Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home inspiration

రైలు లోంచి వాటర్ బాటిల్ విసిరితే ఏమవుతుంది.. తెలిస్తే, ఇంకెప్పుడూ అలా చెయ్యరు!

Admin by Admin
April 20, 2025
in inspiration, వార్త‌లు
Share on FacebookShare on Twitter

మీకు బస్సు ఎక్కడం ఇష్టమా? రైలు ఎక్కడం ఇష్టమా? అంటే.. చాలా మంది రైలే అంటారు. కారణం.. మన భారతీయ రైళ్లలో ఏదో తెలియని ఆనందం ఉంటుంది. ఎప్పుడూ రద్దీగా ఉండే రైల్వేస్టేషన్లు, అక్కడ రైలు కోసం ఎదురుచూడటాలు, రైలు వచ్చాక, సీటు కోసం తాపత్రయ పడటం, సామాన్లను జాగ్రత్తగా కింద పెట్టుకోవడం, ఆ తర్వాత రైలు కదలగానే.. అలా కిటికీ వైపు చూస్తూ ఉంటే, చెట్లన్నీ వెనక్కి వెళ్లిపోతూ.. మనం ముందుకి వెళ్లిపోతూ ఉంటే.. ఆ దృశ్యాలు మన మైండ్‌లో నిండిపోతాయి. ఇక స్టేషన్ల దగ్గర తినుబండారాలు కొనుక్కోవడం, పక్క ప్రయాణికులతో ముచ్చట్లు ఇవన్నీ.. ఎప్పటికీ గుర్తుంటాయి. ఐతే.. రైలు ప్రయాణంలో మనం ఒక పెద్ద తప్పు చేస్తూ ఉంటాం. ఏంటంటే.. వాటర్ బాటిల్‌లో వాటర్ తాగిన తర్వాత, ఖాళీ బాటిల్‌ని రైలు కిటికీ నుంచి బయటకు విసిరేస్తాం. ఎందుకంటే.. ఏం కాదులే అనే ఫీలింగ్.

అది సమస్య అవుతుంది అని మనలో చాలా మందికి తెలియదు. అందుకే అలా చేస్తాం. అందుకే ఈ విషయంపై ప్రయాణికుల్ని అలర్ట్ చేస్తూ.. తూర్పు రైల్వే.. ఓ వీడియోని షేర్చేసింది. అది ప్రయాణికుల్ని ఆలోచింపజేస్తోంది. ఆ వీడియోలో రైలు వెళ్తుండగా.. ఓ ప్రయాణికుడు.. ఖాళీ వాటర్ బాటిల్‌ని బయటకు విసిరేశాడు. అది పట్టాలపై పడి.. పట్టాల మధ్యలో ఇరుక్కుపోయింది. ఆ తర్వాత స్టేషన్ మాస్టర్‌కి అదే ట్రాక్‌పై వస్తున్న రైలు లోకో పైలట్ నుంచి కాల్ వచ్చింది. తాను ఆ ట్రాక్‌పై రావచ్చా అని అడిగితే.. స్టేషన్ మాస్టర్.. రావచ్చు అని చెబుతారు. కానీ అంతలోనే.. అక్కడ పట్టాలపై ఏదో సమస్య ఉంది అని సిగ్నల్ అలర్ట్ చూపిస్తుంది. అది చూసిన స్టేషన్ మాస్టర్.. అక్కడ ఏమైందో చెక్ చెయ్యమని రైల్వే ఉద్యోగులను పంపిస్తారు. ఆ ఉద్యోగులు.. అక్కడికి వెళ్లి చూడగా.. పట్టాల మధ్యలో ఇరుక్కుపోయిన వాటర్ బాటిల్ కనిపించింది. దాన్ని వారు జాగ్రత్తగా అక్కడి నుంచి తొలగించారు.

