీ ఒకే రకమైన ప్రతికూలత ఎదురయ్యింది. అంటే ఒకేలా ఒకే రకమైన గిన్నెల్లో, అదే గ్యాస్ వేడినీ, వేడి నీటినీ చవిచూశాయి. కానీ, ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా స్పందించాయి అని గమనించావా? మామూలుగా గట్టిగా ఉండే దుంపలు ఇప్పుడు మెత్తబడ్డాయి. చితికిపోయే గుడ్డు గట్టిపడింది. గట్టిగా ఉండే కాఫీ గింజలు మెత్తపడి, వాటిలోని రసాన్ని ఊరించి, నీటిరంగునే మార్చింది.. అవునా..!! ఇప్పుడు చెప్పు.. వీటిల్లో – నీవు ఎలా ఉండాలి అనుకుంటున్నావు? మెత్తబడిపోతావా..? ( ఇప్పుడు నీవున్న స్థితి అదే.. )

గట్టిపడిపోతావా..? పరిస్థితులను మారుస్తావా…? ఇక్కడ నీదే ఎంపిక, దానిమీదే ఇందాక నీవడిగిన ప్రశ్నకి సమాధానం ఉంది.. అన్నాడు. ఆ అమ్మాయి మొఖంలో ఏదో తెలీని వెలుగు. కన్నీళ్లు ఆగిపోయాయి. బాధలేదు. దాని బదులుగా ఆ కళ్ళల్లో అంతులేని ఆత్మవిశ్వాసం కనిపించింది.. నాన్నా! యూ ఆర్ మై రియల్ హీరో.. మెంటార్.. ఎవర్ అండ్ ఫరెవర్.. కృతజ్ఞతాభావంతో అంది.

Tags: fathergirl
Previous Post

దిండును కౌగిలించుకుని ప‌డుకుంటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Next Post

అతి తెలివి చూపిస్తున్న పాకిస్తాన్.. భార‌త్ ముందు ఫ‌లించేనా..?

Related Posts

హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

September 26, 2025
ఆధ్యాత్మికం

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

September 26, 2025
ఆధ్యాత్మికం

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

September 25, 2025
వినోదం

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

September 25, 2025
ఆధ్యాత్మికం

మీ ఇంట్లోకి ఇలాంటి పక్షులు వస్తున్నాయా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

September 24, 2025
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

September 23, 2025

POPULAR POSTS

No Content Available
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.