do not throw away water bottles from train know why

మనం ఖాళీ బాటిలే కదా అనుకుంటే.. అది పట్టాలపై ఎంత సమస్య అయ్యిందో ఈ వీడియో చూపిస్తోంది. అందుకే రైలు కోచ్‌లలో వ్యర్థాలను.. అదే కోచ్‌లో ఉండే డస్ట్ బిన్‌లలో వెయ్యాలే తప్ప.. కిటికీ నుంచి బయటకు విసిరేయకూడదు. దీని వల్ల రైలు ప్రయాణాలు ఆలస్యం అవుతున్నాయి. రోజూ దేశవ్యాప్తంగా కొన్ని లక్షల బాటిళ్లను ఇలాగే విసిరేస్తున్నారు. ఇవి పట్టాలపై పెను సమస్యగా మారుతున్నాయి. అందుకే ఇకపై ఇలా చెయ్యవద్దు అని వీడియోలో సూచించారు. చూశారుగా.. ఇప్పుడు మీకు ఏమనిపిస్తోంది. ఇకపై రైలు నుంచి వాటర్ బాటిళ్లే కాదు.. వేస్ట్ ఏదీ పారేయకూడదు అనిపిస్తోందా? అలా అనిపిస్తే, రైల్వే అధికారుల ప్రయత్నం ఫలించినట్లే. మన ఇంట్లో అంతా శుభ్రంగా ఉండాలని కోరుకుంటాం. మన దేశం కూడా శుభ్రంగా ఉండాలంటే.. అది మన చేతుల్లోనే ఉంది. డస్ట్ బిన్‌లోనే తుక్కు వేసే, చిన్న ప్రయత్నం.. పెద్ద ఫలితం ఇస్తుంది. వేస్ట్ అంతా.. పద్ధతి ప్రకారం మేనేజ్ అవుతుంది.

ट्रेन से पानी की बोतल फेंकना आसान है लेकिन उसका दुष्प्रभाव भी देखिए।

Worth Sharing. @AshwiniVaishnaw Ji pic.twitter.com/9jfhip2R2E

— Ashwani Dubey (@ashwani_dube) February 4, 2025

పట్టాలపై తుక్కు వేస్తే.. అది అక్కడే పోగై.. అనేక రకాల సమస్యలకు కారణం అవుతుంది. అందుకే స్వచ్ఛ భారత్‌లో మనమంతా కలిసి పనిచెయ్యాలి. మనందరి బాధ్యతాయుత చర్యలు.. మన దేశాన్ని అందంగా, సుందరంగా మార్చుతాయి. అంతే కదా.

Tags: train
Previous Post

చిరంజీవి సినిమాల్లోని ఏ సినిమాలో ఆయ‌న‌ నటించకుండా ఉండాల్సింది?

Next Post

మాన‌స స‌రోవ‌రంలో ఒక ఫోటోగ్రాఫ‌ర్ తీసిన ఈ హ‌నుమాన్ ఫొటో నిజ‌మేనా..?

Related Posts

ఆధ్యాత్మికం

చిన్నారుల‌కు చెవులు కుట్టించే ఆచారం వెనుక దాగి ఉన్న సైన్స్ ఇదే.. ఎలాంటి లాభాలు ఉంటాయంటే..?

July 22, 2025
హెల్త్ టిప్స్

వెల్లుల్లి జ్యూస్ తాగ‌డం వ‌ల్ల ఇన్ని ఉప‌యోగాలు ఉన్నాయా..?

July 22, 2025
Off Beat

ఏప్రిల్ 1వ తేదీన ఫూల్స్ డే అని ఎందుకు అంటారో తెలుసా..? వెనకున్న ఆసక్తికర విషయం ఇదే..!

July 21, 2025
vastu

బెడ్‌రూమ్‌లో ఈ వాస్తు చిట్కాల‌ను పాటిస్తే.. దంప‌తుల మ‌ధ్య అస‌లు గొడ‌వ‌లే ఉండ‌వు..

July 21, 2025
information

రైలు కడ్డీలు ఎందుకు అడ్డంగానే ఉంటాయి ? దానికి కారణం ఏంటి ? ?

July 21, 2025
ఆధ్యాత్మికం

న‌ర దిష్టి, న‌ర‌ఘోష త‌గ‌ల‌కుండా ఉండాలంటే.. ఈ చిన్న ప‌ని చేయండి చాలు..!

July 21, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.